Menu

Dark Blue Almost Black

Azuloscurocasinegro /  Dark Blue Almost Black  is a 2006 Spanish drama film
society is a collection of individuals united by certain relations or modes of behavior which mark them off form others who do not enter into these relations or who differ from them in behavior. – Ginsberg.
 family is system of relationships, as a part of society, its a web of mutual relations  between family members. – Clare
Man is a well developed organism, a very complex animal by his nature and behavior.

వ్యక్తుల సమూహమే సమాజం. వ్యక్తులు భిన్నం.. వ్యక్తి, సమాజం భిన్నం.   కుటంబం ఓ చిన్న సమాజం .

కుటుంబం వ్యక్తులు.. వాళ్ళ  మధ్య  బంధాలు.. బాధలూ.. ఆరాటాలు, అంగీకారాలే  ఈ సినిమా.

జార్జ్ చదువుకొని పెద్ద ఉద్యోగం చేద్దామనుకుంటాడు.కానీ తండ్రి  పెరాలసిస్ బారిన పడటంతో అతని సేవ చేస్తూ, బిల్డింగ్ కేర్ టేకర్గా పని చేస్తూనే దూరవిద్య ద్వారా బిజినెస్ లో డిగ్రీ సంపాదిస్తాడు కానీ దానికి తగ్గ జాబ్ మాత్రం సంపాదించలేకపోతాడు.
నతాలియ జార్జి చిన్ననాటి స్నేహితురాలు. ఒకే అపార్ట్మెంటే  ఉండేది.  పై చదువులు ముగించి అమె తిరిగివస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉందో లేదో తెలియదు. దాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో ‘కలయికలూ ‘ ..పోట్లాటలూ జరుగుతుంటాయి.

కుటుంబాన్ని ఎన్నడూ పట్టించుకోని జార్జ్ అన్నయ్య అంటానియో ఎదో నేరంమీద జైల్లో పడతాడు.  పౌలా ప్రేమికుడి చేతిలొ మోసపోయి డ్రగ్ ట్రాఫికింగ్ నేరం మీద జైల్లో పడుతుంది. గర్బవతి అయితే మెటర్నిటీ వార్డ్ లో కొంచం హయిగా ప్రశాంతంగా ఉండొచ్చని ఆ ‘ప్రయత్నాలు’ చేస్తుంది. అందులో భాగంగా  ఓ  ఖైదీ ని ఆకర్షించి, అతని స్నేహితురాలిచే తన్నులు తింటుంది.
అంటానియో పౌలా ఒక థియేటర్ వర్క్ షాప్ లో కలుసుకుంటారు. అమె ‘ప్రయత్నం ‘ లో భాగంగా అంటానియోతో శారీరకంగా కలుస్తుంది. అంటానియో మెల్లిగా ఆమెని ప్రేమించటం మొదలుపెడతాడు. ఆమెకి మాత్రం ప్రెగ్నెంట్ కావటమే ముఖ్యమైన విషయం. దానికై అంటానియో ప్రయత్నిస్తాడు కానీ అతనికి  తాను వ్యంధ్యుడు అని తెలుస్తుంది. కొన్నాళ్ళకి జైలునించి విడుదలైన  అంటానియో   కుటుంబంలో చేరి..  తమ్ముడికి  తన ప్రియురాలి బాధ చెప్పి.. అమెని గర్బవతిని చేయమని  కోరుతాడు. ముందుగా ససేమిరా అన్నా… అన్న మాటలకి తలొగ్గి ఆ పని చేయటానికి ఒప్పుకుంటాడు జార్జ్.   మరోవైపు  అంటానియో   తండ్రికి సేవచేస్తూ.. తండ్రి అకౌంటులో  కొంత  డబ్బుందని తెలుసి  దానిమీద  సొమ్ము మీద కన్నెస్తాడు.

జార్జ్ మిత్రుడు ఇస్రయిల్.  పక్క అపార్ట్మెంట్లో మసాజ్ + శారీరక సేవలందిస్తున్న ఒకతన్ని గమనిస్తుంటాడు టెలీస్కోపుతో. ఒకనాడు అక్కడ  తండ్రిని  చూసేసరికి  మతి చెడుతుంది. తండ్రిమీద అసహ్యము..తల్లిమీద జాలి కలుగుతుంది. ఎందుకలా చేస్తున్నాడు అన్న అలోచనతో మొదలయ్యి తన లైంగికత్వాన్ని ( లైంగిక ఇష్టాన్ని) తెలుసుకోప్రయత్నిస్తాడు.

చివరికి..

జార్జ్ తాను పౌలాతో ప్రేమలో ఉన్నట్టు తెలుసుకొని.. నతాలియకి ఆ విషయం చెపుతాడు. నతాలియ గొల్లుమంటుంది, అంగీకరిస్తుంది.

తమ్ముడు, తన ప్రియురాలుని ప్రేమిస్తున్నాడని తెలిసి కోపం, దుఃఖం ఆపుకోలేక పోతాడు. కానీ అంగీకరిస్తాడు.

ఇస్రాయిల్ తన లైంగికత్వాన్ని తెలుసుకొని.. తండ్రీని అంగీకరిస్తాడు.

ఒక షోరూం డిస్ల్పే లో ఒక మనిషి బొమ్మకి  ( మానిక్వీన్) డార్క్ బ్లూ కలర్ సూట్ వేయబడి ఉంటుంది.  దాని  మీద ఆశపడతాడు జార్జ్ … కాని దాన్ని కొనలేడు… చివరికి ఇస్రాయిల్ కారుతో అద్దాలు పగలగొట్టి  తాన్ని సొంతంచేసుకుంటాడు.
దూరంనించి నలుపూ..ముదురునీలం( నేవీ బ్లూ) ఒకే రంగుగా కనపడతాయి. కాని దగ్గరికి వస్తే  అవి రెండూ భిన్నాలే.  ముదురునీలంలో నలుపు ఉన్నది. నలుపులో ముదురు నీలం కలిసిపోతుంది.
సమాజంలో కుటుంబం ఇక భాగం.  కుటుంబంలో వ్యక్తులుంటారు..వక్తులకి తమకంటూ కోరికలూ ఆరాటలు ఉంటాయి. కుటుంబంలో  ఒడిదుడుకులూ అపార్థాలూ అన్నీ మామూలే , అలాంటప్పుడే  ఒకరొనొకరు అర్థం చేసుకొని అంగీకరించి  జీవిస్తుంటారు. జీవించాలి. వ్యక్తులుగా  మన వ్యక్తిత్వం..ఇష్టా ఇష్టాలనీ, లోపాలనీ ముందు మనకి మనం అంగీకరిస్తే … దాన్ని మన  కుటుంబంకూడా అంగీకరిస్తే ఇహ  ప్రపంచం అంగీకారం తో మనకి పనిలేదు.
వ్యక్తిని సమాజం.. సమాజాన్ని వ్యక్తీ అంగీకరిస్తేనే  లోకంలో శాంతి నెలకొంటుంది.