Menu

Monthly Archive:: August 2013

పల్ప్ ఫిక్షన్-పరిచయం

ప్రపంచాన్ని కుదించి కంప్యూటర్లో బంధించేసిన నేటి అంతర్జాలపు రోజుల్లో Pulp Fiction సినిమా గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే వుండి వుంటారు. ఈ సినిమా చూడకపోయినా కనీసం వినైనా వుంటారు చాలామంది సినీ ప్రేమికులు. ఒక వేళ ఈ సినిమా గురించి మీరింకా వినలేదంటే ప్రపంచ సినీ జ్ఞానం మీ తలకింకా బాగా ఎక్కలేదన్న మాట సత్యం. తెలుగు సినిమా చరిత్రలో ఒక శివ లాగా, ఇటాలియన్ సినీ చరిత్రకు ఒక Bicycle Thief

Stalker

మనిషి నిత్యాన్వేషి. నిరంతరాన్వేషణలో మనిషి సత్యాన్నీ అన్వేషించాడు.ఈ భూమ్మీద మనిషి ఆవిర్భావం జరిగినప్పటినుంచీ ఈ అన్వేషణ సాగుతూనే ఉంది. ఒకానొక కాలంలో అసలీ సత్యం అంటే ఏంటి? అని ఎలా అయినా తెలుసుకోవాలని ఒక వ్యక్తి బయల్దేరాడు. ఎక్కడెక్కడో తిరిగాడు; దారిలో కలిసిన మనుషులనూ, మహర్షులనూ అడిగాడు; రాజులూ, రారాజులనూ దారి చూపమని ప్రాథేయపడ్డాడు. కొండలూ గుట్టలూ ఎక్కాడు. ఏడు సముద్రాలు దాటాడు; మహారణ్యాల్లోనూ తిరిగాడు. పగలనకా రేయనకా అతని అన్వేషణ కొనసాగింది. మనుషులెవ్వరూ చేరుకోలేని ఒక

Shadows of Forgotten Ancestors

అనుభవించదగ్గదే కానీ వర్ణించలేనిది; చావూ బతుకుల తేడా తెలియనిది – ప్రేమ. ఈ విశాల ప్రపంచమంతా ఒక్క పురుషుడు ఒక్క స్త్రీ కోసమే సృష్టించబడిందా? అసలు అనంతమే రెండుగా విడిపోయి వారిద్దరి రూపాలు దాల్చిందా? చంద్రుడిని ఆకాశం కోసం చేయబడినట్లు, దేవుడు ఆమెను తన కోసం చేశాడా? ఇవాన్-మరీచ్కా ల జంటను చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. వారిద్దరూ ప్రేమించుకుంటే – కొండలేమిటి, నదులేమిటి, నక్షత్రాలేమిటి, ఈ చరాచర సృష్టి ఏమిటి – అన్నీ వారి ప్రేమ గీతానికి

బెలా టర్ – ఒక పరిచయం

హాలీవుడ్ గుర్తిస్తేనో, మీరామ్యాక్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తేనో కానీ మంచి సినిమా అంటే ఎంటో మనకి తెలియదు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎంతో మంది దర్శకులు మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. కానీ వాటిని గుర్తించడంలోనే ఎక్కడో పొరపాటు జరుగుతోంది. అందుకు నిదర్శనం Bela Tarr సినిమాలే!గత 25 ఏళ్ళగా సినిమా పరిశ్రమలో ఉన్నప్పటికీ Cannes 2007 లో తన సినిమా Man from London ప్రదర్శనతోనూ,బెర్లిన్ ఫెస్టివల్ 2011 లో టూరిన్ హార్స్ సినిమాతో ఉత్తమ

Kramer vs. Kramer

వాళ్లు కలిసి విడిపోయారు; విడిపోయి కలిసారు. ఎక్కడో పుట్టారు.ఎక్కడో పెరిగారు. జొయన్నా, టెడ్ అనబడే వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆత్మీయత పెరిగి ఒకే ప్రాణంగా మెలగుతూ ఒక వంశవృక్షానికి కొత్త కొమ్మలు, రెమ్మలు తొడిగారు. బిల్లీ అని నామకరణం చేశారు. జంట కట్టి, సంతానం వృద్ధి చేయడమొక్కటే లక్ష్యమయ్యుంటే మానవ నాగరికత, పరిణామక్రమానికి అర్థం లేదు. సంతాన వృద్ధికంటే కూడా ఇద్దరు ఒకటై కలిసి జీవించడంలోని ఆనందానికే వివాహ బంధంలో ప్రాముఖ్యత ఉంటుంది. టెడ్ ని