Menu

వర్షంలో విహారం – Damnation

పరిచయం: Bela Tarr నా జీవితంలోకి ప్రవేశించి ఆయన సినిమాలతో నన్ను కట్టిపడేసాలా చేసిన సినిమా Damnation. ఇది నేను చూసిన మొదటి బెలా టర్ సినిమా. ఈ సినిమా చూసాకే ఆయన సినిమాలన్నీ వరుసగా చూడడం మొదలుపెట్టాను. ఈ సినిమా అంత గొప్ప సినిమా కాదని Bela Tarr స్వయంగా చెప్పినా నాకు మాత్రం ఆయన సినిమలన్నింటిలో విపరీతంగా నచ్చిన సినిమా ఇది. నేను చదివిన చాలా సమీక్షల్లో ఈ సినిమాలో కథ లేదు అన్న అభిప్రాయంతో నేనూ ఏకభవిస్తున్నప్పటికీ సినిమాని ఆస్వాదించడానికి కేవలం మంచి కథ మాత్రమే అవసరంలేదు అని నమ్మే వారిలో నేను ఒకరిని కాబట్టి నాకీ సినిమా అంతగా నచ్చడానికి కారణాలేమిటో ఇక్కడ ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాను.

కథ: ఒంటరి జీవితం గడుపుతూ జీవితంపై ఎటువంటి ఆసక్తి లేక రోజంతా తన ఇంటి కిటికీ దగ్గర నిల్చుని conveyor belt మీద సాగిపోయే ట్రాలీలను చూస్తూ గడుపుతుంటాడు Karrer. సాయంత్రమవగానే టైటానికి బార్ కి చేరుకుంటాడు-మందుకొట్టడానికీ మరియు అక్కడ పాటలు పాడే అమ్మాయిని సైటు కొట్టడానికి. ఆమెకు ఇది వరకే పెళ్ళయిపోయివుంటుంది. Karrer కు ఆమెతో సంబంధం కలిగివుందని ఆమె భర్తకు ముందే అనుమానంగా వుంటుంది; తన భార్య వెంటపడొద్దని వార్నింగ్ కూడా ఇస్తాడు. ఇలాంటి సమయంలో ఆ హోటల్ యజమాని స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించే మార్గం Karrer కు చెప్తాడు. Karrer ఈ విషయాన్ని పాటలుపాడే ఆమె భర్తకు చెప్పి డబ్బాశ చూపించి అతన్ని ఆ వూరు నుంచి కొన్నాళ్ళు దూరంగా వుండేలా చేసి ఆ సమయంలో అతని భార్యను తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. అతని పథకం సగం వరకూ బాగానే పారుతుంది కానీ ఆమె Karrer వెంట రానని తెగేసి చెప్తుంది. అంతేకాకుండా ఆ హోటల్ ఓనర్ తో కలిసి వెళ్తుంది. Karrer జీవితం వ్యర్థమనుకుని రోడ్డున పడి ఊరకుక్కల్లో కలిసిపోతాడు.

నా అభిప్రాయం: ఈ సినిమాలో మరీ కథేమీ లేకుండా కేవలం విజువల్స్ అధారంగా నడుస్తుందని చెప్పలేము. కథ వుంది కానీ అది చాలా చిన్న కథ అని చెప్పడం సరిపోతుందనుకుంటాను. ఈ సినిమా ఒక లఘు కథ అధారంగా రూపొందించబడంది కాబట్టి కథ చిన్నది అవడంలో ఆశ్చర్యం లేదు. అయినా ముందుగానే చెప్పినట్టు కేవలం కథ కోసమే నేను సినిమా చూడను కాబట్టి ఈ సినిమా నాకు వేరే ఇతర కారణాల వల్ల నాకు నచ్చింది.

ఈ సినిమా మొదటి సారి చూసినప్పుడే నాకు నచ్చినప్పటికీ మళ్ళీ మళ్ళీ చూస్తుంటే ఇంకా బావుందనిపిస్తోంది. ఇప్పటికీ నాలుగైది సార్లు చూసాను ఈ సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. బ్లాక్ అండ్ వైట్ లో ఇంత అందముందా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. ఉండడానికి చెత్త చెదారం నిండీపోయిన వీధులు, ఒక వైపు వర్షం. అలాంటి బురద నిండిన వాతావరణాన్ని అంత అందంగా చిత్రీకరించడం ఒక్క బెలా టర్ కే సాధ్యం అనిపించింది. సినిమా మొత్తం Karrerధ్రృక్కోణంలో గ్లూమీగా నూ విషాదంతోనూ నిండివున్నప్పటికీ ప్రతీ ఫ్రేమూ అధ్భుతమైన షాట్ కంపోజిషన్ తో, లైటింగ్ తో ఎంతో అందంగా వుండడం కొంచెం ఐరానికల్. దీన్నే ‘beautiful sadness’ అనొచ్చేమో!

ఒక సినిమా నాకు నచ్చడానికి కారణాల్లో ఒకటి ’personal vision’. అంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు అది ఎవరు తీసారో తెలియకపోయినా ఇది ఫలానా దర్శకుడు తీసుండొచ్చు అని చెప్పగలిగే సినిమాలు, దర్శకులు చాలా తక్కువ వుంటాయి. మన తెలుగులో వంశీ, జంధ్యాల, విశ్వనాధ్ సినిమాలు చూస్తున్నప్పుడూ ఈ క్వాలిటి కనబడుతుంది. అలాగే ఒక సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా తప్పకుండా బెలా టర్ తీసుంటాడు అని చెప్పడానికి సరిపడే ఒక ఫిల్మ్ లాంగ్వేజ్ బెలా టర్ తన సినిమాల ద్వారా సృష్టించాడాని చెప్పొచ్చు.దీన్నే ‘auteur theory’ అని అంటారు.

