Menu

Monthly Archive:: September 2013

Sansho Dayu

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. కొన్ని వందల ఏళ్ల క్రితం….మనిషి జాతి ఇంకా పూర్తిగా మానవులుగా జాగృతం కానీ సమయం. జపాన్ దేశంలో ఫ్యూడల్ వ్యవస్థ రాజ్యమేలుతోంది ఒక వైపు పదమూడు ఏళ్ళుగా ప్రజల్ని దహించి వేస్తున్న కరువు కాటకాలు; మరో వైపు యుద్ధాలతో రగిలిపోతున్న రాజ్యాలు. ప్రజలు కడుపు మంటలు ఏ మాత్రం పట్టని సైన్యాధికారులు చిన్నా పెద్దా అని తేడా లేకుండా సైన్యంలో

Eternal Sunshine of the Spotless Mind

జ్ఞాపకాలనే వృత్తంలో కేంద్ర బిందువు ఆమె ఆ రోజు సాయంత్రం బీచ్ లో… అంతమంది జనాల మధ్యన, గుంపులో ఒంటరిగా నేను. జనాలకు దూరంగా అలలకు చేరువులో, గలగలా మాట్లాడే నువ్వు. అన్నింటికీ ఒక లెక్క ఉండాలనే నేను. లెక్కలేకుండా జీవితాన్ని గడిపెయ్యాలనుకునే నువ్వు? నేనేమో ముక్కు మొహం లేని అనామక నాయకున్ని. నువ్వేమో అణువణువనా రంగుల కాంతులు విరజిమ్మే తారవి. నువ్వలా, నేనిలా! అయినా రెండు సగాలు కలుసుకున్నంత ఆనందం. ****** మనం కలుసుకున్న కొన్ని

ఆంద్రె బాజిన్ – ఒక పరిచయం

ప్రపంచంలోని అత్యుత్తమ సినీ విశ్లేషకుల్లో Andre Bazin పేరు ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఫ్రాన్సు దేశంలో 1918లో జన్మించిన Bazin ఆఖరి శ్వాస వదిలే వరకూ తన జీవితాన్ని సినిమాకే అంకితం చేసాడు. ఒక్క సినిమా అయినా తియ్యకుండానే, కేవలం తన రాతల ద్వారా ఒక సినీ ఉద్యమానికే కారకుడయ్యాడీయన. ఈయన స్థాపించిన Cahiers du Cinema అనే పత్రిక ద్వారా ప్రపంచ సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసాడు. ఈ పత్రికలో వ్యాసాలు రాస్తూనే Godard, Truffaut,

The Lives of Others

సౌందర్యోపాసనే లోకకళ్యాణానికి మార్గం 1984, తూర్పు జర్మనీ దేశం. సోవియట్ రష్యా అధ్వర్యంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం రాజ్యమేలుతోంది. ప్రభుత్వ అధికారుల హింస తట్టుకోలేక ప్రజలు రహస్యంగా పశ్చిమ జర్మనీకి తరలివెళ్ళిపోతున్న సమయం. ఏ సమయంలోనైనా ప్రజలు తమ మీద తిరగబడి ఉద్యమ బాటలో నడుస్తారనే అనుమానంతో, ప్రభుత్వం అటువంటి విపత్తు ఏదీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంది; షుమారు లక్ష మందితో కూడిన రహస్య పోలీస్ వ్యవస్థతో పాటు, రెండు లక్షల మంది ఇన్ఫార్మర్స్ ని కూడా సమీకరించింది.

Fitzcarraldo

—అతడు అడవిని జయించాడు— మనిషి ఎల్లప్పటికీ అపరిపూర్ణుడు! ఎప్పటికప్పుడు తనని తాను ఆవిష్కరించుకుంటూ పరిపూర్ణత వైపు పయనం సాగిస్తుంటాడు. కానీ ఈ ప్రయాణం ఎప్పటికీ పూర్తి కాదు; మనిషి ఎప్పటికీ గమ్యాన్ని చేరలేడు. కానీ, ఈ విధంగా ఒక స్థితి నుంచి మరో స్థితికి పోవాలనే ప్రయత్నంలోనే మనిషి స్వేచ్ఛా జీవి అయ్యాడు. తరువాతి స్థితి అనేది మరొకటి లేకపోతే మనిషికి స్వేచ్ఛే లేదు. కానీ ఆ తరువాతి స్థితి కి చేరుకోడానికి ఒక్క స్వేచ్ఛ మాత్రం