Menu

smashed – ఓ గెలుపు కథ.

                    
మొదట వ్యసనం శరణార్థిలా వస్తుంది – తరవాత యజమానిలా శాశిస్తుంది.

తాగినపుడు  ప్రపంచం కాళ్లకింద ఉన్నట్టనిపిస్తుంది… పెద్ద విషయం చిన్నదిగా..చిన్న విషయం పెద్దదిగా కనపడుతుంది. మనసులోని మాటలు అలా తన్నుకొస్తాయి…గుండెల్లోని ప్రేమ పెళ్ళుబుకుతుంది… కోపం కట్టలు తెగుతుంది… మనుషులని చూస్తే జాలేస్తుంది…కరుణ రసంపొంగి కన్నీళ్ళోస్తాయి.. మనమీద మనకి పిచ్చి నమ్మకం కలుగుతుంది.. ధైర్యం పొంగుతుంది.. ఆత్మవిశ్వాసం నాలుగింతలవుతుంది… కవిత్వం నోటివెంట పారుతుంది. కొత్తబాషలు వచ్చేస్తాయ్.. మొత్తంమీద మనకి మనం ఒక కొత్త మనిషిలా, మనం  ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉన్నామని అనిపిస్తాం. …..కానీ చూసేవాళ్లకి ???
తెల్లారి మత్తు దిగగానే ?? .. ఇదివరకున్నది కూడా కోల్పోతాం.

ఇదేం గొప్ప సినిమా కాదు. కథ కథనం చాలా మామూలు విషయాలు. అయినా అంత సరళమైన కథా తీసుకునేది ?  ఆ సినిమాటోగ్రఫీ ఏంటి?  సినిమాలా లేదే.. కళ్లముందు జరుగుతున్నట్టు చిత్రీకరించారు.  ఆ హీరోఇన్ ఏంటి ఏకంగా జీవిస్తోంది నటించవమ్మా అంటే   !!   సర్లే ..

 నా పేరు కేట్ హన్నా.. నేను తాగుబోతుని…
ఏమో  నేనుతాగుబోతునో కాదో.. కానీ నిజంగా  అతిగా తాగుతాను..
అవును.. ఎప్పుడూ అతిగా తాగుతాను,  అందరికీ  తెలుసు కూడా..  అందుకే అది  పెద్ద  సమస్య అనుకోవటం లేదు.
కానీ.. కానీ … మెల్లిగా అర్థం అయ్యింది.. ఇది ఏదో  రకమైన సమస్య అని. ఎప్పుడంటే  తాగి పక్క తడిపేసినపుడు.
ఎందుకో తాగినప్పుడల్లా   విపరీత విషయాలు జరిగేవి . అన్నీ తమాషాలు…
కాని అవి తమాషా నుండి బాధాకరంగా …భయంకరంగా అవుతున్నాయి… అందుకే ..అందుకే  నేను కొంచం భయపడుతున్నాను.

కేట్ ఎలిమెంటరీ స్కూల్లో ఉపాధ్యాయురాలు. తాగుబోతు. ఓ రోజు  రాత్రి బాగా తాగింది కాక, స్కూలు దాక వచ్చాక కారులో కనపడ్డ సీసాని ఖాలీ చేస్తుంది.

 పాటం చెబుతూ క్లాసులోనే   వాంతి చేసుకుంటుంది.  పిల్లల సంగతి  తెలిసిందే కదా,   వెనకాముందు చూడకుండా అడిగేస్తారు, వాళ్ళకేమీ తెలియకున్నా.
అందుకే అడీగారు టీచరమ్మని  మీరు ‘ప్రెగ్నెంటా’ అని. ఇంత చిన్న వెధవలు ఇలా ఎలా అడిగారబ్బా అని ఆలోచిస్తూనే ‘అవునూ’ అంటుంది.దానికి తోడు తాగొచ్చి క్లాసులో వాంతి చేసుకున్నా అంటే ఉద్యోగానికే ఎసరు మరి.  కానీ సహాధ్యాయుడు డేవ్ కి మాత్రం విషయం తెలుసు.అయినా తాను ఆ విషయం ఎవ్వరికీ చెప్పననీ అంటాడు.

విషయం ప్రధానోపాధ్యాయురాలికి తెలుస్తుంది. తనకి పిల్లలంటే ఇష్టమనీ తాను పిల్లలని కనలేక పోయాననీ అందుకే పిల్లల స్కూల్ పెట్టుకున్నాననీ అభినందనలు తెలుపటంతో  ఆమెకి అసలు విషయం చెప్పాలేక పోతుంది కేట్.
అలా విషయం తెలిసి  స్కూల్ స్టాఫ్  అందరూ అభినందనలు తెలుపుతారు.

తాగి  స్కూలు పిల్లల ముందే వాంతి చేసుకోవటం… తాగి పక్క తడపటం..ఆగలేక మూత్ర విసర్జన ఆపుకోలేకపోవటం..

చిత్తుగా తాగి పడిపోయి తెల్లారే సరికి ఆశ్చర్యంగా ఎక్కడో రోడ్డుపక్కన తనను తాను చూసుకొని బాధ పడటం..మళ్లీ తాగటం ఇదీ ఆమె చేసే పని.

పోనీ భర్తకు చెపుదామా ఆంటే అతనూ పెద్ద తాగుబోతే,  సగం ‘ ప్రేమించేస్తూనే ‘  మత్తులోకి జోగే రకం. ఎవ్వరికీ చెప్పకూడదూ అన్న రహస్యవిషయం తాగి వాగేసే  రకం.

