Menu

Monthly Archive:: October 2013

smashed – ఓ గెలుపు కథ.

                     మొదట వ్యసనం శరణార్థిలా వస్తుంది – తరవాత యజమానిలా శాశిస్తుంది. తాగినపుడు  ప్రపంచం కాళ్లకింద ఉన్నట్టనిపిస్తుంది… పెద్ద విషయం చిన్నదిగా..చిన్న విషయం పెద్దదిగా కనపడుతుంది. మనసులోని మాటలు అలా తన్నుకొస్తాయి…గుండెల్లోని ప్రేమ పెళ్ళుబుకుతుంది… కోపం కట్టలు తెగుతుంది… మనుషులని చూస్తే జాలేస్తుంది…కరుణ రసంపొంగి కన్నీళ్ళోస్తాయి.. మనమీద మనకి పిచ్చి నమ్మకం కలుగుతుంది.. ధైర్యం పొంగుతుంది.. ఆత్మవిశ్వాసం నాలుగింతలవుతుంది… కవిత్వం నోటివెంట పారుతుంది. కొత్తబాషలు వచ్చేస్తాయ్.. మొత్తంమీద మనకి మనం ఒక కొత్త మనిషిలా, మనం  ఎలా

edge of heaven – LOVE

ఇది మనుషుల మనసుల్లో దాగున్న ప్రేమ కథ. ఓ తండ్రి కొడుకును ప్రేమిస్తుంటాడు.. ఆ కొడుకు తన  తండ్రిని ప్రేమిస్తున్నాడా ?? ఓ తల్లి కూతురిని ప్రేమిస్తుంది .. మరి ఆ కూతురు తన తల్లిని ప్రేమిస్తూందా ?? ‘ప్రేమ’ మానవసంభందాల్లో ముఖ్యమైనది, అందులోనూ  పిల్లల మీది వాత్సల్యం. తల్లి దండ్రులు పిల్లలని  కనీ పెంచి పోషిస్తారు.చదువు చెప్పిస్తారు,ప్రయోజకులని చేస్తారు, చేయాలని కలలు కంటారు. కానీ పిల్లలకి,  కొన్ని కారణాలవల్ల తమ తల్లిదండ్రుల  ప్రవర్తనో..చేసే పనులో..ఉద్దేశాలో ..మరోటో  నచ్చక పోవచ్చు. దాంతో వాళ్లకి

డేవిడ్ లీన్ – ఒక పరిచయం

ఫ్రెంచ్ దర్శకుడు jean Renoir సినిమా దర్శకుల గురించి చెప్తూ, “ఒక గొప్ప దర్శకుడు తన జీవితకాలంలో నిర్మించిన అన్ని మంచి సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి పేరిస్తే వచ్చేది వివిధ రకాల సినిమాల సముదాయం కాకపోగా అవన్నీ ఒకే సినిమాలోని వివిధ అధ్యాయాలుగా అనిపిస్తాయి” అంటారు. అంటే ఒక దర్శకుడు తన జీవితకాలంలో రూపొందించే గొప్ప సినిమాలన్నింటిలో చెరిపివేయలేని ఒక మార్కు వదిలిపెడ్తాడని ఆయన ఉద్దేశం. ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులు తమ జీవితకాలంలో రూపొందించిన

Grave of the Fireflies

మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం చూతము రారండి సెప్టెంబర్ 21, 1945. నేను ఆఖరి శ్వాస విడిచింది ఆ రోజు రాత్రే! రైల్వే స్టేషన్లో జనాల హడావుడి. ప్లాట్‍ఫాం పై ఒక మూల కూర్చుని ఉన్నాను. ఒంట్లో నీరసం. అక్కడ్నుంచి అడుగు వెయ్యలేని దుస్థితి. ఎంత సేపు అక్కడ కూర్చున్నానో, ఎప్పుడు నా ప్రాణం పోయిందో కూడా తెలియదు; దిక్కులేని చావు చచ్చిన నా శవాన్ని అసహ్యంగా చూస్తూ జనాలు ముందుకు కదుల్తున్నారు. ప్లాట్‍ఫాం శుభ్రపరిచే ఒకతను నా

The lunch box – taste of life

ఓ నడివయస్కుడు ! ముప్పై అయిదేళ్ళ గానుగెద్దుబతుకు.. తోడులేని జీవితం.. అదే ఆఫీసు..అదే పని..అదేతిండి.. అదే ఒంటరితనం. ఓ ఇల్లాలు ! ఆదరాబాదరాగా పాపని స్కూలుకి పంపటం.. భర్తకి క్యారేజీ పంపించటం..పైఅంతస్తులో ఉండే ముసలమ్మతో నాలుగు మాటలు..భర్త రాకకోసం , ఆపై అతని ప్రేమ కోసం వేచిచూడటం..కమ్మగా వండి భర్తని దగ్గరచేసుకోమన్న ముసలమ్మ సలహా తో చక్కగా కొత్తరుచులు వండి  పంపిన క్యారేజీ అడ్రస్ మారి అది అతనికి చేరింది. అతడా  రోజు ఆఫీసులో భోజనానికి కూర్చుని