Menu

Monthly Archive:: December 2013

అడూర్ తో ముఖాముఖి- ఎనిమిదవ భాగం

ఇండియన్ న్యూ వేవ్ లో తీసిన సినిమాలు చాలా మట్టుకు పల్లెల కథలతో, అక్కడి కుల, వర్గ, హింస సమస్యలతో తీసారు. కానీ అందుకు భిన్నంగా స్వయంవరం పట్టణంలో జరిగే ప్రేమకథ. కేరళలో ఈ పల్లెల కుల హింస ఇలాంటివన్నీ ఎప్పుడో జరిగినాయి, అది వర్తమాన చరిత్ర కాదిక్కడ. అందుకని అలాంటి కథలు సృష్టించడం ఉన్న సామాజిక నిజాన్ని వక్రీకరించడం అవుతుంది. ఎప్పుడో ముప్ఫయ్యేళ్ళ క్రితం కేరళలో తీసిన సినిమా ఇవ్వాళ్టి పేరిసియన్ (Parisian) యువతీ

అడూర్ తో ముఖాముఖి- ఏడవ భాగం

ప్ర: మీరు డిప్లమా కోసం తీసిన సినిమా దేన్ని గురించి? అడూర్: దానికి "గొప్ప రోజు" (A Great Day) అని పేరు పెట్టాను. ఒక పరమ బద్ధకస్తుడి గురించి, హాస్యభరితమైన కథ. ఆ రోజున ఈ బద్ధకస్తుడు పెళ్ళిచేసుకుందా మనుకున్న అమ్మాయి తండ్రి (కాబోయే మావగారు) మొదటిసారి అతణ్ణి చూడ్డానికి వస్తారు. వీడెంత బద్ధకస్తుడంటే ఎప్పుడూ ఏదీ సర్దడు, తన గదినైనా శుభ్రంగా ఉంచుకోడు. పొద్దున్నే పక్కలోంచి లేవకుండానే గుమ్మం దగ్గర్నించి

A Separation – ఓ విడతీత

రాత్రి 12 గంటలు. ఫేస్బుక్కుతో విసిగి..ఇహ పడుకుందాం అనుకుంటున్నా.. కానీ నిద్ర రావటం లేదు. ఏం చేయాలబ్బా.. సరే సినిమా చూద్దం కాసేపు..నిద్ర వచ్చేవరకు..  ఏదైనా.. దించుకున్న సినిమాల లిస్ట్ వెతుకుతుంటే కనిపించింది. ఈ సినిమా ‘ దించుకొని’  చాలా రోజులైంది. ఒకటో రెండు సార్లు అలా  ముందుకీ వెనక్కీ తిప్పి చూసాను. ఎక్కడా చూడు ఓ ఇద్దరు ముగ్గురు మనుషు, ఓ ముసలాడూ  ఏవో మాటలూ ….సర్లే ఏదో ఓపికతో చూడాల్సిన  సినిమాలాగా ఉన్నది అని

Bicycle Thieves

జీవితమొక పద్మవ్యూహం . ఇక్కడ మనం వేసే ప్రతి అడుగూ ఎడతెగని, అలుపెరుగని పోరాటం. అదిగో అక్కడ చూడండి! రోడ్డు మీద వందల సంఖ్యలో, నిరాశ నిస్పృహలు నిండిన కళ్లతో నీరసంగా నిలబడి ఉన్నారే వాళ్లను చూడండి. వాళ్లల్లో ఒకడిని ఎంచుకోండి. ఎవరైనా ఫరవాలేదు. దారిన పోయే అనేక మంది దానయ్యలలో ఎవరో ఒకరు చాలు. అతనే ఈ నాటి మన కథకు హీరో. ముందే చెప్పాను కదా, అతను మనందరి లాంటి వాడే! మన కథకు

అడూర్ తో ముఖాముఖి- ఆరవ భాగం

ప్ర: తిరువనంతపురంలోనా? అడూర్: జోనల్ కార్యాలయం తిరువనంతపురంలోనే కానీ పని కోసం కేరళ అంతా తిరగాల్సి వచ్చేది. పని కూడా ఆసక్తి కరంగానే ఉండేది. ఏమంటే ఎక్కడెక్కడో మారుమూల ప్రదేశాలకి వెళ్ళి, అక్కడక్కడా కొన్నాళ్ళైనా ఉండి వచ్చే అవకాశం అది. ఇలాంటి మారుమూల చోట్లకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. లేకపోతే ఏదైనా కొట్టు పైన చిన్న గది ఖాళీ ఉంటే అందులో ఉండేవాణ్ణి. ఆ రోజుల్లోనే నెలకి ఆరొందలంటే, మంచి జీతమే. ఒక కాలేజి