Menu

సిటిజెన్ కేన్-మరి కొన్ని విశేషాలు

ఈ నెలనవతరంగం ఫోకస్ శీర్షికలో ఆర్సన్ వెల్స్ గురించి ఆయన సినిమాల గురించి వ్యాసాలు ప్రచురిస్తున్న సంగతి తెలిసే ఉంటుంది.ఆర్సన్ వెల్స్ గురించి మరియి సిటిజన్ కేన్ గురించి ఇప్పటికి నవతరంగంలో మూడు వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. వాటి వివరాలు:

ఈ సినిమా గురించి, ఆర్సనె వెల్స్ గురించి మరియు ఆయన మిగతా సినిమాల గురించి మీరూ వ్రాయొచ్చు. మీ వ్యాసాలు navatarangam[at]gmail[dot]com కు పంపించాల్సిందిగా మనవి.

గతంలో వచ్చిన వ్యాసంలో సిటిజన్ కేన్ నిర్మాణ విశేషాలు, కథ-కథనం, సినిమాటోగ్రఫీ విభాగాలలో ఆర్సన్ వెల్స్ చేసిన నూతన ప్రక్రియల గురించి ప్రచురించడం జరిగింది. ఈ వ్యాసంలో సిటిజన్ కేన్ సినిమాలోని మరికొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.

రోజ్ బడ్

సిటిజన్ కేన్ సినిమా గురించి చర్చ జరిగినప్పుడు ’రోజ్ బడ్’ గురించి చర్చించకపోతే ఆ చర్చ పూర్తయినట్టు కాదు. ఈ సినిమా మొత్తం ఈ ’రోజ్ బడ్’ చుట్టూతానే తిరుగుతుంది కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

సిటిజన్ కేన్ సినిమా కథ ప్రకారం చార్లెస్ ఫోస్టర్ కేన్ అనే వ్యాపార వేత్త తను జీవితపు ఆఖరి క్షణాల్లో ’రోజ్ బడ్’ అంటూ కన్నుమూస్తాడు. ఆయన అలా ’రోజ్ బడ్’ అని ఎందుకు అన్నాడో తెలుసుకోడానికి ఒక పత్రికా విలేఖరి కేన్ తో పరిచయం ఉన్న వాళ్ళని కలిసుకుని వారి ద్వారా కేన్ గురించి తెలుసుకోవడమే ఈ సినిమా ముఖ్యకథ.

అయితే ఇక్కడే ఒక గమ్మత్తయిన విషయం దాగుంది. మీరు గనక ఈ సినిమా ఓపెనింగ్ సీన్ (క్రింది వీడియో చూడండి) గమనించినట్టయితే కేన్ చనిపోయే ముందు ఆయన ఉన్న గదిలో మరెవరూ ఉండరు. అంటే కేన్ ’రోజ్ బడ్’ అనడం ఎవరూ వినే అవకాశం లేదు. ఎందుకంటే కేన్ రోజ్ బడ్ అంటు తన చేతిలోని గాజు వస్తువు ని కింద పడేసిన శబ్దానికి పక్క గదిలో ఉన్న నర్సు కేన్ గదిలోకి వస్తుంది.అప్పటికే కేన్ మరణించివుంటాడు. కేన్ రోజ్ బడ్ అన్నట్టు ప్రేక్షకుడిగా మనకు తెలుస్తుంది కానీ అలా అన్నట్టు వేరే వాళ్ళకి తెలిసుండే అవకాశం లేదు.ఒక విధంగా ఇది చాలా ఘోరమైన తప్పు. ఈ విషయం ఆర్సన్ వెల్స్ కూడా ఒప్పుకున్నారు. రోజ్ బడ్ అనేది కథను నడిపించడానిక వెల్స్ ఎన్నుకున్న ఒక గిమ్మిక్ మాత్రమే. రోజ్ బడ్ గురించి వెల్స్ మాటల్లోనే చెప్పాలంటే….

The Rosebud gimmick is what I like least about the movie. It’s a gimmick, really, and rather dollar-book Freud

ఓపెనింగ్ సీన్(ఇంకోసారి…:-))

టెక్నిక్ పరంగానూ, కథా పరంగానూ అన్నీ చక్కగా అమర్చుకున్న ఈ సినిమాలో ఈ గిమ్మిక్కు ఉపయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మనం సిటిజన్ కేన్ చరిత్ర మరోసారి తవ్వి చూడాలి.

’సిటిజన్ కేన్’ సినిమా కి ముందు అనుకున్న పేరు ’అమెరికన్’. ఈ పేరుతో Mankiewicz మొదట రాసుకున్న స్క్రిప్ట్ లో రోజ్ బడ్ అనే అంశం లేదు. 250 కి పైగా పేజీలు కలిగిన ఈ స్క్రీన్ ప్లే ని చివరకి వెల్స్ 150 పేజీలకు కుదించాడు. ఈ సమయంలోనే multiple flashback పద్ధతిలో సాగే కేన్ కథనాన్ని ముడి వెయ్యడానికి Mankiewicz ఇచ్చిన సలహాతో వెల్స్ ’రోజ్ బడ్’ అనే నెరేటివ్ ప్రక్రియ ను ఉపయోగించారు.

అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. గత అరవై సంవత్సరాలుగా ఈ రోజ్ బడ్ గురించి చాలా మంది చాలా విధాలుగా తమ అభిప్రాయాలు తెలియచేసారు.

వెల్స్ జీవిత కథని రచించిన David Thomson “Rosebud is the greatest secret in cinema…” అంటారు. అలాగే మరి కొందరి అభిప్రాయాలు.

