Menu

Happiest Girl in the World

గత కొన్నేళ్ళుగా రొమానియన్ సినిమాలకు అంతర్జాతీయంగా మంచి ప్రాచుర్యం లభించింది. కొన్నేళ్ళు క్రితం Cannes చలనచిత్రోత్సవంలో అత్యుత్తమ సినిమాగా 4 Months, 3 Weeks, 2 Days అనే రొమానియన్ సినిమా ఎన్నుకోబడిన తర్వాత ఈ దేశం నుంచి వస్తున్న సినిమాలపై సినీ అభిమానులు ఓ కన్నేసి ఉంచినమాట నిజం. అయితే ఆ తర్వాత మరీ అంతగా చెప్పుకోదగ్గ రొమానియన్ సినిమాలేవీ రాలేదనే చెప్పాలి. వచ్చిన వాటిల్లో Perscuit Sportive అనే సినిమా కొన్ని చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి మంచి పేరే తెచ్చుకుంది.

ఒక కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళు తమ ప్రమోషన్ లో భాగం ఏర్పాటు చేసిన ఒక పోటీలో Delia అనే అమ్మాయి ఒక కొత్త కారు బహుమతిగా గెలుచుకుంటుంది. ఈ కారు బహుమతిగా అందుకోవడానికి ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి బుకారెస్ట్ వస్తుంది. బుకరెస్ట్ లో ఆ కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక షూట్ లో పాల్గొన్నాక ఆ కారుతో పాటు తన ఊరికి వెళ్ళి తన స్నేహితురాళ్ళకు ఆ కారు చూపించాలని ఆ అమ్మాయి కోరిక. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులేమో ఆ కారు బుకరెస్ట్ లోనే ఎవరికైనా అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో తమ ఊర్లో ఒక గెస్ట్ హౌస్ నిర్మించి అక్కడికొచ్చే టూరిస్ట్ లకి అద్దెకివ్వడం ద్వారా డబ్బుకు సంపాదించాలని కోరిక.

ఇంతే కథ. సినిమా మొత్తం ఆ తల్లి దండ్రులు ఆ అమ్మాయిని ఒప్పించడానికి చేసే ప్రయత్నాలతో నడుస్తుంది. వీళ్ళ మధ్య ఈ చర్చలు సాగుతుండగా మరో వైపు ఆ అమ్మాయితో షూట్ చెయ్యబోయే యాడ్ ఫిల్మ్ యూనిట్ కి సంబంధించిన crew కష్టాలు మరో వైపు. వినడానికి చాలా పేలవంగా అనిపించే ఈ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ చూసిన అతి కొద్ది మంచి సినిమాల్లో ఒకటి.

ఈ సినిమా నాకు అంతగా నచ్చడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఒకటి సినిమా మొత్తం చాలా lighter vein లో సాగుతుంది. ఇప్పటి వరకూ నేను చూసిన రొమానియన్ సినిమాల్లో దాదాపు అన్నింటిలోనూ గత కాలపు చేదు అనుభవాలతో నిండిపోయి చాలా సీరియస్ గా ఉన్నవే. ఈ సినిమా మాత్రం full lenght కామెడీ అని చెప్పొచ్చు. కాకపోతే మరీ విరగబడి నవ్వే హాస్యం కాదు కానీ కాస్త సెటైరికల్ కామెడీ అని చెప్పొచ్చు.

