Menu

చిన్న సినిమా

ఈ సినిమా డైరెక్టర్ తో  టివి9 లొ వారధి లొ ఓ ఇంటర్వూ చూశాను. పోనీలే చిన్న సినిమా గదా చూసేద్దామని చికాగో బిగ్ సినిమా లో ఆదివారం సాయంకాలం 5 షొ కి వెళ్ళాను. అశ్చ్య్రరం.. ధియేటర్ లో నేను నా కూతురు తప్ప ఇంకెవ్వరు లేరు. భయం వేసింది బలయిపోతున్నామా అని. ఫర్లేదులే చిన్నసినిమా ల కత ఇంతే కదా అని లోపల సెటిల్ అయ్యిపోయాము. మా అమ్మాయి రావటానికి కారణం హీరో తనకు తెలుసు అని.

సినిమా అమెరికాలో తీశారు. కాని ఓ షాప్ లో వనిచేసేవాడికి అలాటి ఇంట్లో ఉండే అవకాశమే లేదు. మాక్షిమమ్ బేస్మెంట్ లో ఉండగలిగితే గొప్పే. ఓ షీ.. ఓ కారు కొన్ని షికార్లు ఓ మోటార్ సైకిల్  .. పర్లేదు లే సినిమా చూడగలుగుతున్నమ్ అని సంబరపడ్డాను. కాని సహనానికి పరీక్ష లానే అనిపించింది.  హీరో ని హీరోయిన్ ఇమ్మీడియట్ గా ఆస్సెప్ట్ చే సి పాటలు పాడుకోవటం గాప్ ఫిల్లింగ్ కి విలన్ సీన్లు లేక పోతే హీరో రూమ్మేట్లు అనవసర విన్యాసాలు. అసలు డైరక్టరు ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాలేదు. హీరో మా నాన్న కి ఇల్లు కట్టటానికి డబ్బు పంపించాలి అంటాడు. నోబుల్ కాస్ అనుకున్నా. ఇంతలో రామాలయం అనే అనాధ శరణాలయం కధ మొదలయ్యింది. బాలయ్య దాని రక్షకుడు. ఓ చోటా రాజకీయ నాయకుడు వచ్చి 50 లక్షలు ఇస్తాను మానాన్నపేరు పెడితే అంటాడు. దానికి బాలయ్య ఒప్పుకోడు. కారణం దానం చేసేవాడు ప్రతిఫలం ఆశించకూడదు అని. తను మాత్రం పిల్లలకి గంజినీరు తప్ప ఇంకేమి పెట్టలేడు. ఇక్కడ సినిమా కృతకంగా తయారు అయ్యింది. ఈ శరణాలయం పెట్టడానికి ఊన్న కారణం కూడా అంతంత మాత్రమే. దానికి పేరుకి ఎటువంటి సంబంధము కనిపించదు. ఓ వేశ్య కోసం పరితపించే మగాళ్ళు తెగ దానాలు చేస్తారు. ఎవరు ఎక్కువ చేస్తే వారికి ఆ వేశ్య లభిస్తుంది. ఆ దానాలు పొందిన జనాలు దారి తప్పుతూంటె వారి పిల్లలను రక్షించటానికి బాలయ్య ఈ అనాధ శరణాలయం ప్రారంభిస్తాడు. ఎలా ఉంది.

దానం చేసేవాడు ప్రతిఫలం ఆశించకూడదు అనే కాన్ సెప్ట్ బాగున్నా అది చెప్పటంలో డైరెక్టర్ ఘోరంగా విఫలమయ్యడు. అసలు హీరో కి రామాలయానికి సంబంధం ని సరిగా ఎష్టాబ్లిష్ చెయ్యలేకపోయాడు. హీరో రూమ్మేట్లు ఓ సినిమా పిచ్చోడు ఓ పిల్ల పిచ్చోడు. వీళ్ళకి సరైన ముగింపు ఇవ్వలేదు. హీరో ఎపిసోడ్ రామాలయం ఎపిసోడ్ రెండు సినిమాలు చూసినట్లుంది. ట్రయాంగిల్ కోసం చోటా రాజకీయ నాయకుడు కాస్తా హీరోయిన్ అన్నయ్య గా చూపించాడు. విలనిజం కోసం షాపు ఓనర్ వాడి బామ్మర్దిని వాదుకున్నారు. విలన్ల సీన్ లు ఎక్కువయ్యాయి. ఓ ముగ్గురు అబ్బాయిలు, ఓ ఇద్దరు అమ్మాయిలు, ఓ ముగ్గురు సీనియర్ ఆర్టిష్తు లు, ఓ నలుగురు విలన్లు, ఓ తల్లి, ఓ పది మంది ఇతర నటులు కలసి ఓ చిన్న సినిమా. ఎల్ బి శ్రీరాం, సూర్య వృధా అయ్యారు.

కంభంపాటి వారు టివి9 లొ చూపించిన కాన్ఫిడెన్స్ సినిమా తియ్యటంలో చూపించలేకపోయారు.

3 Comments
  1. Sarath May 9, 2013 /
  2. Srinivas May 24, 2013 /
  3. T . Sesha giri June 11, 2013 /