Menu

Monthly Archive:: June 2013

Taste of Cherry

ఇక చాలు అని చాలించడానికి వంద కారణాలుంటాయి; కానీ చివరి దాకా కొనసాగించడానికి ఒక్క కారణం చాలు! ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారని అంటారు. నా గొయ్యి నేనే తీసుకున్నాను. కానీ నేను పడలేదు; పడుకున్నాను. నేను మెలుకవగానే ఉన్నాను. ఇది మెలుకవేనా? పైన ఆకాశంలో చంద్రుడు నల్లటి మబ్బుల పల్లకి ఎక్కి విహరిస్తున్నాడు. నా ఆలోచనలు వెనక్కి పరిగెడుతున్నాయి. **** నేను మీకు తెలుసు! ఇవాళ ఉదయం ఎవరి కోసమో వెతుకుతూ కార్లో నగరమంతా

Revolutionary Road

అది ప్రేమాకాలం. అతడి కంటి వెలుగులో ఆమె. ఆమె చిరునవ్వులో అతడు. వారు వయసులో ఉన్నారు. ఎండ-వాన, పగలు-రాత్రి, తేడా తెలియని వయసు. గుంపును మరిచి జంట పిచ్చుకల్లా ప్రేమలో మునిగితేలారు. ప్రేమికులు భార్య భర్తలయ్యారు. జంట పక్షులు గుంపు ని వెతుక్కున్నాయి. వారిద్దరూ జన ప్రవాహంలో కలిసిపోయారు. జనం పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నారు. అది పండాలంటే శ్రమించాలన్నారు. ఉండడానికి గూడు కావాలన్నారు. తినడానికి తిండి కావాలన్నారు. ఇవన్నీ కావాలంటే డబ్బు కావాలన్నారు. డబ్బు కావాలంటే

In the mood for love

ఎక్కడ మొదలు పెట్టను? పచ్చని పొలాలను, విశాలమైన ఇళ్లను వదిలి, పచ్చ నోట్ల అన్వేషణలో ఇరుకు గదుల పట్టణాలకు తరలివచ్చిన వారితో నిండిపోయిన జనసముద్రపు తాకిడికి తట్టుకోలేక, అలల్లో కొట్టుకొచ్చి ఒడ్డున మిగిలిపోయిన నా దగ్గరే మొదలుపెట్టాలని ఉంది. కానీ ఓడిపోయి ఒడ్డున చేరిన నా కథ ఎవరికి కావాలి? పోనీ మరోలా మొదలు పెడ్తే? వలస పక్షుల్లా పట్టణానికి తరలి వచ్చి ఏటికొక గూడు మారుతూ వలస జీవితంలోనూ వలస వెళ్తోన్న వింత జీవితం లో

సిటిజెన్ కేన్-మరి కొన్ని విశేషాలు

ఈ నెలనవతరంగం ఫోకస్ శీర్షికలో ఆర్సన్ వెల్స్ గురించి ఆయన సినిమాల గురించి వ్యాసాలు ప్రచురిస్తున్న సంగతి తెలిసే ఉంటుంది.ఆర్సన్ వెల్స్ గురించి మరియి సిటిజన్ కేన్ గురించి ఇప్పటికి నవతరంగంలో మూడు వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. వాటి వివరాలు: సిటిజన్ కేన్ సిటిజన్ కేన్-కొన్ని విశేషాలు ఆర్సన్ వెల్స్ – మొదటి భాగం ఆర్సన్ వెల్స్-రెండో భాగం ఈ సినిమా గురించి, ఆర్సనె వెల్స్ గురించి మరియు ఆయన మిగతా సినిమాల గురించి మీరూ వ్రాయొచ్చు. మీ

సిటిజెన్ కేన్-కొన్ని విశేషాలు

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది 2009 లో మొదటి ’నవతరంగం’ వ్యాసం. ఈ సంవత్సరం ఒక మంచి సినిమాతో మొదలుపెడ్దాం. ప్రపంచ సినిమా చరిత్రలోనే న భూతో న భవిష్యతి అని కొనియాడబడుతూ అరవై ఏళ్ళుగా ప్రపంచంలో అత్యుత్తమ చలనచిత్రంగా నిలుస్తూ వచ్చిన సిటిజెన్ కేన్ గురించి ఈ సంవత్సరం మొదలుపెడదాం. ముందుగా, ఇది ఒక గొలుసు వ్యాసం లాంటిది. అంటే గొలుసు కథల్లాగా, గతంలో నవతరంగంలో వచ్చిన సిటిజెన్ కేన్ వ్యాసానికి ఇది సప్లిమెంటరీ