కేట్ కి తన తాగుబోతు తనం సిగ్గు చేటుగా అనిపిస్తుంది.   అలాంటి పరిస్థితుల్లో తన సహాధ్యాయుడు ‘డేవ్’  ద్వారా  తాగుడు మానిన సంఘం  AA ( http://www.aa.org/) లో చేరి మెల్లిగా తాగుడు మానుతూంటుంది. భర్త మాత్రం తాగుడూ కంటిన్యూ చేస్తుంటాడు.
ఓ రోజు స్కూల్లో గడుగ్గాయిలు మల్లీ అడుగుతారు ” మీరు ప్రెగ్నెంట్ కదా..లావు అవ్వాలి కదా అని ” అలా అక్కడ పిల్లలడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నలిగి పోతుంది. అదే విషయం భర్తతో చెపితే.. ప్రిన్సిపాల్ కి తాను గర్భవతి కాదన్న విషయం చెప్పేయ్..పోతేపోతుంది మనకవసరమా జాబ్ ? ఇద్దరం హాయిగా ఇలా తాగుతూ ఉందాం అంటాడు. నీలా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండమంటావా ? అంటుంది.  అలా  మాట మాట పెరిగి ఇద్దరి ‘మధ్యదూరం’ పెరుగుతుంది.

 

మరి నాడు అసలు విషయం ప్రిస్నిపాల్ కి చెప్పటం.. స్కూలు నుంచి వెళ్లగొట్టటం జరుగుతాయి.  బాధకి మళ్ళీ తాగి భర్తమీద అరిచి  గొడవపడి వేరుపడుతుంది.
 సంవత్సరం గడుస్తుంది.  కేట్  తాగుడు నించి పూర్తిగా కోలుకుంటుంది. భర్త మాత్రం అమెని ప్రేమిస్తూ ఆమె జ్ఞాపకాల్లో తాగుతూనే ఉంటాడు.కేట్ పుట్టిన రోజు .. మీటింగులో జరుగూతుంది.హాయ్ కేట్ ..  తాగుబొతుని…
నాకు తెలిసిన ఒక విషయం…   ఒక తాగిన ‘మంచి రోజు’ ..  తాగని ‘ చెడ్డరోజు’  కన్నా చెడ్డది అంటారు. కాని అది నిజం కాదు..
ఎందుకంటే…నేను  తాగి నవ్వుతూ.. తుళ్ళుతూ  చాలా అద్భుతమైన రోజులు గడిపాను. తాగి ఒక ప్రపంచానికే పూజనీయమైన అమ్మాయినని అనుకునేదాన్ని.
అది నిజమే.. నిజమే.. ఎందుకంటే బట్టల్లోనే పోసుకునేదాన్ని..అయినా నేను పూజనీయమే !
నేను తాగకుండా ఉండాలని ప్రయత్నించిన తొలి నాళ్లలో … తాగకుండా ఉంటే చాలు అన్నీ చక్కబడతాయి అనుకున్నాను కానీ కాలేదు..
నా పెళ్ళి చెడింది.. ఉద్యోగం పోయింది ..
ఒక స్లోగన్ విన్నాను. ” కొంతకాలం తాగకుండా ఉండి మళ్ళీ మందు కొడితే  మాటేసి ఉన్న రోగాలు మళ్ళీ ముందు కొస్తాయి”  అని .. అది నిజంగా నిజమే నా విషయంలో…
నేను తాగితే.. నేను పూర్తిగా వేరే మనిషినవుతాను… ఆ వేరే మనిషి నిజంగా పిచ్చిముండే..  మీరు నాకు మందు తాగించనంతవరకు మాత్రం నేను మంచిమనిషిని.
ఇప్పుడు నా జీవితం చాలా భిన్నంగా ఉన్నది.. క్రితం సంవత్సరం కంటే… ఇప్పుడు నేను ఒంటరిని..చాలా అసహనంగా ఉంటోంది జీవితం.. చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నా..
కానీ కానీ  నాకు గొప్పగా అనిపిస్తోంది.. …..
ఇలా  కేట్  మీటింగులో  చెప్పే మాటలూ,   అటు మీదట ..చివరిసారి భర్తని చూడటానికి వెళ్ళినపుడు ఇద్దరి మధ్య మాటలూ   అవి   హృదయానికి తగిలి కొంచం చెమ్మగిల్లక పోదు.
కథని సినిమాగా మలిచిన పద్దతీ .. ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ మెచ్చుకొని తీరాలి మరి. ఇహ హన్నా కేట్ గా చేసిన మేరీ ఎలిజబెత్ స్టీల్స్ ద షో.. అమె నటన అదుర్స్ .
తాగుబోతుగా ఉండి ..తాగుడు మాని ..పెళ్ళీ పెటాకులయ్యి… భర్తకు దూరమయ్యి…తాగకుండా ఉండటమనే పోరాటాన్ని కొనసాగిస్తున్న  మహిళ కథ ఇది..ఇదేం గొప్ప సినిమా కాదు,   కథ కథనం చాలా మామూలు విషయాలు. అయినా అంత సరళమైన కథా తీసుకునేది ?  ఆ సినిమాటోగ్రఫీ ఎంటి సినిమాలా లేదే.. కళ్లముందు జరుగుతున్నట్టు చిత్రీకరించారు.  ఆ హీరోఇన్ ఏంటి ఏకంగా జీవిస్తోంది నటించవమ్మా అంటే   !!ఇది చాలా సరళమైన కథ ఇది..కదూ ! ఈ కథ  సినిమా గా అవసరమా ??

ఒక దురలవాటుని మానేయటం అంటే జీవితాన్ని గెలవటమే ! అయినా ఈ గెలుపు  కథ చాలా సరళమే కదూ !

* తాగి రాసా అనుకుంటున్నారా ? అబ్బే కాదు . 🙂