Menu

Monthly Archive:: November 2013

Werckmeister Harmonies – ఒక చింతన

పరిచయం: నా జీవితంలో చాలా సినిమాలు చూసాను కానీ, కొన్ని సినిమాల గురించి రాయడానికి కొంత ధైర్యం కావాలి; దానికి మించి ఎంతో అవగాహన కావాలి. ఉదాహరణకి, Tarkovsky సినిమాలు. ఇప్పటికి నేను ఆయన సినిమాలు దాదాపు అన్నీ రెండు మూడూ సార్లు చూశాను కానీ ఆ సినిమాల గురించి రాయాలంటే మాత్రం తెల్ల కాగితం పై ఒక్క అక్షరం పెట్టాలన్నా వీలుకాదు. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్న ’వర్ణణాతీతం’ అనే పదం ఇలాంటి సినిమాలు చూసినప్పుడే నిజంగా

కెంజి మిజొగుచి – పరిచయం

జపనీస్ సినిమా అనగానే సాధారణంగా అకిరా కురసావా పేరే గుర్తొస్తుంది. అకిరా కురసావా తో పాటు యసుజిరో ఓజు మరియు కెంజి మిజొగుచి లు కూడా జపనీస్ సినిమాకే కాకుండా ప్రపంచ సినిమా చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్నారు. వీరు ముగ్గురిని జపనీస్ సినిమా స్వర్ణయుగపు నాటి త్రిమూర్తులుగా వర్ణించవచ్చు. వీరి ముగ్గురిలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని నిర్ణయించడం కష్టమే కాకుండా అలాంటి ప్రయత్నం చేయడం కూడా వృధా ప్రయాసే. తమ తమ

అడూర్ తో ముఖాముఖి-మొదటి భాగం

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మలయాళీ దర్శకుడు ఆడూర్ గోపాల్ కృష్ణన్ తో ’సినిమా ఆఫ్ మలయాళం’ అనే వెబ్ సైట్లో ’డీప్ ఫోకస్’ పేరుతో సి.యస్.వెంకటేశ్వరన్ గారు నిర్వహించిన ముఖాముఖి ని తెలుగులోకి అనువదించి నవతరంగం పాఠకులకు అందచేయాలనే మా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని అనుమతి ఇచ్చిన రాజగోపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ముఖాముఖి ద్వారా ఆడూర్ తన జీవితం-సినిమా గురించి ఎన్నో విలువైన విషయాలు తెలియచేశారు. పాతిక పేజీలు పైగా ఉన్న ఈ ముఖాముఖి

Beyond the Hills – విశ్వాసాలకి ఆవలివైపు

దేవుడు అనేవాడుంటే మనుషుల మధ్య ప్రేమని ఒప్పుకోక కేవలం తననే ప్రేమించాలని అనుకుంటాడా ? దేవుడిని చేరాలంటే దేవుడికి అంకితమవ్వాల్సిందేనా ?? సాధారణ జీవితం గడుపుతూ దేవుడికి చేరువకాలేమా ?? బ్రహ్మచర్యం/ సన్యాసంతోనే దైవకృప దొరుకుతుందా ? ఇది ఒక విభిన్నమైన ప్రేమ కథ. మతమూ..విశ్వాసమూ..అతీతశక్తులు..అపోహల ని చర్చించే కథ. ఊరికి దూరంగా ఒకగుట్టమీద మతాశ్రమం. అక్కడ ఓ పదిమంది సన్యాసినులు.. ఒక ఫాదర్, ఇహలోకం లోని ప్రతిపనీ ఒక పాపంగా. దేవుడి ప్రేమకి పాత్రులవటమే జీవితంగా

Children of Heaven

అందమైన జీవితమంటే అన్నీ ఉండడం కాదు. ఏది అవసరం లేదో తెలుసుకోవడం. సాయంత్రమైంది. ఆలీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే అమ్మ పని చెప్పింది. మొదట చిరిగిపోయిన చెల్లిలి స్కూల్ షూస్ కుట్టించుకు రావాలి. ఆ తర్వాత బేకరీ కి వెళ్లి రొట్టెలు కొనాలి. చివరిగా కూరగాయల షాప్ లో కేజీ ఆలుగడ్డలు కొనాలి. మొదటి రెండు పనులూ అయిపోయాయి. కూరగాయల షాప్లోకి వెళ్తూ చెల్లెలి షూస్ ని, రొట్టెలున్న సంచీ ని బయటే వదిలి లోపలకి