Menu

ఫిల్మ్ స్టడీస్ మనకి అవసరమా?

ఫిల్మ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతుంటే మిత్రుడొకడు మీరు కనుక్కొన్న ఈ భాష కి లిపి ఏంటని అడిగాడు. ఫిల్మ్ లాంగ్వేజ్ అంటే మన వాళ్ళకి బొత్తిగా అవగాహన లేదని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలనుకుంటాను. మరి ఫిల్మ్ లాంగ్వేజ్ అంటే ఏంటని ఎవరైనా అడిగితే “‘Film language’ describes the way film ‘speaks’ to its audiences and spectators” అని చెప్పొచ్చు.

గత సంవత్సరం ట్యాంక్ బడ్ దగ్గర ఉన్న ప్లై ఓవర్ దగ్గర ఒక పెద్ద హోర్డింగ్ చూశాను. అది హైదరాబాదు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి సంబంధించిన హోర్డింగ్. అందులో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య గారు, కేంద్ర మంత్రి అంబికా సోని, రాష్ట్ర మంత్రి గీతా రెడ్డి గార్ల ఫోటోలతో పాటు నందితా దాస్ ఫోటో కూడా ఉంది. అయితే ఆ నాలుగు ఫోటోల్లో మిగిలిన మూడు ఫోటోలు పెద్దవి గా ఉంటే నందితా దాస్ ది మాత్రం ఆ ఫోటోల్లో సగం సైజు మాత్రమే ఉంది. నిజానికి అక్కడ నందితా దాస్ ఫోటో మిగిలిన ఫోటోస్ అంత సైజులో పెట్ట గలిగే స్థలం ఉంది. కానీ ఈ పోస్టర్ డిజైన్ చేసిన వాళ్ళు నందితా ఫోటో ని చిన్నది గా చెయ్యడం ద్వారా చెప్పకుండానే మనకో విషయం చెప్తున్నారనే విషయం మీకీపాటికి అర్థమైపోయి ఉండాలి.

అలాగే మరో ఉదాహరణ: అప్పుడెప్పుడో ఆత్రేయ గారు అక్కినేని గురించి వ్రాసిన ఒక వ్యాసానికి సంబంధించిన ఇమేజ్ తయారు చేస్తున్నాను. నెట్ లో ఎక్కడినుంచో ఒక ఆత్రేయ గారి ఇమేజ్ ఒక అక్కినేని ఇమేజ్ తీసుకుని వాటిని రెండింటిని పెయింట్ ద్వారా కలపడానికి ప్రయత్నిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. అదేంటో చెప్పడం కంటే ఈ క్రింద ఉన్న ఇమేజ్ చూస్తే మీకే అర్థమవుతుంది.

పైన ఉన్న రెండు ఇమేజెస్ లో కంటెంట్ ఒకటే…కానీ వాటి ప్లేస్ మెంట్ వేరు. అంటే మొదటిఫోటోలో ఆత్రేయ గారు ఎడమవైపు చూస్తుంటే అక్కినేని గారు కుడి వైపు చూస్తున్నారు. కింద ఫోటో లోనూ వారు వ్యతిరేక దిశలో చూస్తున్నప్పటికీ ఎక్కడో ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటన్న భావన కలుగుతుంది. పైన ఫోటోలో అలాంటి భావం కనిపించదు.మీకలా అనిపించిందా?

నాలాగే మీకు అనిపిస్తే ఎందుకు మీకలా అనిపించింది అని, ఒక వేళ అనిపించకపోతే ఎందుకు అనిపించలేదో అనీ అర్థం చేసుకోవాడానికి ప్రయత్నించాననుకోండి అప్ప్పుడు నేను semiotic study చేస్తున్నానన్నమాట. Semiotics is a way of explaining how we make meaning. ఇదే semiotic study ని సినిమాకి అప్ప్లై  చెయ్యడమే ఫిల్మ్ స్టడీస్ అనొచ్చని నా అభిప్రాయం.

