Menu

shame – వాంచాలోలత్వం .

ఈ సినిమా  ఏమిటీ అనేది ఒక  నిశ్చిత అభిప్రాయానికి రాలేము..  దర్శకుడు కూడా ఒక ఖచ్చితమైన ముగింపు ఇవ్వలేదు కూడా . ఇవ్వలేడుకూడా !! ఎందుకంటే ఇది కథకాదు ఏదో ఒక ముగింపు ఇవ్వటానికి. ఇందులో కథ లేదు. ఒక పాత్ర ..దాని స్వభావం అంతే !

ప్రపంచంలో  కోట్లమంది వ్యక్తులు ..ఒక్కో వ్యక్తీ తమ అభిరుచీ.ఇష్టాఇష్టాలకి అనుగుణంగా ఒక్కో ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు. ఆ ప్రపంచంలో బతుకుతుంటాడు. చుట్టు మనుషులే ఉంటారు.కాని తన ప్రపంచంవేరు.పెరుగుదలతో పాటు తన  ఇష్టాఇష్టాలని ఏర్పరచుకుంటాడు.   లైంగిక వాంఛ  అనేది ప్రాకృతిక శారీరక ధర్మం. మనిషి జంతువుకంటే ఎక్కువ ఆనందించగలడు. శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆనందాలు అనుభవించగలడు.

కామం  ఒక శారీరక మానసిక ఆనందం. ఆధ్యాత్మిక పరంగా  కూడా దానికో ప్రముఖ స్థానం ఇచ్చారు మనవాళ్ళు . అయితే కామేచ్చ అనేది వ్యక్తి మానసిక ఊహాల, ఆలోచనల పరంపరల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఊహాత్మకత ఆ వ్యక్తికి కామేచ్చని కలిగింస్తుంది.  వ్యక్తి అ ఊహాలకి అనుగుణంగ నిజ జీవితంలో తన కామేచ్చని తీర్చుకోప్రయత్నిస్తాడు.

వ్యక్తిలో కామేచ్చ చాలా రకాలుగా జరగొచ్చు..వినటం..చూడటం..చదవటం..స్పర్శ మొదలగు వాటిద్వారా.  అయితే  చూడటం ద్వారా ముఖ్యంగా పురుషుడికి లైంగిక వాంఛలు పెల్లుభుకుతాయి. ఇదంతా ప్రంపంచం లోని ఏ మానవుడికైనా వర్తిస్తుంది.. కానీ  ఆ కోరికల ఊహాలోకాన్ని అందుకోవటం చాలా అరుదు ఎవ్వరికైనా.

వ్యక్తికి తమ కోరికలకి కారణాలు తమకే తెలియదు. అవి ఎందుకలా ఏర్పడ్డాయీ.  జంతులా క్షణికంగానో.. లేదా సాంఘికంగా మనం తెలుసుకున్న విషయాలవల్ల కంటే కూడా చిన్ననాట వ్యక్తి లో పాతుకుపోయిన కొన్ని విషయాలు, సంఘటనల ద్వారా కూడా ఈ ఊహాప్రపంచం ఏర్పడుతుందని మానసిక శాస్త్రవేత్తలు  తేల్చారు. మానసిక- లైంగిక పరిణితి దశలోనే మనకి వ్యక్తి   కొన్ని విషయాలని లైంగిక స్పందనలుగా నిర్వచించుకొని వాటి ఆధారంగా తన లైంగిక ఊహాలోకాన్ని ఏర్పరచుకుంటాడు.

సినిమాగురించి చెప్పకుండా ఇదంతా ఎందుకు అంటారా ?? ఈ సినిమా  ఓ వ్యక్తి  అతని లైంగిక ప్రపంచం గురించి.. అలా అని ఏదో  అర్థం కాని సంక్లిష్ట కథాగానూ ఉండదు. ఆలోచించాలి అర్థం చేసుకోవాలి. ఈ విషయం  అందరికీ అనుభవంలోకి వచ్చినదై ఉండవచ్చు. రానిదీ కావచ్చు. అది ఎవరికి వారే తేల్చుకోవాలి.ఎందుకంటె ఎవరి ఉహాలోకం   వాళ్ళది.

