Menu

ఇంగ్మర్ బెర్గ్మన్

జులై 14, 1918 లో స్వీడెన్ లోని ఉప్శల అనే ప్రదేశంలో పుట్టి, 1946లో Crisis అనే చిత్రం ద్వారా చలనచిత్ర ప్రపంచంలోనికి అడుగుపెట్టి, The Seventh Seal, Wild Strawberries, Fanny and Alexander లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గాంచి దాదాపు 60 సినిమాల ద్వారా ప్రపంచంలోని అన్నిమూలలవున్న సినీ ప్రేమికుల హృదయాలను స్పందింపచేసారు.

Ingmar Bergman గురించి చెప్తూ ఫ్రెంచ్ సినీ దర్శకుడు Jean-Luc Godard ఈ విధంగా అంటారు, “The cinema is not a craft. It is an art. It does not mean team-work. One is always alone; on the set as before the blank page. And for Bergman, to be alone means to ask questions. And to make films means to answer them. Nothing could be more classically romantic.”

Godard చెప్పినట్టుగా సినిమా ఒక క్రాఫ్ట్ కాదు, సినిమా కూడా ఒక కళే! అని నిరూపించి ప్రేక్షకులలో ఆ భావన కలిగించడంలో Ingmar Bergman పాత్ర ఎంతో వుంది. సినిమాలు తీయడం అనేది ఒక బాధ్యత గానే కాకుండా, ఆకలి తీరడానికి అన్నంలాగా, దాహం తీరడానికి నీళ్ళలాగా, భావ వ్యక్తీకరణకు సినిమా ఒక అవశ్యకతగా భావించిన వారిలో, బహుశా, మొదటివాడు Ingmar Bergman అని అనుకుంటా. సినిమా యొక్క ఆవశ్యకతను గురించి Bergman మాటల్లోనే చెప్పాలాంటే, “Making films” is for me a necessity of nature, a need comparable to hunger and thirst. Some achieve self-expression by writing books, climbing mountains, beating their children, or dancing the samba. I happen to express myself by making films.

సినిమాలతో తనకున్న అనుభందాన్ని వివరిస్తూ Bergman ఇలా అంటారు, “సినిమాల తో నాకున్న అనుబంధం ఇప్పటిదికాదు, చిన్న నాడే నాకు సినిమాతో ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. చిన్నప్పుడూ మా బామ్మ ఇంట్లోని అపార్ట్మెంట్లో డైనింగ్ టేబుల్ కింద కూర్చుని, పెద్ద కిటీకీలలోనుంచి వెలువడుతున్న సూర్యకాంతిని “వింటూ” కూర్చునేవాడిని. అప్పుడు నాకు ఐదేళ్ళనుకుంటా! హేమంత ఋతువు అప్పుడప్పుడే వసంతానికి స్వాగతం పలుకుతున్న రోజులవి. పక్కన అపార్ట్‌మెంట్ నుండీ పియానో సంగీతం మోగుతుండగా, మా బామ్మగారి హాళ్ళోని గోడపైవున్న Venice పట్టణం బొమ్మను చూస్తూ కూర్చున్ననా రోజు. కిటికీలోనుంచి వస్తున్న సూర్యకాంతి ఆ బొమ్మపై పడి చిన్నగా కదల సాగింది. అదే సమయానికి పక్కనే వున్న కాలువ లోని నీళ్ళు గల గలా పారుతున్న శబ్దాలు దగ్గరయ్యాయి. దూరంగా ఎగురుతున్న పావురల రెప్పల టపటపలు ఆ సవ్వడితో కలిసిపోయి, హాళ్ళో మాట్లాడుతున్న మనుషుల మాటల సవ్వడిని మాయం చేసాయి. దూరంగా చర్చి గంటలు మోగడం మొదలుపెట్టాయి. ఆనందంతో పరవశించిపోయాను. అప్పుడు నాకర్థమయ్యిదేమిటంటే నేననుభవిస్తున్న సవ్వడులన్నీ హాల్లోని Venice చిత్రం నుంచి వెలువడుతున్నాయని!”

ప్రముఖ హాలివుడ్ దర్శకుడు Woody Allen చెప్పినట్టు, “ప్రపంచంలో కొంతమంది దర్శకులుంటారు. ప్రతి ఏడూ తమ సినిమాలతో ప్రేక్షకులకు మేలైన వినోదం అందిస్తుంటారు వీళ్ళు. వీరి పై స్థాయిలో కొంతమంది దర్శకులుంటారు. సినిమానొక కళలా భావించి ఎప్పటికప్పుడు తమ భావ వ్యక్తీకరణల ద్వారా కొత్త కథలు, కొత్త శైళి ద్వార నవీన కల్పనలు చేస్తుంటారు. ఇటువంటి వారందరినీ మించి ఇంకా పై స్థాయిలో ఒక్కరే వుంటారు, ఆయనే “Ingmar Bergman”

ప్రపంచంలోని ఎంతో మంది విమర్శకుల ప్రశంశలు పొందడమే కాకుండా, 9 సార్లు ఆస్కార్ అవార్డుకు నామినేషన్ పొంది, తన సినిమాలకు మూడు సార్లు ఆస్కార్ అవార్డులను అందుకుని, ప్రపంచంలోని వివిధ సినీ వుత్సవాలలో అవార్డులు గెలుచుకోవడం ద్వారా స్వీడెన్ సినీ రంగానికి అపరమిత సేవ చేసిన Ingmar Bergman  భౌతికంగా మన వద్ద ఇక లేనప్పటికీ ఆయన సినిమాల ద్వారా రసజ్ఞులైన సినీ ప్రేక్షకుల హృదయాలలో ఆయన చిరకాలం జీవిస్తూనే వుంటారు.

One Response
  1. Sowmya January 17, 2012 /