Menu

edge of heaven – LOVE

ఇది మనుషుల మనసుల్లో దాగున్న ప్రేమ కథ.
ఓ తండ్రి కొడుకును ప్రేమిస్తుంటాడు.. ఆ కొడుకు తన  తండ్రిని ప్రేమిస్తున్నాడా ??

ఓ తల్లి కూతురిని ప్రేమిస్తుంది .. మరి ఆ కూతురు తన తల్లిని ప్రేమిస్తూందా ??

‘ప్రేమ’ మానవసంభందాల్లో ముఖ్యమైనది, అందులోనూ  పిల్లల మీది వాత్సల్యం.
తల్లి దండ్రులు పిల్లలని  కనీ పెంచి పోషిస్తారు.చదువు చెప్పిస్తారు,ప్రయోజకులని చేస్తారు, చేయాలని కలలు కంటారు. కానీ పిల్లలకి,  కొన్ని కారణాలవల్ల తమ తల్లిదండ్రుల  ప్రవర్తనో..చేసే పనులో..ఉద్దేశాలో ..మరోటో  నచ్చక పోవచ్చు. దాంతో వాళ్లకి తల్లిదండ్రుల మీద  ప్రేమ లేనట్టు కనపడుతుంది. అయితే  ఎడ్జ్ ఆఫ్ హెవెన్ అంటేఅవతలి వైపు ఏముందో తెలిపేదే ఈ సినిమా.

ఓ మూడు కథలని ఇంటర్ సెక్ట్ చేసి అద్భుతంగా స్క్రీన్ ప్లే చేసిన చిత్రం ఇది.

 

మొదటికథ – ఓ తండ్రి –  ఓ కొడుకు

బ్రేమన్ ( జర్మనీ)  లో నివసిస్తున్న  అలీ రిటైర్డ్  అయినా యవ్వనోత్సాహం గల ఓ తండ్రి .  హుషారుగా ఓ వేశ్యావాటికలో ప్రవేశించి ఏతెర్ అనే టర్కిష్ అమ్మాయితో గడుపుతాడు. అవిడ భర్తపోయాక జర్ననీకొచ్చి ఈ వృత్తి చేస్తూ ఇస్టాన్బుల్ లో ఉన్న తన కూతురుకి మాత్రం షూ షాప్ లో పని చేస్తున్నాననీ చెప్పి అప్పుడప్పుడూ షూ కూడా పంపుతూ ఉంటుంది.

అమె నెలకి సంపాదించే డబ్బు తానిస్తాననీ..తనతో ఉండమనీ, ఆలోచించి చెప్పమనీ అడుగుతాడు అలీ. అమెని గమనిస్తూ ఉన్న ఇద్దరు టర్కీ ముసల్మానులు టర్కిష్ స్త్రీ అలాంటి నీచమైన వృత్తిలో ఉండరాదనీ.. మళ్ళీ అలాంటిపని చేయకూడదని హెచ్చరిస్తారు. దాంటో ఏతెర్ అలీతో ఉండటానికి వస్తుంది.

అలీ కొడుకు నిజాత్ యూనివర్సిటీ లో లిటరేచర్  ప్రొఫెసర్. తండ్రి ప్రియురాలుని చూసి  అమె ఒక వేశ్య అని తెలిసాక కొంచం విముఖత చూపిస్తాడు, కానీ అలీ ఆ రాత్రి  హార్ట్ అటాక్ రావటంతో ఆసుపత్రిలో చేరుస్తారు. అప్పుడు నిజాత్  ఆమె కో కూతురుందనీ..ఆ కూతురు తనలా పెద్ద చదువులు చదవాలన్న ఆమె కల తెలుసుకుంటాడు. కూతురికోసం అమెపడే బాధని చూసి ఓదారుస్తాడు. డిచ్చార్జీ అయ్యి  ఇంటికొచ్చిన అలీ,  కొడుకు నిజాత్ కీ తనప్రియురాలు ఏతెర్ కీ  మధ్య ‘ ప్రేమ’ మొదలైందేమో అని అనుమానిస్తాడు. ఆ వాగ్వివాదంలో కొట్టిన దెబ్బకి ఏతెర్ చనిపోతుంది. అలీ జైలుపాలవుతాడు.

ఏతెర్  చావుకి తండ్రి కారణం కనక అమె కూతురుకి సహాయంచేసే  నిమిత్తం నిజాత్, ఆమె కూతురుని వెతుకుతూ  ఇస్టాన్బుల్ వస్తాడు. అక్కడే ఓక పుస్తక దుకాణాన్ని కొనుక్కొని ఆమెకోసం ప్రయత్నిస్తూ ఉంటాడు.

 రెండవకథ –  ఇద్దరు ప్రేమికురాళ్ళు.

ఐటాన్  అనే అమ్మాయి ఇస్టాన్బుల్లో  టర్కిష్ కమ్యూనిస్ట్ రెసిస్టెన్స్  గ్రూప్లో  సబ్యురాలు. ఒకానొక ధర్నాలో  పోలీసాఫీసర్ తుపాకీ దొంగిలిస్తుంది. తమ సబ్యులంతా పట్టుబడగా..తాను మాత్రం తప్పించుకొని తన వద్దనున్న తుపాకీని ఓ దగ్గరదాచి, బ్రేమన్ ( జర్మనీ) లోకి అక్రమంగా  ప్రవేశిస్తుంది. అక్కడ తన తల్లికోసం వెతికి వెతికి , ఉండటానికి చోటు..తినటానికి డబ్బుల్లేక కాలేజీ క్యాంపస్లో లోట్ అనే అమ్మాయిని అప్పు అడుగుతుంది. ఐటాన్ తల్లికోసం వెతుకుతున్న విషయం, నిస్సయాత తెలిసి లోట్ అమెకి ఆశ్రయం ఇస్తుంది,  వాళ్ళిద్దరిమధ్య స్నేహాం  అటుమీద ప్రేమ మొదలవుతుంది. లోట్ తల్లి సుసాన కి ఇది నచ్చదు. ఇంట్లొ తలదాచుకుంటున్న ఐటాన్ని కూడా పోషిస్తుంది సంవత్సరంపాటు ,తనకి నచ్చకున్నా !