కేవలం హాస్యభరిత చిత్రమనే కాదు కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే సినిమా తీసిన లొకషన్. ఈ సినిమా లో 90 శాతం బుకరెస్ట్ లోని యూనివర్శిటీ ఏరియాలో చిత్రీకరించారు. ఈ ఏరియా గురించి చెప్పాలంటే మన హైదరాబాదులో పంజగుట్టా ఏరియా లాంటిదన్నమాట. అలాంటి ఏరియాలో కనీసం నెలరోజులైనా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఒక ట్రాఫిక్ సమస్య లేదు, జనాలు ఆగి చూడడం లేదు. షూటింగ్ పాటికి షూటింగ్, జనాల పాటికి జనాలు. అంటే నేను ఈ సినిమా షూటింగ్ చూసానని కాదు, సినిమా చూస్తుంటే అలా అనిపించింది. ఎంత లేదన్నా సినిమా షూటింగ్ అంటే అసలేమీ పట్టించుకోని జనాలుంటారంటే నాకు అనుమానమే. అయితే సినిమాలో ఎక్కడా జనాలు చూస్తున్నట్టు, ఆగి గమనిస్తున్నట్టు అనిపించలేదు. ఇదెలా సాధ్యం అని కాసేపు ఆలోచించాక నాకు తట్టింది.

బహుశా ఇది film with in a film కావడం చేత దర్శకుడు చాలా తెలివిగా ఈ సమస్యను అధిగమించి ఉంటాడనిపించింది. ముందే చెప్పినట్టు ఈ సినిమాలో మరో యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుందని చెప్పాను కదా. ఆ షూటింగ్ లో కెమెరా కేవలం ఒకే చోట ఉంటుంది. క్రేన్ పై నున్న కెమెరా యాక్షన్ చెప్పగానే కిందకు దిగుతూ ఆ అమ్మాయి చెప్పే డైలాగులు రికార్డు చెయ్యడం ఒక షాట్. దాదాపు సినిమా మొత్తం ఈ సీన్ చిత్రీకరించడంలోనే నడుస్తుంది. అయితే దారిన పోయే జనాలు  ఈ కెమెరాని గమనించి ఉంటారు కానీ ఈ తతంగాన్నంతా షూట్ చేస్తున్న అసలు కెమెరా ని పట్టించుకోకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చనిపించింది. అలాగే ఒక వేళ ఎవరైనా షూటింగ్ చూస్తున్నట్టు ఈ కెమెరా రికార్డు చేసినా ఆ చూసే వాళ్ళు సినిమాలో షూటింగ్ చూస్తున్నట్టుగా మనం భ్రమించేలా చిత్రీకరించారు. అంటే సినిమాకి ఇది మరీ అంత ముఖ్య మైన విషయం కాకపోయినా సినిమా మొత్తం నగరం నడిబొడ్డులోని ఒక ముఖ్యమైన లొకేషన్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు జనాలు షూటింగ్ చూస్తున్నట్టుగా అనిపించకుండా సినిమా తీయడం అనేది మాటలు కాదు. సత్యజిత్ రే ఒక చోటన్నారు. మనకున్న పెద్ద సమస్యల్లో ఒకటి-షూటింగ్ అనగానే చుట్టూతా జనాలు పోగైపోవడం. Godard సినిమా Breathless తీసుకోండి. అది ఆ రోజుల్లో క్రేన్లు, ట్రాలీలు ఏమీ లేకుండా చేత్తోకెమెరా పట్టుకుని నడి రోడ్డు మీద షూటింగ్ చేశారు. ఇంకా చెప్పాలంటే వీల్ ఛైర్ లో కెమెరామ్యాన్ కూర్చుంటే వెనకాల ఒకతను తోస్తూ ట్రాలీగా ఉపయోగించారట. అయితే చూడ్డానికి ఈ సన్నివేశం ఎంతో మంది దారిని పోయే వ్యక్తులను ఆకట్టుకోవాలి. కానీ Breathless చూడండి. జనాలు మరీ ఆబగా వచ్చి కెమెరా వైపు చూస్తున్నట్టుగా కనిపించరు. అదే మన దగ్గర ఇలాంటి సౌలభ్యం ఉండి ఉంటే ఎన్ని మంచి సినిమాలు (అట్ లీస్ట్ సీన్లకు) రావడానికి అవకాశం ఉండేదో. మొన్నేదో తెలుగు సినిమా చూస్తుంటే స్మశానం లో ఒక భారీ సీన లో వెనుక ఉన్న జనాలు కెమెరా వైపు చూసి చేతులూపుతున్నారు. పట్టించుకోకపోతే సరే కానీ అది చూసాక ఆ సీన్ నాకస్సలు ఎక్కలేదు.

