Menu

Monthly Archive:: October 2013

revanche – ప్రశాంతోద్వేగం.

ఒకరిమీద ఒకరికి ఉండే అపారమైన గౌరవం..ఇష్టాల కలగలుపే ప్రేమ.  ప్రేమకి క్షమించే గుణం ఉంటుంది.  ప్రేమకి అంగీకరించే గుణం ఉంటుంది.  ప్రేమ గుడ్డిది అని అంటారు ఎందుకంటే …ఎదుటివ్యక్తి మంచయినా చెడయినా  ఆ ప్రేమ కి తెలియదు, అలాగే  ప్రేమకోసం ఆ ప్రేమికులు ఏ దారిలో వెళుతున్నారో తెలియదు.  పక్కన ప్రేమించిన మనిషి ఉంటేనే ఎదురుగా ఉన్న లోకానికి అర్థం లేదా ఆ ప్రపంచం  ఎందుకూ పనికి రానిదే !! ఇది గొప్ప  కథ కాదు..విచిత్రమైన మలుపులూ లేవు. చాలా సరళమైన కథ. మెగ్గెప్పుడు వేసిందో..పువ్వెప్పుడు పూసిందో..కాయెప్పుడు కాసిందో తెలియదు. అలాగే

పఠాభి-Rebel with a cause

1942లో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదువుతుండగా అమెరికన్ ఆర్మీలో చేరమని పిలుపు వచ్చింది ఆయనకి.సైన్యంలో చేరితే మాంసాహారం తినాల్సొస్తుందని సైన్యంలో చేరకుండా FBI కి లొంగిపోయి ఆ తర్వాత అమెరికా వదిలిపెట్టాల్సి వచ్చింది. అమెరికా నుంచి భారతదేశం చేరుకోవాలంటే ఓడమీదే చేరుకోవాలి. కానీ ఆ రోజుల్లో జర్మన్ యూబోట్ల నుంచి తప్పించుకుని సురక్షితంగా నౌకలో బయటపడడమంటే అత్యంత కష్టం. ఇలాంటి పరిస్థుతుల్లో నేల మార్గాన, తీర ప్రాంతాల నౌకలద్వారానూ మెక్సికో, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీలకు

Ikiru

జీవితం ఒక తెల్లకాగితం లాంటిది; చాలా కొద్దిమంది మాత్రమే దానిమీద తమ సంతకాలను వదిలివెళ్లగలరు. ఈయన పేరు వతానబే. ఇతనే మన కథకి నాయకుడు. ఈయనంత బోరింగ్ మనిషి ఇంకెవరూ ఉండబోరు. శాశ్వతమైన ఈ జీవన ప్రవాహంలో, తమ సంబంధమేమీ పెద్దగా లేకుండానే కొట్టుకుపోతున్న కోట్లాదిమందిలో ఈయనా ఒకడు. ఈయన ఒక ప్రభుత్వ అధికారిగా ముప్ఫై ఏళ్లకు పైగా గానుగెద్దులా, ఏ ఒక్క రోజూ శెలవు తీసుకోకుండా పని చేస్తూ వచ్చాడు. ప్రస్తుతానికి బతికుండడానికి, బతకడానికి మధ్య

అకిరా కురొసావా

ప్రపంచ సినిమా తో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు పాఠ్యపుస్తకాల వంటివి. యాభై సంవత్సరాలపాటు సినిమా కెరీర్ లో దాదాపు ముఫైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రచయితగా, ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహించి

when we leave – ఓ స్త్రీ కథ

పిల్లాడికి ఆమె కథ చెపుతోంది.  పిల్లాడు ప్రశ్నలు సందించాడు. అమ్మా మనం ఎందుకు వదిలి వెళ్ళాలి ? కొన్నిసార్లు వదిలి  దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ వాళ్లని కనుగొంటాం..వాళ్ళ ప్రేమని  కనుగొంటాం “ ” కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు  ఏదోటి వదిలి వెళ్లాలి కదా ”  ఎప్పుడో తల్లి చెప్పిన మాటే తిరిగిచెప్పాడు వాడు. అవును అంది తల్లి. ………………………………………… బొమ్మగీస్తావా ? లేదు ఆడుకుంటావా ?? లేదు.. ఆకలేస్తోందా.? లేదు.. నాకు ‘అమ్మమ్మని’  చూడాలని ఉంది. …………………………………………… స్త్రీ కోరుకునేదేమిటి