రష్యా కి చెందిన కులెషోవ్ అనే మహానుభావుడు సినిమా అనే ప్రక్రియ ఆవిర్భవించిన తొలి రోజుల్లోనే ఇలాంటి ఒక ప్రయోగం చేసాడు. ఆ ప్రయోగం ఫిల్మ్ ఎడిటింగ్ లో ఎన్నో నూతన ప్రయోగాలకు దారి తీసింది. కులెషోవ్ ఎక్స్పెరిమెంట్ గురించి నవతరంగం పాఠకులకు తెలిసే ఉంటుంది. గతంలో కూడా చాలా సార్లు ఈ ప్రయోగం గురించి ప్రస్తావించడం జరిగింది.

తన మొహంలో ఎటువంటి ఫీలింగ్ లేని ఒక వ్యక్తి ఫోటోని వివిధ చిత్రాల తర్వాత ప్రొజెక్ట్ చేసినప్పుడు మొదట ప్రొజెక్ట్ చెయ్యబడ్డ చిత్రాన్ని బట్టి ప్రేక్షకులు ఆ వ్యక్తి మొహంలో లేని ఫీలింగ్ ని చూడగలుగుతారని ఈ ప్రయోగం యొక్క సారాంశం. కులెషోవ్ ప్రయోగానికి సంబంధించిన ఈ క్రింది చిత్రం ద్వారా ఆ ప్రయోగం యొక్క ఫలితాలను మీరే చూడవచ్చు.

ఇదే విషయాన్ని హిచ్ కాక్ కూడా తనదైన శైలి లో చెప్పుకొచ్చారు.

In a 1964 interview for the show Telescope, Alfred Hitchcock called this technique “pure cinematics – the assembly of film.” Sir Hitchcock says that if a close-up of a man smiling is cut with a shot of a woman playing with a baby, the man is portrayed as “kindly” and “sympathetic.” By the same token, if the same shot of the smiling man is cut with a girl in a bikini, the man is portrayed as “dirty.”

అయితే నవతరంగంలో వ్యాసాలు చదివే చాలా మంది సినిమాలు తీద్దామనుకునే ఔత్సాహికులే ఉన్నారు. ఈ semiotics, ఫిల్మ్ లాంగ్వేజ్, ఫిల్మ్ స్టడీస్ గోలంతా ఫిల్మ్ ని ఒక సబ్జెక్ట్ గా చదివే స్టూడెంట్స్ కోసం కదా సినిమా తియ్యాలనుకునే మాకు ఇదంతా ఎలా ఉపయోగపడుతుంది? అయినా ఈ కులషోవ్ ఎప్పుడూ చేసిన ప్రయోగానికి ఈ రోజుల్లో విలువెంత? లాంటి అనుమానాలు రావొచ్చు. అలాంటి ప్రశ్నలకు కూడా సమాధానాలున్నాయి.

ఎప్పుడో కులెషోవ్ చేసిన ప్రయోగం సంగతి పక్కన పెడదాం. ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ప్రయోగాలు చూద్దాం. ముందుగా డారెన్ ఆర్నోఫ్స్కీ అనే దర్శకుడు “పై” అనే సినిమాలో చేసిన ఒక ప్రయోగం గురించి చర్చించుకుందాం. “పై” సినిమాలో ఆర్నోఫ్స్కీ స్నోరీ క్యామ్ అనే ఒక ఎఫెక్ట్ ని సినిమా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత అదే టెక్నిక్ ని ఆయన “రెక్వియమ్ ఫర్ ఏ డ్రీం” అనే సినిమాలోనూ వాడారు. ఆ టెక్నిక్ ని మన దేశంలో మొదటి సారిగా “దేవ్ డి” అనే సినిమాలో అనురాగ్ కశ్యప్ వాడారు. ఆ తర్వాత రక్త చరిత్ర లోనూ ఇదే టెక్నిక్ వాడి కొన్ని షాట్స్ తీశారు. ఇక రాబోయే కాలంలో ఈ టెక్నిక్ చాలా సినిమాల్లోనే కనిపించే అవకాశం ఉంది.ఇంతకీ ఈ స్నోరీ క్యామ్ అంటే ఏంతో తెలుసుకోవాలంటే నవతరంగంలో ఇది వరకే వచ్చిన ఈ వ్యాసం చూడొచ్చు. అంత ఓపిక లేని వారికోసం:

స్నోరీక్యామ్ యొక్క ప్రత్యేకత: కెమెరా నటి/నటుడు శరీరానికి attach చెయ్యబడి ఉంటుంది కాబట్టి కెమెరా కి మరియు నటి/నటులకు మధ్య relative గా movement ఉండదు కాబట్టి నటి/నటుడు కదుల్తున్నప్పుడు కెమెరా దృష్టిలో వారు స్థిరంగానూ చుట్టుపక్కలంతా కదుల్తున్నట్టుగానూ కనిపించి ఒక వింత ఫీలింగ్ ని కలుగచేస్తుంది. ఈ టెక్నిక్ ఉపయోగించి గతంలో Mean Streets, Lock Stock and Two smoking Barrels లాంటి సినిమాలో కొన్ని సీన్లు చిత్రీకరించినప్పటికీ ఈ టెక్నిక్ ను పూర్తి స్థాయిలో effective గా ఉపయోగించుకుంది మాత్రం Requiem For a Dream అనే సినిమాలో.

స్నోరీ క్యామ్ గురించి తెలుసుకున్న దర్శకులు వెంటనే ఈ టెక్నిక్ ని ఉపయోగించేద్దామనుకుంటే అసలుకే మోసం రావొచ్చు. అసలు ఈ టెక్నిక్ ఉపయోగించడం ద్వార ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో ముందు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి అవసరానికొచ్చేదే ఫిల్మ్ స్టడీస్. ఏయే విషయాలకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలుసుకోకుండా టెక్నిక్ ఉంది కదా అని ఉపయోగించడం ద్వారా చాలా పొరపాట్లే జరుగుతాయి. ఉదాహరణకు హిచ్ కాక్ తన సినిమాలో “వెర్టిగో” ద్వారా ఒక కొత్త టెక్నిక్ ని సినిమా ప్రపంచానికి తెలియచేశారు.వెర్టిగో షాట్ నే ట్రాక్ ఇన్ జూమ్ ఔట్ అని కూడా అంటారు.

ఈ టెక్నిక్ లో కెమెరా ట్రాక్ మీద ముందుకు కదుల్తుండగా కెమెరా లోనీ లెన్స్ మాత్రం జూమ్ ఔట్ అవుతుంటుంది. అంటే మనం తెరమీద చిత్రానికి దగ్గరవుతూనే దూరంగా జరుగుతామన్నమాట. ఈ టెక్నిక్ ద్వారా ఒక చిత్రమైన ఫీలింగ్ ని ప్రేక్షకుల్లో కలుగచెయ్యవచ్చు. ఈ ట్రాక్ ఇన్ జూమ్ ఔట్ లేదా వెర్టిగో షాట్ అనేది సినిమాకి బ్రహ్మాస్త్రం లాంటిది. ఏదో ఒక పాత్రని మాత్రమే ఇలాంటి టెక్నిక్ ద్వారా చిత్రీకరించడమో లేదా ఒక అవ్యక్తమైన అనుభూతి పాత్రకు కలిగినప్పుడు మాత్రమే ఈ టెక్నిక్ ఉపయోగిస్తే బావుంటుంది. కానీ బాణం సినిమాలో లాగా ఈ టెక్నిక్ ని ఇష్టమొచ్చినట్టు ఉపయోగిస్తే అసలుకే మోసం వస్తుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలు చెప్పొచ్చు. కానీ చెప్పాలనుకున్న ముఖ్య విషయం ఏంటంటే ఫిల్మ్ స్టడీస్ అనేది కేవలం ఫిల్మ్ స్టూడెంట్స్ కే కాదు ఫిల్మ్ మేకర్స్ కి కూడా అవసరమే!

ఫిల్మ్ మేకర్స్ మరియు ఫిల్మ్ స్టూడెంట్స్ సంగతి సరే కేవలం వినోదం కోసం సినిమా చూడాలనుకునే సాధారణ ప్రేక్షకుల సంగతేంటి?

సాధారణ ప్రేక్షకులకి సైతం ఫిల్మ్ స్టడీస్ పై ఎంతో కొంత అవగాహన అవసరం. ఈ అవగాహన వల్ల ప్రేక్షకుల సినిమాటికి ఎక్స్పీరియన్స్ మరింత అధికమవుతుంది.ఇప్పటి వరకూ అన్నింటికీ ఒక్కో ఉదాహరణ ఇచ్చుకుంటూ వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా ఒక ఉదాహణతో వివరిస్తాను.