ఇవన్నీ కాకపోయినా సినిమాలో నాకు బాగా నచ్చిన మరో అంశం లాంగ్ టేక్స్. నాకీ లాంగ్ టేక్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఇక్కడొక సమస్య ఉంది. How long is long అనేది ప్రశ్న. అయితే నా అభిప్రాయం ప్రకారం there is nothing too long in a film. ఎందుకంటే, నాకు తెలిసినంతవరకూ, ప్రస్తుతం ఉన్న పరిమితుల దృష్ట్యా ఏకధాటిన పది-పదిహేను నిమషాలకంటే ఎక్కువ సేపు ఒక సీన్ షూట్ చెయ్యడం కుదరదు. అయితే ఈ లాంగ్ టేక్స్ లో రెండు రకాలు. Ozu సినిమాల్లో లాగా కెమెరా ఒకే దగ్గర ఫిక్స్ అయిపోవడం ఒక రకం. మరో రకమైన లాంగ్ టేక్ లో కెమెరా కదలిక కలిగి ఉంటుంది. రెండింటిలో ఏది బెస్ట్ అని చెప్పలేము. కొన్ని సీన్లకు కెమెరా స్థిరంగా ఉంటేనే మంచిది. నాకైతే క్యారెక్టర్లను ప్రేక్షకులకు దగ్గరగా తేవాలంటే కెమెరా స్థిరంగానే ఉంచితే మంచిదనిపిస్తుంది. అయితే ఇద్దరు మాట్లాడుకుంటుంటే కెమెరా ఒక దగ్గరుంచేసి వారి సంభాషణను రికార్డ్ చేస్తే జనాలకి బోర్ కొట్టదూ అనిపించేది నాకు ఒకప్పడు. అయితే ఈ విషయం గురించి Godard చెప్పిన విషయం విన్నాక నా అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను. ఒక సీన్ కట్ చెయ్యకుండా కెమెరా స్థిరంగా ఉంచితే మొదట్లో ప్రేక్షకులు కాస్త అసహనానికి గురయ్యే మాట నిజమే కానీ కెమెరాను అలాగే ఇంకొంచెం సేపు స్థిరంగా ఉంచేస్తే ప్రేక్షకుడు సీన్లో ఇన్వాల్వ్ అయిపోతారు అని Godard అంటారు. ఈ మధ్య వచ్చిన రొమానియన్ సినిమాలు చూస్తే ఈ విషయం మీరు తప్పక గమనించవచ్చు. రొమానియన్ సినిమాలోని లాంగ్ టేక్ లు ఫ్రెంచ్ న్యూవేవ్ సినిమాలకు జంప్ కట్స్ లాగా ఒక ఐడెంటిటీ అయినా ఆశ్చర్యం లేదు.

ఇక చివరిగా సినిమాలో నటించిన వాళ్ళందరికీ దాదాపుగా ఇది మొదటి సినిమా. అయినప్పటికీ ఎంతో బాగా నటించారు. ఈ సినిమా దర్శకుడికి కూడా ఇదే మొదటి సినిమా. ఈ సినిమా ఈ మధ్యనే జరిగిన బెర్లిన్ చలన చిత్రోత్సవంలో పాల్గొని C.I.C.A.E Prize కూడా గెల్చుకుంది. రాబోయే రోజుల్లో మరి కొన్ని చలనచిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రదర్శింపబడి మరింత మందికి ఈ సినిమా చేరువవుతుందని అనుకుంటున్నాను. వీలుంటే చూడండి.

