Menu

Monthly Archive:: May 2013

మహానగర్

పితృస్వామ్య భావజాలం వేళ్లూనికుని అనధికారకంగా కుటుంబంలోనూ, సమాజం లోనూ రాజ్యమేలుతున్న వ్యవస్థలో స్త్రీ తన కాళ్లమీద తాను నిలబడడమూ, కుటుంబం గడపదాటి అడుగుపెట్టడమూ ఓ గొప్ప సందర్భమే. ఆ సందర్భం ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలోని పురుష వీక్షణాల్ని అతలాకుతలం చేస్తుంది. అంతదాకా పురుష దృక్పథానికి వస్తువుగా కనిపించిన స్త్రీ వ్యక్తిత్వంతో ఎదిగే తీరు ఆ పరుష భావజాలానికి పెద్ద సంచలనంగానే కనిపిస్తుంది. యాభై ఏళ్ల క్రితం స్త్రీ బయటి ప్రపంచంలోకి ఉద్యోగం కోసం వెళ్లడమంటే సనాతన

నా జీవితం లో ’రే’ సినిమా

సత్యజిత్ రే సినిమా గురించి వివరణాత్మక వ్యాసం రాసే అనుభవం, ధైర్యం రెండూనాకు లేవని నా గొప్ప నమ్మకం.అందుకే నా జీవితం లొ ’రే’ సినిమా ఎలాంటి గమ్మత్తైన విధంగా ప్రవెశించిందో పంచుకుందామని కూసింత ప్రయత్నిస్తాను. సాధారణంగా ఎ ’పథెర్ పాంచాలి ’ తోనో ’అప్పు triology’ తోనో రే తో పరిచయప్రాప్తి కలగడం సర్వసాధారణం, కాని నాకు మాత్రం ’చారులత’ సత్యజిత్ రే ని పరిచయం చేసింది. 1994 లో ఆంధ్ర దేశమనే నాకు తెలిసిన

షత్రంజ్ కే ఖిలాడి (1977)

ఒక సినిమాను చూస్తూ ఉండగానే – “వావ్…” అనుకుంటూ…పూర్తవగానే…”వావ్వ్వ్వ్వ్” అని అనుకోవడం ఇటీవలి కాలంలో జరగలేదు నాకు. సత్యజిత్ రాయ్ హిందీ చిత్రం ’శత్రంజ్ కే ఖిలాడీ’ చూసాక, అలాంటి అనుభవం కలిగింది. చిన్నప్పుడు దక్షిణభారత్ హిందీ ప్రచార్ సభ పరీక్షల్లో – ఒక పాఠ్యాంశంగా ప్రేంచంద్ ’శత్రంజ్ కే ఖిలాడీ’ ఉన్నట్లు గుర్తు. అదే ఈచిత్రానికి మూలం. చారిత్రక సంఘటన ఆధారంగా రాసిన ఈకథ, ఒరిజినల్ ఎలా చదివానో, అప్పటికి స్కూలు రోజుల్లో నాకేం అర్థమైందో

సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – I

(స్థలాభావం వల్ల ఈ వ్యాసంలో మూడవ వంతు కన్నా తక్కువ భాగం మాత్రమే అమెరికాలో ఒక తెలుగు సంఘం 25వ వార్షిక సంచికలో ఈ మధ్యే అచ్చయ్యింది. ఇంటర్‌నెట్ ప్రచురణలలో అటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అది అందుబాటులో ఉండనందువల్ల, మరి కొన్ని విషయాలు జోడించి, ఆ వ్యాసాన్ని పొడిగిస్తూ కొన్ని ఫొటోలతో సహా ఇక్కడ ప్రచురిస్తున్నాను. – రచయిత) “కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు” అన్న వేటూరి

సత్యజిత్ రాయ్ ‘హిరాక్ రాజర్ దేశ’

ఒక నాలుగేళ్ల క్రితమేమో – ఈ సినిమా షూటింగ్ లో తన అనుభవాల గురించి రాయ్ “చైల్డ్ హుడ్ డేస్” అనే పుస్తకంలో రాసారు. చదివిన ఒక సంవత్సరం లోపే, ఆ వ్యాసాన్ని నేను నవతరంగంలో అనువదించాను. అప్పటికి నాకు కథ తెలుసుకానీ, సినిమా చూడలేదు. కథ చదివినప్పుడు పిల్లల సినిమానే అనుకున్నా కానీ, చూస్తూ ఉంటే అర్థమైంది – ఎంత వ్యంగ్యం ఉందో. ఆ ఏటి ఉత్తమ బెంగాలీ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుని, సైప్రస్