Menu

Monthly Archive:: July 2013

Code Unknown

ఎన్ని రంగుల్లో వికసించినా దాని పేరు మాత్రం గులాబి! రంగు నలుపైతే మాత్రం అతను మనిషి కాడా? శ్రీశ్రీ అంటారు, “ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా/ఎంతగా పైపై భేదాలున్నా/ఎంతగా స్వాతిశయం పెరిగినా/ ఎంత బలం, ధనం, జవం పెరిగినా/అంతరంగం అట్టడుగున మాత్రం/అంతమందిమీ మానవులమే!” కానీ ఈ విషయాన్ని మనం ఎంత వరకూ ఆచరణలో పెడ్తున్నామనేదే పెద్ద ప్రశ్న. జాతి, కులం, ప్రాంతం, వర్ణం ఆధారంగానే ఇంకా మనుషులను అంచనా వేస్తున్న కాలం ఇది. ఈ అంచనాల ఆధారంగానే

Wild Strawberries

జ్ఞాపకాలు ప్రమాదకరమైన ఉచ్చులు; వాటిలో చిక్కుకుంటే అంతే ! సమయానికి అర్థం లేని చోట, బీటలు వారిన శిధిలాల నడుమ, అతను నడుస్తున్నాడు. వీధి నిండా ఏకాంతం. గడియారంలో ముళ్లు లేవు. తోడు కోసం అతని అన్వేషణ జ్వరాల గుర్రాల బండికి సందు చేసింది దారి. బండిలోనుంచి జారిపడిందో శవపేటిక శవం అతని చెయ్యిపట్టుకు లాగుతోంది…. ఉలిక్కిపడి నిద్రలేచాడు ప్రొఫెసర్ బోర్గ్. ఇంకొద్ది గంటల్లో అతను స్టాక్‍హోమ్ నుంచి విమానంలో బయలుదేరి లుంద్ పట్టణానికి చేరుకోవాలి. కానీ

వుడి ఎలెన్ తో కాసేపు

పరిచయం: Woody Allen గురించి పరిచయం చెయ్యక్కర్లేదనుకుంటాను. గత నలభై ఏళ్లుగా నలభై కి పైగా సినిమాలు తీసి తనదైన శైలిలో సినిమాలు తీస్తూ ప్రపంచ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఉడీ ఆలెన్ మాటల్లో సినిమా దర్శకత్వం గురించి తెలుసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం. ఉడీ అలెన్ తరహా సినిమాలు (Woody Allenesque Films) అనే ఒక ప్రత్యేక జాన్రా సినిమాలు ఆయన స్వంతం. ఉడీ అలెన్ సినిమాలు చూసిన వాళ్లకు కొన్ని ప్రత్యేకతలు

Poetry

జీవితపు రహస్యాల మేలిముసుగు తొలగింపే కవిత్వం! ఒక జ్ఞాపకం. అప్పటికి నేను చాలా చిన్నదాన్ని. నా వయసెంతో గుర్తుపెట్టుకోగలిగేంత వయసు కూడా కాదు. బహుశా అప్పుడు నాకు మూడేళ్ల వయసు ఉండవచ్చు. ఆ రోజు అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. పదేళ్ల వయసున్న మా పెద్దక్క ఆ రోజుకి నాకు తల్లయ్యింది. ఉదయాన్నే స్నానం చేపించి నాకు రంగు రంగులున్న బట్టలు తొడిగింది. మేమిద్దరం హాల్లో ఉన్నాం. కిటికీ కి వేలాడుతున్న ఎరుపు రంగు పరదాలగుండా ప్రవహిస్తోన్న సూర్యకాంతి

సాహసం

ఐతే సినిమాతో మొదలుపెట్టి కేవలం నాలుగు సినిమాలతో అశేష అభిమానులని సంపాదించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. నాలుగేళ్ల క్రితం వచ్చిన ప్రయాణం సినిమా కాస్త నిరాశ కలిగించినప్పటినుంచీ చందు గారి తర్వాత సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తూ వచ్చారు. ఇవాళ విడుదలయిన సాహసం సినిమాతో యేలేటి మరో సారి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు అందుకున్న ఈ సినిమా గురించి ఒక విశ్లేషణాత్మక వ్యాసం. కథ గా