మీలో చాలా మంది “ఫైట్ క్లబ్” అనే ఒక ఇంగ్లీష్ సినిమా చూసే ఉంటారు. ఈ సినిమాకొక ప్రత్యేకత ఉంది. ఇందులో దర్శకుడు మనకి తెలియకుండానే మనల్ని ఆవేశానికి గురిచేస్తాడు. అలా చెయ్యడానికి దర్శకుడు subliminal images ని మన మీద ప్రయోగిస్తాడు. అది ఎలా చేశాడో తెలుసుకోవాలంటే ముందు ఈ సబ్లిమినల్ స్టిములై అంటే ఏంటో తెలుసుకోవాలి.

Subliminal stimuli or “above threshold”, are any sensory stimuli below an individual’s absolute threshold for conscious perception. Visual stimuli may be quickly flashed before an individual may process them, or flashed and then masked, thereby interrupting the processing.

“ఫైట్ క్లబ్” సినిమాలో దర్శకుడు/ఎడిటర్ ఏం చేశాడంటే సినిమాలో అక్కడక్కడా కొన్ని సీన్స్ లో కొన్ని ఫ్రేమ్స్ ని చొప్పించాడు. అంటే సెకను కి 24 ఫ్రేములు ఉంటే అందులో ఏదో ఒక ఫ్రేము లో ఆ సీన్ కి సంబంధం లేని ఒక చిత్రాన్ని చొప్పించాడన్న మాట. ఈ ఇమేజ్ ని మన కళ్ళు చూడగలవు. కానీ అది ఎంత వేగంగా జరిగిపోతుందంటే అది మనం గ్రహించేలోగా మాయమైపోతుంది. దీని వల్ల మనలో తెలియని ఒక డిస్ట్రబెన్స్ కలుగుతుంది. ఈ సినిమా కి మూలం ఫైట్ క్లబ్ అనే నవల. అందులో ఒక క్యారెక్టర్ సినిమా థియేటర్లో ప్రొజెక్షనిస్ట్ గా పనిచేస్తుంటాడు. అతడు సరదాగా ఫిల్మ్ రీల్ లో అక్కడక్కడా కొన్ని ఇమేజెస్ కట్ చేసి పోర్నోగ్రాఫిక్ ఇమేజెస్ పెడుతుంటాడని చెప్తాడు. అయితే ఈ పుస్తకం సినిమాగా తీసినప్పుడు ఆ ప్రొజక్షనిస్ట్ థియేటర్లో చేసే ఎక్స్పెరిమెంట్ దర్శకుడు సినిమాలో డైరెక్ట్ గా మనమీదే ప్రయోగించాడన్న మాట.

ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టి మీరు మరో సారు ఫైట్ క్లబ్ చూసి ఎక్కడ ఈ సబ్లిమినల్ స్టిములై ఉపయోగించారో తెలుసుకోగలిగితే అప్పుడు మీకు కలిగే థ్రిల్ వేరు. కాదంటారా?

కాకపోతే ముందు జాగ్రత్త గా ఒక విషయం చెప్పాలి. ఈ సినిమాలో వాడిన ఇమేజెస్ కొన్ని పోర్నోగ్రాఫిక్ ఇమేజరీ కాబట్టి కాస్తా జాగ్రత్త. మళ్ళీ మమ్మల్ని తిట్టుకోకూడదని ఈ ముందు జాగ్రత్త చర్య.

ఈ విధంగా ఫిల్మ్ స్టడీస్ గురించి అవగాహన ఉండడం ద్వారా సాధారణ ప్రేక్షకులకి సైతం సినిమా చూడడమనే అనుభవం enrich అవడమే కాకుండా enhance అవుతుంది.

కాబట్టి అందరికీ ఎంతో కొంత ఫిల్మ్ స్టడీస్ అవసరమే అని తీర్మానించబడినది.

…..with that I rest my case, your Honor!!!!

8 Comments
  1. k.rathnakar May 31, 2011 /
  2. visu May 31, 2011 /
  3. రమణ మూర్తి June 2, 2011 /
  4. narayanaswamy June 3, 2011 /
  5. రమణ మూర్తి June 3, 2011 /
  6. Sripal Sama June 5, 2011 /
  7. ramesh June 5, 2011 /
  8. srikanth June 9, 2011 /