బ్రాండన్ ఆఫీసుకు బయలుదేరాడు. ఎక్కవలసిన రైలు వచ్చింది. ఎక్కు కూర్చున్నాడు. గడచిన రాత్రి  జ్ఞాపకాలు వస్తున్నాయి. ఎదురుగా తోడి ప్రయాణీకులు.. ఎవరి ఆలోచనల్లో వాళ్లున్నారు. కాని ఒకమ్మాయి మీద అతని ద్రుష్టినిలిచించి. ఆమెని చూస్తున్నాడు. ఆమె తనలోకంలో తానుంది. కానీ బ్రాండన్ ఆమెనే గమనిస్తున్నాడు. ఆమె యధాలాపంగా అతన్ని చూసింది. తననే గమనిస్తున్నాడనే భావన కల్గింది. పురుషుడు తనని గమనిస్తున్నాడన్న విషయం గ్రహించగానే స్త్రీకి కోపమైనా కలుగుతుంది..సిగ్గైనా పడుతుంది. ఈమె సిగ్గుపడింది..ఆసిగ్గులోంచే ఒక చిరునవ్వు విరిసింది. ఆమె కూడా అతన్ని గమనించింది..అతని కళ్లని పట్టి చూసింది..కళ్ళు మాట్లాడుకున్నాయి..ఏవో  కబుర్లు ఒకరికొకరికి అందాయి..ఆమె తన స్టేషన్ వస్తోందని లేచి నిలుచుంది. ఆసరా కోసం తలుపు దగ్గర ఉన్న రాడ్ ని పట్టుకుంది. అందమైన ఆమె  వేళ్లని రెండు ఉంగరాలున్నాయి. ఒకటి నిశ్చితార్థం..మరోటి. పెళ్ళి ఉంగరం అయ్యిండొచ్చు. . అతడూ లేచాడు ..దాదాపు ఆమెని తాకుతూ నిలబడ్డాడు. ఆమె మనసులో వెయ్యి ఆలోచనలు..  అవన్నీ కళ్ల కదలికల్లో కనపడుతున్నాయి..చివరికి స్టేషన్ వచ్చింది. దాంతోటే ఆమె నిర్ణయం కూడా తీసుకుంది.. దిగిపోయింది. అతడు వెంబడించినా కనపడకుండా వెళ్ళిపోయింది.

మగగాడు తన కోరికలు తీర్చుకో ప్రయత్నిస్తాడు..కానీ స్త్రీ తనకోరికని చాలవరకు దమనం చేసుకోచూస్తుంది.

WOMAN TOO HAVE  FLIRTING FANTASY..BUT MOST OF THEM  HESITATE ..THEY AFRAID  FINALLY THEY  IGNORE .

బ్రాండన్ అనే వ్యక్తి తనదైన లైంకికవాంచలు..లైంగికఊహా ప్రపంచం లో ఉంటాడు.  పోర్నోగ్రఫీ..లైవ్ కామ్స్..చాటింగ్..సెక్స్ పుస్తకాలు అతని ఊహా ప్రపంచం. వాటిల్లో విహరిస్తూనే నచ్చిన  స్త్రీని ఆకర్షించి కోరికలు తీర్చుకుంటూంటాడు వాస్తవంలో.  ఒకనాడు  అకస్మాత్తుగా అతని చెల్లెలు ‘సిస్సీ’  తనింటికి వస్తుంది. తనకే ఆధారము లేదనీ ఓ నాలుగు రోజులుంటాను అంటుంది.

బ్రాండన్ కి ఇష్టం లేకున్నా తప్పదు.  స్వతహాగా స్త్రీకి భావోద్వేగాలు ఎక్కువ. ప్రేమించటం ప్రేమించబడటం వాళ్లకి నచ్చుతుంది.ప్రేమ  వాళ్లకి ఒక ఆధారం ..వాళ్ళకి ఒకింత స్వాంతన అవసరం. అందుకే  సిస్సీ తన ప్రేమికుడిని బ్రతిమాలుకుంటుంది. ప్రేమ ..అనుభంధాలు అన్నీ ఒక భావోద్వేగపు వల గా బ్రాండన్ భావిస్తుంటాడు. అతనికి ఎవ్వరితోనూ అనుభందం ఏర్పరుచుకోవటం ఇష్టం ఉండదు.

ఆమె ఇంటికి రావటంవల్ల అతని ‘జీవనవిధానాని’ కి చిన్న ‘అంతరాయం’ ఏర్పడుతుంది. మనిషి దేనికైనా సహిస్తాడు కానీ తనవాంచల ఊహా  ప్రపంచానికి కి భంగం కలిగితే మాత్రం తట్టుకోలేడు.  దానికితోడు తన అభిప్రాయాలకి భిన్నంగా సిస్సీ ఉన్నది. ఆమెకి అనుభందాలు ముఖ్యం.

 ఒకనాడు తన ఆఫీసులో పనిచేసే అమ్మాయితో ఆకర్షణలో పడతాడు. మొదటిరోజు మాటలతో ఒకరినొకరు తెలుసుకుంటారు. ఇద్దరూ వ్యతిరేక అభిప్రాయాలు కలిగిఉంటారు. తరవాత ఓ చోట  ఓ జంట తన్మయత్వాన్ని చూసీ కోరిక పెరిగి ఆమెతో తానుకూడా అలా ఆనందించాలని అనుకూంటాడు. మరునాడు ఆమెతో అదే హోటల్ కి వెళతాడు కానీ  అసలు సమయంలో పటుత్వం కోల్పొతాడు. దీంతో అతడు తెలుసుకున్నది ఏమీటంటే…ఏమాత్రం అలా అనుభందం ఏర్పడుతున్నా, తెలిసిన వ్యక్తులయినా  అది అతని వాంచని ప్రేరేపించదు.ఇలా  తానొక అసహజ ప్రవ్రుత్తిని ఏర్పరచుకున్నాడని గ్రహిస్తాడు.
నిజమైన ..సహజమైన ఊహాప్రపంచాన్ని కాక  పుస్తకాలవల్లనో.. పోర్న్ సినిమాల వల్ల తెచ్చిపెట్టుకునే కోరికల వల్ల అవి నిజంగా కోరిక తీర్చుకునే సమయానికి తన కోరికకి బలాన్ని   ఇవ్వకపోగా తగ్గించిపారేసాయన్న విషయం అర్థమయ్యి  కసిలో వాటన్నింటినీ పారేస్తాడు.

