Menu

Monthly Archive:: May 2013

ఆండ్రే వైదా-ఒక పరిచయం

పరిచయం: అయనకి సినిమా ఒక ఆయుధం.  ఆయనకి సినిమా ఒక సాధనం.  ఆయన సినిమాలు చరిత్రకు సాక్ష్యాలు. ఆయన సినిమాలు సమకాలీన సమాజపు భావజాలానికి ప్రతిబింబాలు. యాభై ఏళ్ళకి పైగా సినిమాలు తీస్తూ తన దేశపరిస్థుతులు ప్రపంచానికి తెలియచేస్తూ సినిమానే జీవితం చేసుకున్న ఆయన పేరు ఆండ్రే వైదా (Andrzej Wazda). పోలండ్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా చేర్చదగ్గ ఆండ్రే వైదా పై ఆయన సినిమాలపై ఈ నెల నవతరంగం లో ఫోకస్

సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – III

(ఈ వ్యాసాల్లో ఇది మూడవది, ఆఖరిది. మొదటి భాగంలో కథా నిర్ణయం, తూర్పు పశ్చిమ దేశాల సినిమా ప్రభావం, ఎడిటింగ్ – రెండవ భాగంలో సంగీతం, కెమేరా పనితనం, స్క్రిప్ట్ పరిచయం చేసాను. ఈ మూడవ భాగంలో రూపకల్పన, నటులు, దర్శకత్వం వరుసగా పరిచయం చేస్తున్నాను.) 7. రూపకల్పన ఏ రంగంలో అయినా చేసిన పనికి అత్యుత్తమ స్థాయి గుర్తింపుకి బీజం ఆ పనిలో గుర్తించగలిగే అతి చిన్న వివరాలే అన్న విషయం అందరికీ తెలుసు. సినీరంగంలో

మహానగర్

ఈ మధ్యనే సత్యజిత్ రాయ్ తీసిన “ఫెలూదా” సినిమాలు రెండు చూసాను. వాటిల్లో ఒక దాని గురించి నా బ్లాగులో రాస్కుంటే, చూసిన వారు ఒకరు “మహానగర్” చిత్రం యూట్యూబ్లో ఉందని తెలిపారు. వారితో నాకు పరిచయం లేదు కానీ, “సంగీత” గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా గురించి నా ఆలోచనలు: కథ: ఈ కథ యాభైల ప్రాంతానిది అనిపిస్తుంది.  ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం – సంపాదించేది ఒక్కరు. తినేది అయన కాక మరి

సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – II

(మొదటి భాగంలో రాయ్ సినిమాలపై మూడు అంశాలను పరిచయం చేసాను. అవి కథా నిర్ణయం, తూర్పు – పశ్చిమ సినిమాల ప్రభావం, ఎడిటింగ్. ఈ రెండవ భాగంలో – సంగీతం, కెమేరా పనితనం, స్క్రిప్ట్ అంశాలను పరిచయం చేస్తున్నాను. – రచయిత) 4. సంగీతం రాయ్ అపు చిత్రత్రయంలోని మూడు సినిమాలకు సంగీతం ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ సమకూర్చాడు. ఆ పై వచ్చిన ఒకటి, రెండు సినిమాలకి తప్ప తరవాత సినిమాలకు రాయ్ స్వయంగా

చారులత

భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు రూపమైన సత్యజిత్ రే తన జీవితకాలంలో నిర్మించిన ముప్పైకి పైగా చలన చిత్రాల్లో అత్యంత భావావేశంతో కూడుకున్న చిత్రం “చారులత”. ఆ చిత్రంలో అత్యంత వివేకమూ, అమితమయిన సున్నితత్వమూ, తనపైన తనకు గాఢమైన విశ్వాసమూ కలిగిన అందమయిన స్త్రీ చారులత ముఖ్యాభినేత. ఆమె తన జీవితంలో ఎదిగిన తీరూ, అనుభవించిన ఒంటరితనమూ, తన అభీష్టాలను నెరవేర్చుకునే క్రమంలో ఆమె ముందుకు సాగిన వైనమూ ఈ చిత్రంలో ప్రధానాంశాలు. తన కుటుంబ జీవన