Menu

ఓపెన్ సోర్స్ సినిమా

ఓపెన్ సోర్స్ సినిమా అంటే ఏమిటి?

ఓపెన్ సోర్స్ సినిమా అంటే తెలుసుకునే ముందు అసలు ఓపెన్ సోర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సాధారణంగా కంప్యూటర్ వినియోగించే అందరికీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ గురించి తెలిసే ఉంటుంది. ఒక వేళ మీకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ గురించి తెలియకపోయినా మీరు ఏదో విధంగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ వాడే ఉంటారు.

ఉదాహరణకు మీరు ఇంటర్నెట్ లోని ఈ సైట్ ని చూడడానికి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఉపయోగిస్తుంటే మీరు ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ వాడుతున్నారని అర్థం. ఈ సాఫ్ట్ వేర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ తయారు చెయ్యడానికి ఉపయోగించిన కోడ్ మొత్తం మీకు ఉచితంగా లభ్యమవుతుంది. ఆ కోడ్ వాడుకుని మీరు మరో బౌజర్ తయారు చేసుకోవచ్చు. ఈ మధ్యనే ఎపిక్ అనబడే బ్రౌజర్ ఈ విధంగా తయారు చేయబడినదే.

మీరు విండోస్ వాడకం దారులైతే మీకు మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‍ప్లోరర్ మీకు అందుబాటులోనే ఉంటుంది. అయినప్పటికీ చాలా మంది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ నే ఉపయోగిస్తారు. అందుకు చాలా కారణాలున్నాయి. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ఉన్నన్ని సదుపాయాలు ఇంటర్నెట్ ఎక్స్‍ప్లోరర్ ఉండవు అందుకు కారణం ఇంటర్నెట్ ఎక్స్‍ప్లోరర్ లో ఏ సదుపాయం కల్పించాలన్నా మైక్రోసాఫ్ట్ వాళ్లే చెయ్యాలి. ఫైర్ ఫాక్స్ అయితే అలా కాదు. దాని సోర్స్ కోడ్ ఉచితంగా లభ్యమవుతున్న కారణంగా ఆ కోడ్ ఉపయోగించడం తెలిసనవారెవరైనా అందులో తమకి కావాల్సిన సదుపాయాలు కల్పించుకోవచ్చు.

అలాగే మీరు మైక్రోసాఫ్ట్ వారి వర్డ్ ఎప్పుడోకప్పుడు వాడే ఉంటారు. ఇందులో కూడా అంతే. ఉదాహరణకు మీరు వర్డ్ లో రాసిన డాక్యుమెంట్ ని పిడిఎఫ్ గా మార్చుకోవాలంటే వర్డ్ లో ఆ సదుపాయం ఉండదు. మనం ఎలాగో వర్డ్ లో ఆ సదుపాయం కల్పించుకుందామనుకున్నా ఆ కోడ్ మనదగ్గర లేదు కాబట్టి మనకి సాధ్యం కాదు. అదే ఓపెన్ ఆఫీస్ అనబడే ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేరే మైక్రో సాఫ్ట్ ఆఫీస్ లోని అన్ని సదుపాయాలు కలిగిఉండడమే కాక పైన ఫైర్ ఫాక్స్ ఉదాహరణలో చెప్పినట్టుగా మీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఓపెన్ ఆఫీస్ లో మీరే నిర్మించుకోవచ్చు.

ఈ విధంగా సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉండేలా చేసే సాఫ్ట్ వేర్ ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ అని అంటారు. అయితే…ఈ ఓపెన్ సోర్స్ సినిమా అంటే ఏమిటి?

పైన చెప్పిన ఉదాహరణనే మనం ఒక సినిమాకి అన్వయించుకుందాం.

ఉదాహరణకు రాం గోపాల్ వర్మ తీసిన దొంగల ముఠా చిత్రం తీసుకుందాం. ఈ సినిమా మనం థియేటర్లలో చూసినప్పుడు గంటన్నర నిడివి ఉందనుకుందాం. అయితే సినిమా తీసే ప్రక్రియలో వర్మ తెరపై మనం చూసిన కేవలం గంటన్నర చిత్రాలే కాదు దానికి ఐదారు రెట్లు వీడియోనే రికార్డ్ చేసి ఉంటాడు. ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. కొన్ని టేక్స్ లో లైటింగ్ సరిగా లేకనో, నటీ నటులు సరిగా నటించకో ఇలా వివిధ కారణాల చేత ఒకే షాట్ ని ఎన్నో సార్లు రికార్డ్ చెయ్యాల్సిన అవసరం గురించి సినిమా అంటే తెలిసిన ప్రతి ఒక్కరికే తెలిసే ఉంటుంది. ఒక వేళ నేను వర్మ దగ్గరకు వెళ్లి “ఈ సినిమా లో ఎడిటింగ్ బాగోలేదు నేనైతే …” అని ప్రగల్భాలు పోయాననుకోండి. అప్పుడు వర్మ కి ఒళ్లు మండి “సరే నేను దొంగల ముఠా కోసం షూట్ చేసిన ఫుటేజ్ మొత్తం ఫ్రీగా ఇస్తాను…నువ్వైతే ఎలా ఎడిట్ చేస్తావో చూపించు” అన్నాడనుకుందాం. అప్పుడు నేను “ఫుటేజ్ ఒక్కటే సరిపోదు.నేను ఎడిటింగ్ చేసిన సరిగా రావాలంటే డైలాగ్ టాక్స్, బ్రాక్ గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్ ట్రాక్స్ కూడా ఇస్తే అప్పుడు చూపిస్తా నా తడాఖా” అని రెచ్చిపోతే “సరే మొత్తం సినిమా కి సంబంధించిన సోర్స్ అంతా ఫ్రీగా నెట్ లో పెట్టేస్తా…ఎవరైనా నేను చేసిన దానికంటే బెటర్ వర్షన్ చెయ్యండి” అని ఛాలెంజ్ చేసాడనుకోండి అప్పుడు వర్మ తీసిన దొంగల ముఠా సినిమా ఓపెన్ సోర్స్ మూవీ అయ్యుండేది.