ఈ సినిమా గురించి మరికొన్ని విశేషాలు:

Synopsis:

Delia (18) comes from a poor family living in a small Romanian town. She is the winner of an
advertising campaign: she sent three juice-bottles labels and won an expensive car. Delia and her parents, has to come to Bucharest for the promotion testimonial – a video showing Delia to the whole country, as a proof that the refreshments company keeps its promises and grants the awards.After the long way to Bucharest, the family finally arrives to the shooting place – a big square in the middle of the city.

She spends the day doing the shooting. What she has to do seems quite easy: she has to sit in the car in front of the wheel, to drink juice and thank the organizing company. The shooting goes on with the ordinary problems: Delia keeps forgetting the text, the soda doesn’t look good enough-for the client, they have to refresh her make-up all the time, the shooting angle needs to be changed, some spotlights break etc.

During the shooting breaks, Delia has long talks with her parents – that eventually turn into ugly arguments. The discussion is about what they should do with the car: Delia wants to keep it for herself, while her parents would like to sell it and escape in this way from poverty.

The argument becomes more tensed, while the shooting becomes more stupid and absurd. What seemed to be at the beginning a lucky event becomes for Delia an extreme and emotionally painful situation, in which she has to rethink and question her family relationship.

Director’s Statement

In 2005 I was preparing a short film with a friend of mine, Andrei Butic\, a director of photography.At some point, I told him a story I witnessed at one of my first “professional” shootings. I was supposed to film a teenager girl coming from a poor background. She was supposed to look happily at the camera and tell us how she sent in three juice bottle labels and won a car. The girl was not happy at all, on the contrary, she was feeling miserable because her parents decided that she should sell the car, so that they could pay some debts. Andrei told me that this story could become a good film. Encouraged by him, I wrote together with Augustina Stanciu a 30 pages script. It wasn’t really working, the story was too hurried, so, little by little, we transformed it into a longer script.

Actually, I never knew for sure what’s this story about, what’s the meaning of it. I thought that it could be
about many different things. About how the people think about what’s good for them. About  compromises and lies. About the language of film being used in order to cheat. About being a scared teenager and not having the guts to fight your parents to the end. About what it is to be a parent who must take profit of his/her own child in order to fulfill the future plans. About happiness, sadness and consume. About capitalism. About the way sun goes down in University Square during the summer.

Seeing the film completed, I don’t know how many of the above mentioned remained. I don’t know whether the film is good or bad. I don’t have nor the skill, neither the distance to realize it. And, fortunately, it’s not my business to do it. I only hope that whoever will see the film will find in it something meaningful and emotional.

దర్శకుడు Radu Jude గురించి:

Radu was born in Bucharest, in 1977. In 2003 he graduated the Media University – Filmmaking Department. He worked as an assistant director for feature films shot in Romania, like “Amen” (by Costa-Gavras) and The “Death of Mr. Lazarescu” (by Cristi Puiu).

He directed the short films “Wrestling” (2003), “The Black Sea” (2004), “The Tube with a Hat” (2006) – the most awarded Romanian short of all times, winner of main prizes in Sundance, San Francisco, Los Angeles, Grimstad, Hamburg, Bilbao, Huesca, Trieste, Montpellier, Cottbus, Aspen, Indielisboa, Bruxelles, Mediawave, Cracow, Almeria, Valencia, Uppsala and selected in: Toronto, Telluride, New Directors/NewFilms, Tampere, Rotterdam, Huesca etc., “In the Morning” (TV film, 2007), “Alexandra” (2007) – selected in Clermont-Ferrand, awarded in Oberhausen and approx.100 advertising commercials.

The Happiest Girl in the World represents Radu’s debut in feature film. The project won the NHK/Filmmaker Award in Sundance 2008, being selected in the Berlinale-Forum 2009.

6 Comments
  1. గీతాచార్య March 31, 2009 /
  2. రాజశేఖర్ April 2, 2009 /
  3. murali ravikanti April 17, 2009 /