Louis Pizzitola అభిప్రాయం

Rosebud was a nickname that Orrin Peck, a friend of William Randolph Hearst, gave to his mother, Phoebe Hearst. It was said that Phoebe was as close, or even closer, to Orrin than she was to her own son, lending a bitter-sweet element to the word’s use in a film about a boy being separated from his mother’s love.

Gore Vidal అనే రచయిత రోజ్ బడ్ గురించి ఈ విధంగా తెలియచేసారు.

“Rosebud” was a nickname Hearst used for his mistress Marion Davies; a reference to her clitoris

అంతే కాదు ఈ సినిమాలో ’రోజ్ బడ్’ అనే పదం ముద్రించబడిన తోపుడు బండి(sled) ని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ 60,500 డాలర్లకు కొనుకున్నారు. ఈ సందర్భగా ఆయన అన్న మాటలు:

“Rosebud will go over my typewriter to remind me that quality in movies comes first.”

ఇలా చెప్పుకుంటూ పోతే సిటిజన్ కేన్ గురించి ఎంత చెప్పొచ్చో ’రోజ్ బడ్’ గురించీ అంత చెప్పుకోవచ్చనిపిస్తుంది.

ఇంతకీ సినిమా చివరిదాకా చూసిన ప్రేక్షకులకి ఈ రోజ్ బడ్ గురించి ఏమైనా తెలుస్తుందా అంటే అది రహస్యం. ఒకటికి రెండు సార్లు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ సినిమాలో ’రోజ్ బడ్’ కి ఉన్న ప్రత్యేకత. అయితే ఈ విషయాన్ని గ్రహించే పని ప్రేక్షకులకే వదిలేస్తాడు వెల్స్. నేను కూడా ఆ రహస్యాన్ని తెలుసుకునే బాధ్యత ను మీకే వదిలేస్తూ రోజ్ బడ్ విశషాల్ని ఇక్కడితో ముగిస్తాను.

ఎడిటింగ్ మరియు సౌండ్ డిజైన్

కథనం, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ లాంటి అన్ని విభాగాల్లోనూ సిటిజన్ కేన్ సినిమా ద్వారా నూతన ప్రక్రియలను ఆవిష్కరించిన వెల్స్ అన్నింటికంటే ముఖ్యమైన ఎడిటింగ్ విభాగాన్ని వదిలిపెడ్తాడా?

ఈ సినిమాలో ఎడిటింగ్ విభాగంలో ఎన్నో వైవిధ్యమైన ప్రక్రియలకు నాంది పలికాడు వెల్స్. ముఖ్యంగా ఈ క్రింది సీన్లో స్ప్లిట్ సెకండ్లో సీను పదిహేను సంవత్సరాల ముందుకు జరగడాన్ని గమనించవచ్చు.


అలాగే ఈ క్రింది సీన్ చూస్తే కేన్ మరియు అతని అర్థాంగి ల మధ్య  కాలం జరిగే కొద్దీ దూరం ఎలా పెరుగుతూ వచ్చిందో చూపించే ఈ సీన్ సినిమాకే హైలైట్.

బ్రేక్ ఫాస్ట్ సీన్

నటన

ఇక ఈ సినిమాలో నటీనటుల ప్రదర్శన గురించి చెప్పాలంటే ముందుగా ఆర్సన్ వెల్స్ గురించే చెప్పుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించొచ్చనే పట్టుదల గల పాతికేళ్ళ యువకుడిగానూ, విజయ గర్వంతో ఎవ్వరనీ లెక్కచేయని మధ్య వయస్కునిగానూ,అరవై ఏళ్ళకు పై బడి జీవితంలో అందరనీ దూరం చేసుకున్న ఒంటరి వృద్ధునిగానూ ఎన్నో వెలుగు నీడలు కలగలిపిన ఛార్లెస్ ఫాస్టర్ కేన్ గా ఆర్సన్ వెల్స్ ఫోషించిన పాత్ర నిజంగానే నభూతో నభవిష్యతి.

ముగింపు:

విడుదలయిన అరవై సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ చిత్రంగా కొనియాడబడుతున్న ’సిటిజన్ కేన్’ విడుదలయినప్పుడ అంతగా విజయవంతం కాలేదు. ఈ కారణం చేత దర్శకుడు ఆర్సన్ వెల్స్ కు ఈ సినిమా నిర్మాణంలో దొరికినంత స్వాతంత్ర్యం దొరకలేదు. ఒక వేళ తనకి ’సిటిజన్ కేన్’ నిర్మాణంలో దొరికినంత స్వాతంత్ర్యం దొరికుంటే అంతకంటే మంచి సినిమా నిర్మించేవాడిని అభిప్రాయపడ్డారు.

ఆ వివరాలతో పాటు తన జీవితంలోని కొన్ని  ఆసక్తికరమైన విషయాలు ఈ క్రింది ఇంటర్వ్యూలో ఆర్సన్ వెల్స్ స్వయంగా తెలియచేసారు. చూడండి.

వెల్స్ ఇంటర్వ్యూ

ఈ సినిమా ఇప్పటివరకూ మీరు చూసుండకపోతే నవతరంగంలో ఆర్సన్ వెల్స్ గురించి, సిటిజన్ కేన్ గురించి వచ్చిన ఈ వ్యాసాలు (1,2,3)చదవండి. మీ దగ్గర్లో ఉన్న డివిడ్ స్టోర్స్ లో ఈ డివిడి తప్పక దొరుకుతుంది.లేదంటే ప్రకామ్యలోని ఫిల్మ్ క్లబ్ లో చేరి మీకు దగ్గర్లో ఉన్న ప్రకామ్య సభ్యుల దగ్గర ఈ డివిడి ఉంటే తెచ్చుకుని చూడండి.