Werckmeister Harmonies సినిమాలోని పాత్రలు నడుస్తుండగా వారిని ఫాలో చేస్తూ వుండే ట్రాకింగ్ షాట్లతో నిండిపోయివుంటుంది. అది ఆ సినిమాకి ఉపయోగించిన సినిమాటిక్ డివైస్ అయితే ఈ సినిమాలో ఎక్కువషాట్లు horizontal ట్రాకింగ్ షాట్స్ ఉపయోగించారు Bela Tarr.

ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లోని షాట్స్ వేరు వేరుగా చూస్తే ఈ విధంగా వుంటాయి.

Damnation లో ఉపయోగించిన షాట్స్:

 • Static compositions(30%)
 • Lateral/horizontal tracking shots(30%)
 • Parobolic tracking shots (15%)
 • Handheld shots(7.5%)
 • Crane shots(7.5%)
 • Panning shots(10%)

Werkmeister harmonies లో ఉపయోగించిన షాట్స్

 • Static compositions(10%)
 • Lateral/Horizontal tracking shots (10%)
 • Parobolic tracking shots (5%)
 • Mobile dolly shots (10%)
 • Mobile steadicam shots (20%)
 • Vertical (or tracking) dolly shots (25%)
 • Crane Shots(5%)
 • A combination of 2 & 5(7.5%)
 • A combination of 3 & 5 (7.5%)

వర్షం:ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన వర్షం ఈ సినిమా నాకు నచ్చడానికి మరో కారణం. దాదాపు ఈ సినిమా మొత్తం వర్షాకాలపు సాయంత్రాలలో జరుగుతుంది. వర్షం లో, వీధి లైట్ల వెలుతురులో అక్కడక్కడా తిరుగుతున్న ఊరకుక్కలు వాటి నడుమ అప్పుడప్పుడూ నడుస్తూ వెళ్ళే ఈ సినిమాలోని పాత్రలు చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. ఒక్కొ ఫ్రేమూ తైలవర్ణ చిత్రంలా వుంటుంది. అదీ కాక వర్షంతో పాటు పొగ కూడా చాలా సీన్లలో స్క్రీన్ ని అలుముకొని వుంటుంది. అది విజువల్ కి సంబంధించన విషయమయితే ఇక వర్షం పడే శబ్దం ఈ సినిమాలో చాలా బాగా రికార్డ్ చేశారు. మంచి సౌండ్ సిస్టమ్ లో వింటే మనమూ వర్షంలో నిలబడి సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది.

మొన్నీ మధ్య నేనొక టార్కొవ్స్కీ సినిమా DVD లో చూస్తూ ఆ సినిమా ’making of’ డాక్యుమెంటరీ చూస్తుంటే అందులో టార్కోవ్స్కీ smoke machine ఆపరేటర్ తో గొడవపెట్టుకోవడం చూశాను. అది చూసిన తర్వాత, Bela Tarr సినిమాకు పని చేసే సినిమాటోగ్రాఫర్లు  పడే కష్టం కళ్లముందు కనిపించింది.

ఇక ట్రాకింగ్ షాట్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఉన్నన్ని నాణ్యమైన ట్రాకింగ్ షాట్స్ ఇంకే సినిమాలో వెతికినా కనబడవు.

వర్షంలో ట్రాకింగ్ షాట్-వీడియో:

ఇంకా…:

బెలా టర్ సినిమాలు జనాలు ఎందుకు చూడరు? అతను ఎందుకు మిగిలిన కళాత్మక దర్శకులలాగా పాపులర్ కాలేదు అనే ప్రశ్నలకు నా మాటల్లో చెప్పదగిన సరైన సమాధానం ఇంకా పరిపూర్ణంగా నాకు తెలియలేదు కానీ Peter Hames అనే ఫిల్మ్ క్రిటిక్ చెప్పిన ఈ సమాధానం నాకు బాగా నచ్చింది.

Why Béla Tarr and not Péter Gothár, János Rósza, György Fehér, or other talented directors? The answer probably lies in the extreme formal challenges presented by his work. His most radical film, Sátántangó, runs for over seven hours, is in black and white, has a script that is the reverse of feel-good and is, in its lack of concern for linear narrative, incomprehensible. After ten minutes of looking at a herd of cows, Hollywood executives would leave; it would never receive funding from Britain’s Film Council, and it has no chance of screening in a multiplex or being shown on television.It is the polar opposite of the blockbuster and the Miramax-backed foreign-language Oscar-winner. It is a slap in the face of consumerism and corporate taste.

ముగింపు:చివరిగా చెప్పొచ్చేదేమిటంటే,

 • మీకు Wang Kar-Wai రూపొందించిన ’In The Mood for Love’ సినిమా నచ్చి వుంటే అందులోని విజువల్స్ కి సరితూగగలిగే విజువల్స్ ఈ సినిమాలోనూ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కూడా మీకు నచ్చే అవకాశం వుంది.
 • Tarkovesky సినమాలు మీకు నచ్చి వుంటే, అందులోనూ మిర్రర్ సినిమా బాగా నచ్చివుంటే ఈ సినిమా కూడా మీకు నచ్చే అవకాశం వుంది. మిర్రర్ సినిమాలోలాగే కెమెరాతో తెరపై కవిత్వం చిత్రించడం అంటే ఒక Tarkovesky ఒక బెలా టర్ లకే సాధ్యం అని మీకనిపించవచ్చు.
5 Comments
 1. KONDAVEETI NAANI August 9, 2008 /
 2. F1 October 14, 2008 /
 3. F1 October 14, 2008 /