Menu

The lunch box – taste of life

ఓ నడివయస్కుడు !
ముప్పై అయిదేళ్ళ గానుగెద్దుబతుకు.. తోడులేని జీవితం.. అదే ఆఫీసు..అదే పని..అదేతిండి.. అదే ఒంటరితనం.
ఓ ఇల్లాలు !
ఆదరాబాదరాగా పాపని స్కూలుకి పంపటం.. భర్తకి క్యారేజీ పంపించటం..పైఅంతస్తులో ఉండే ముసలమ్మతో నాలుగు మాటలు..భర్త రాకకోసం , ఆపై అతని ప్రేమ కోసం వేచిచూడటం..కమ్మగా వండి భర్తని దగ్గరచేసుకోమన్న ముసలమ్మ సలహా తో చక్కగా కొత్తరుచులు వండి  పంపిన క్యారేజీ అడ్రస్ మారి అది అతనికి చేరింది.
అతడా  రోజు ఆఫీసులో భోజనానికి కూర్చుని కారజ్ మూతతీయగానే కమ్మటివాసన. రుచి చూస్తే అమోఘం. రోజూ చేసి పంపించే హోటల్ వాడు కొత్తగా ఇంతరుచిగా  పంపించటమేమిటీ అనే సందేహం..ఎక్కువసమయం పట్టకుండానే  ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ  మరునాడు బాక్స్ తో పాటు చిన్న ఉత్తరం.
అతనికి…  రోజూ క్యారేజీలో ఘుమఘుమగా కమ్మని భోజనంతో పాటు మనసు విచ్చుకునే ఉత్తరం. తానా ఉత్తరానికి జవాబు రాయటం. మరునాడు ఉత్తరం కోసం వేచి చూడటం.. అతనికిది దినచర్యలో భాగం.
ఆమెకి …  రుచిగా వండి పంపటం,  ఖాలీ  కారేజీ తో బాటు ఉత్తరం తెచ్చే సంతోషం కోసం ఎదురుచూడటం…ఆమెకిది  జీవితంలో  చిన్ననమ్మకం.
ముంబై లాంటి నగరంలో.. మహాజనసముద్రంలో … చుట్టూ జనాలు.. ఇరుకు ఇరుకుగా ప్రయాణాలు..  పక్కనే మనుషులు.. కానీ ఒంటరిమనసులు.కలిసి విడిపోయిన బంధాలు.. కలుసున్నా విడివడిన జంటలు.. ఓ తోడుకై ఆరాటపడే మసుషులు..కాసింత ప్రేమకై తపన పడే మనసులు.
కొన్ని సార్లు జీవిత ప్రయాణంలో  ఎక్కకూడని రైలెక్కినా అది మన గమ్యానికి చేర్చవచ్చు అనే చిన్న ఆశ జీవితాల్లో !
సరళమైన కథ.. చక్కని చిత్రీకరణ.. నిండయిన నటన.. మనసులోతుల్లో పలుచని తెరలు..  కనపడని  ఆ తంత్రులని  మీటేన  భావోద్వేగాలు…అవి వినిపించే జీవన రాగాలు.

its The lunch box  –  taste of life.

 

 

2 Comments
  1. డింగు October 4, 2013 /
  2. apkari surya prakash October 6, 2013 /