అంటే ఒక సినిమా తీసి ఆ సినిమా కి సంబంధించిన సోర్స్ మెటీరియల్ అంతా ఉచితంగా ప్రజలకి అందుబాటులోకి తేగలిగితే ఆ సినిమాని ఓపెన్ సోర్స్ సినిమా అంటారన్నమాట.

ప్రపంచంలో ఇదీ మొట్టమొదటి ఓపెన్ సోర్స్ సినిమా అని చెప్పడానికి నా దగ్గర సరైన సమాచారం లేదు కానీ నాకు తెలిసినంతవరకూ 2006 లో మొదలైన స్ట్రే సినిమా అనే ప్రాజెక్ట్ ద్వారా నాకు ఓపెన్ సోర్స్ సినిమా పరిచయం అయింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ముందే షూట్ చేసిన ఫుటేజ్ ని ఎవరైనా డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు స్ట్రే సినిమా నిర్వాహకులు. అలా డౌన్ లోడ్ చేసుకున్న ఫుటేజ్ ద్వారా మనం ఒక లఘు చిత్రాన్ని ఎడిట్ చేసి వారు నిర్వహించే పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు.

ఆ తర్వాత అదే సంవత్సరంలో ఓపెన్ సోర్స్ సినిమాగా విడుదలయిన ఒక లఘు చిత్రం “ఎలిఫెంట్స్ డ్రీం”. ఈ లఘు చిత్రం అప్పటికీ ఇప్పటికీ ఒక సెన్సేషనే. Bassam Kurdali దర్శకత్వంలో రూపొందిన ఈ పది నిమిషాల లఘుచిత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ సినిమా మాత్రమే కాదు ఈ యానిమేషన్ సినిమా పూర్తిగా “బ్లెండర్” అనే ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి నిర్మించబడింది.

ఆ తర్వాత కాలంలో చాలానే ఓపెన్స్ సోర్స్ సినిమాలు నిర్మించబడ్డాయి. అందులో ప్రముఖమైనవిగా “సీతా సింగ్స్ బ్లూస్”, “సింటెల్” మరియు “బిగ్ బక్ బన్నీ” ని పేర్కొనవచ్చు.

ఓపెన్ సోర్స్ సినిమాల గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడవచ్చు.

ఇంతకీ ఇప్పుడీ ఓపెన్ సోర్స్ సినిమాల సంగతెచ్చుకొచ్చిందంటే…

ఈ నెల పదమూడు, సోమవారం రోజున ప్రసాద్ ల్యాబరోటరీస్, హైదరాబాదు లోని ప్రివ్యూ థియేటర్ లో మూడు ఓపెన్స్ సోర్స్ సినిమాలు ప్రదర్శించబోతున్నాము. ఈ సినిమాలు ఎలాగూ ఓపెన్ సోర్స్ సినిమాలు కాబట్టి యూట్యూబ్ లో కానీ లేదా డౌన్ లోడ్ చేసుకునో హాయిగా చూడొచ్చు. కానీ ఈ ప్రదర్శనకు ఒక ప్రత్యేకత ఉంది. హాలీవుడ్ యానిమేటెడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని ఈ సినిమాలు అద్భుతమైన క్వాలిటీతో సరౌండ్ సౌండ్ ట్రాక్ తో పెద్ద స్క్రీన్ మీద చూడడంలో థ్రిల్ వేరు. అంతే కాదు ఈ సినిమా సోర్స్ ఫైల్స్ ని డౌన్ లోడ్ చేసుకుని పూర్తిగా ప్రాసెస్ చేసి నేను ఈ మధ్యనే డెవలప్ చేసిన డిజిటల్ సినిమా ప్లేయర్ ద్వారా  ఈ సినిమాలు ప్రదర్శింపబడనున్నాయి. అందుకోసమైనా మీరు ఈ సినిమాలు చూడవచ్చు.

నవతరంగం మరియు హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ & ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ స్క్రీనింగ్ లోప్రదర్శింపబడనున్న సినిమాల వివరాలు:

Elephants Dream

Elephants Dream is the story of two strange characters exploring a capricious and seemingly infinite machine. The elder, Proog, acts as a tour-guide and protector, happily showing off the sights and dangers of the machine to his initially curious but increasingly skeptical protege Emo. As their journey unfolds we discover signs that the machine is not all Proog thinks it is, and his guiding takes on a more desperate aspect.

Elephants Dream is a story about communication and fiction, made purposefully open-ended as the world’s first 3D animated “Open movie”.

Sintel

Sintel is a short computer animated film by the Blender Institute, part of the Blender Foundation. The name comes from the Dutch word sintel, which can mean cinder or ember, as confirmed by Ton Roosendaal in a blog comment: ” “Sintel” is [a] piece of glowing coal or metal. It glows brightly, burns, and then becomes ashes…”.Like the foundation’s previous films Elephants Dream and Big Buck Bunny, the film was made using Blender, a free software application for animation made by the same foundation.

Big Buck Bunny

Big Buck Bunny is a short computer animated film by the Blender Institute, part of the Blender Foundation.Like the foundation’s previous film Elephants Dream, the film was made using Blender, a free software application for animation made by the same foundation.

3 Comments
  1. challa June 10, 2011 /
  2. V.V.Satyanarayana Setty June 10, 2011 /
    • venkat June 10, 2011 /