బ్రాండన్ టివీ చూస్తుండగా సిస్సీ వస్తుంది. ఆమెకి ప్రేమ కావాలి. మానసికంగా ఒక ఓదార్పు కావాలి. ఇదివరకు ఆమె  బ్రాండన్ బాస్ తో శారీరకంగా కలిసింది.అతడు తనకి ప్రేమనిఅందిస్తాడనుకుంది.కానీ బాస్ కి పెళ్లం ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే విషయం సిస్సీ తో చెపుతాడు. ఏ ప్రేమ ..స్వాంతనకోసం చూస్తున్నావో అది దొరకదు. నావద్దకూడా లేదు. నన్ను భందించకు అంటాడు.  సిస్సీ మాత్రం మనం ఒక కుటుంబం.. అన్నాచెళ్లెల్లం ఒకరికొకరం సహాయం చేసుకోవాలి.  అని అంటుంది. ఆవంకతో నా మీద ఆధారపడకు…నాకు భారం కాకు అంటాడు బ్రాండన్.

ఆతరవాత బ్రాండన్ బార్లో ఒకమ్మాయితో వాంచాపూరితంగా మాట్లాడి అమె బాయ్ ఫ్రెండ్తో తన్నులు తిని.. అప్పటిదాక పలుమార్లు సిస్సీ చేస్తున్న ఫోన్లని   పట్టించుకోకుండా  అటునుంచి ఒక గే బార్ కి  వెళ్ళి ..అటుమీద ఇద్దరు వ్యభిచారిణిలతో గడిపుతాడు. ఇంటికొచ్చేసరికి సిస్సీ రక్తపు మడుగులో పడుంటుంది.

హాస్పిటల్లో కోలుకుంటున్న సిస్సీని చూస్తాడు. అమె ఇదివరకు ఎన్నో సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు గ్రహిస్తాడు. ఇంటికి వస్తూంటే వర్షం పడుతుంది..అలా ఆ  అలా వర్షంలో తడిసి  రోదిస్తాడు.

బ్రాండన్ ఆఫీసుకు బయలుదేరాడు. ఎక్కవలసిన రైలు వచ్చీంది. ఎక్కు కూర్చున్నాడు.  తోడి ప్రయాణీకులు.. ఎవరి ఆలోచనల్లో వాళ్లున్నారు..బ్రాండన్ కూడా ఏదో ఆలోచనలో ఉండి యధాలాపంగా అటుచూసాడు. ఒకామె తనవైపే చూస్తోంది. తననే గమనిస్తోంది.  ఆమె పలకరింపు నవ్వు నవ్వుతోంది. ఆ నవ్వులోంచే ఒక సిగ్గు తొంగి చూసింది. కళ్ళలో ఏవో కబుర్లు చెపుతోంది. సవాళ్ళు విసిరింది… .బ్రాండన్ ఆమెనే చూస్తున్నాడు.. ఏదో గ్రహిస్తున్నాడు.  ఈఆమె తన స్టేషన్ వస్తోందని చూసి లేచి నిలుచుంది. వేళ్లకి రెండు ఉంగరాలున్నాయి. ఒకటి నిశ్చితార్థం..మరోటి. పెళ్ళి ఉంగరం.  ఆ చూడటంలో..ఆ లేవటంలో ఆ లేచి నిల్చోవటంలో ఏదో ఆహ్వానం కనిపించింది. కానీ బ్రాండన్ ఆమేనే గమనిస్తున్నాడు. ఆమెని తదేకంగా చూస్తున్నాడు. చూస్తూ కూర్చున్నాడు.  చివరికి స్టేషన్ వచ్చింది.

 

ఇది వరకు లైంగికతమీదా..స్త్రీపురుష స్వభావాల మీద ..లైంగిక వికలత్వం  ( perversion) ఇలాంటి విషయాలమీద చాలమంది దర్శకులు గొప్ప  సినిమాలు తీసారు. ఇది ‘లైంగిక లోలత్వం’ నికి సంభందించిది.. కొంచం భిన్నంగా అనిపించింది.  బహుశా అందుకే నేమో   పలు సినిమా పండగల్లో అవార్డులు సొంతం చేసుకున్నదీ సినిమా !

 
ఊరించే ఊహాప్రపంచమే వాస్తవ ప్రపంచపు జీవితానికి ఆధారం.  వాస్తవ ప్రపంచంలో ఎలా బతికినా మనిషికి తన ఊహా ప్రపంచమే అసలు జీవితం. MAN IS GOVERNED BY HIS IMAGINATION.