Menu

Monthly Archive:: November 2013

కె.బాలచందర్:ప్రశ్నలు-జవాబులు

దాదాపు పదేళ్ల క్రితం… అప్పటికింకా నవతరంగం మొదలు కాలేదు. బెంగుళురు లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. సుచిత్రా ఫిల్మ్ క్లబ్ లో బాలచందర్ “తనీర్ తనీర్” సినిమా స్క్రీనింగ్ కి వెళ్ళాను. అప్పటికి నేను సినిమాల గురించి రాయాలన్న ఆలోచనే లేదు. కానీ సుచిత్రా ఫిల్మ్ క్లబ్ లో ఉన్న సినిమా పుస్తకాలు చూసి మనకీ తెలుగులో ఎవరైనా రాస్తే బావుండనిపించింది. సినిమా అయ్యాక బాలచందర్ గారితో మాట్లాడే అవకాశం దొరికింది. ఆయనతో చేసిన ఇంటర్వ్యూ ఇది.

shame – వాంచాలోలత్వం .

ఈ సినిమా  ఏమిటీ అనేది ఒక  నిశ్చిత అభిప్రాయానికి రాలేము..  దర్శకుడు కూడా ఒక ఖచ్చితమైన ముగింపు ఇవ్వలేదు కూడా . ఇవ్వలేడుకూడా !! ఎందుకంటే ఇది కథకాదు ఏదో ఒక ముగింపు ఇవ్వటానికి. ఇందులో కథ లేదు. ఒక పాత్ర ..దాని స్వభావం అంతే ! ప్రపంచంలో  కోట్లమంది వ్యక్తులు ..ఒక్కో వ్యక్తీ తమ అభిరుచీ.ఇష్టాఇష్టాలకి అనుగుణంగా ఒక్కో ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు. ఆ ప్రపంచంలో బతుకుతుంటాడు. చుట్టు మనుషులే ఉంటారు.కాని తన ప్రపంచంవేరు.పెరుగుదలతో పాటు తన