ఓ నాడు ఐటాన్ సుసానతో మాట్లాడుతూ నిర్లక్షంగా అసబ్య పదజాలం వాడుతుంది.  దాంతో తల్లి తన సొంత ఇంట్లో అలాంటి పదజాలం వాడుకోమనీ పరాయి ఇంట్లో కాదనీ అనేసరికి ..రోషంతో ఐటాన్ ఆ ఇల్లు వదులుతుంది. తన తల్లిమీద కోపం వస్తుంది లోట్ కీ.

కార్లో వెళుతుండగా వాళ్ళిద్దరినీ  ట్రాఫిక్ పోలీసులకి అడ్డుకుంటారు. ఐటాన్ పారిపోప్రయత్నించటంతో, ఐటాన్ పూర్వకథ తెలిసి ఆమెని తిరిగి ఇస్టాన్బుల్  జైలుకు పంపటం జరుగుతుంది. ప్రేమికురాలిని కాపాడుకోటానికి  లోట్ కూడా ఇస్టాన్బుల్  వస్తుంది. నిజాత్ ఇంట్ళో అద్దెకుంటుంటూ  జైల్లో ఉన్న ఐటాన్ని కలిసి…అమె చెప్పిన ప్రకారం, దాచిన తుపాకీని తీసుకొని వీదిలో నడుస్తూంటే.. పోకిరీకుర్రాళ్ళు ఆమె బ్యాగుని తస్కరిస్తారు. వాళ్ల వెంట పరిగెత్తీ ఎత్తీ ఆమె ఆశలు వదలి తిరిగివెళ్తున్న సమయంలో పోకిరీలు తన బ్యాగులోని వస్తువులని చూస్తూ కనిపిస్తారు. వాళ్ళు  కనిపించేసరికి తిడుతూ దగ్గరికి వస్తుంది..కానీ ఓ  కుర్రాడు చేతిలోని తుపాకిని ప్రమాదవశాత్తు పేల్చటంతో లోట్ అక్కడికక్కడే మరణిస్తుంది.

ప్రేమికురాలి మరణం ఐటాన్ ని కలచివేస్తుంది.

మూడవకథ

మూడో కథ..ఆ రెండు కథల్లోనే ఉన్నది. ఏతెర్ కూతురే ఐటాన్.

edge of heaven – the other side

కూతురి మరణంతో, కూతురు ప్రేమించిన ఐటాన్ కి సహాయం చేద్దామని  సుసాన ఇస్టాన్బుల్ బయలిదేరుతుంది. అక్కడ నిజాత్ ని కలుస్తుంది.  కూతురు నివసించినచోటే ఉంటుంది. ఆమెకి తనపట్ల ప్రేమని, కూతురి కోరికనీ తెలుసుకుంటుంది. ఐటాన్ న్ని కలిసి  తన కూతురి కోరిక ప్రకారం ఎంతడబ్బు ఖర్చయినా తనని విడిపిస్తానని చెపుతుంది.

నిజాత్,  తనకి తండ్రి చెప్పిన  ని కథ గురించి చెపుతాడు సుసాన్ కి.
‘దేవుడు ఇబ్రహీం ని పరీక్షించ దలిచాడు. కొడుకు ఇస్సాక్ ని  బలివ్వమని కోరుతాడు. ఇబ్రహీం అందుకు సిద్దపడతాడు. ఇస్సాక్ ని బలి ఇవ్వబోతుంటే, ఇబ్రహీం కి తనపైగల నమ్మకాన్ని మెచ్చి బలివ్వటానికి గొఱె నిస్తాడు.’

బైబిల్ లోనూ అదే కథ ఉన్నదని అంటుంది సూసన్.  తన తండ్రి మాత్రం  దేవుడు అడిగితే దేవుడితో వైరం పెట్టుకుంటా కానీ కొడుకుని మాత్రం ఇవ్వను అని తనతో చెప్పేవాడని అంటాడు.

ఐటాన్ విడుదల అవుతుంది. కూతురుని పోగొట్టుకున్నసుసాన్  ఐటాన్లో కూతురుని చూసుకుంటుంది. జైలు నించి విడుదలైన అలీకి కొడుకు గుర్తొస్తాడు, స్వంత ఊరికి వచ్చేస్తాడు. తండ్రిని వెతుకుతూ నిజాత్ ఆ ఊరు చేరుకుంటాడు.

‘కాన్స్ సినిమాపండగలో ఓ అవార్డు గెలుచుకొని పలు సినిమాపండగల్లో ప్రదర్శించబడిన ఈ సినిమా  లోతైన భావోద్వేగాలు …అద్భుతమైన స్క్రీన్ ప్లే.. హత్తుకునే  సంగీతం.. చక్కని నటన  కలగలిసి  ఓ మిస్ అవకూడని  సినిమా ఇది .

 

edge of heaven – LOVE