నివాళి: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు

ప్రముఖ సాహితీవేత్త, శాస్త్రజ్ఞుడు, సంగీతజ్ఞుడు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి మృతికి నవతరంగం ఘనంగా నివాళి ప్రకటిస్తోంది. రోహిణీ ప్రసాద్ గారు సినిమారంగానికి చెందినవారు కాకపోయినా, నవతరంగం పాఠకులుగా, శ్రేయోభిలాషిగా మాకు ఆప్తులు, ఆదరణియులు. వారి తండ్రిగారైన కీ.శే. కొడవటిగంటి కుటుంబరావుగారి సినిమా వ్యాసాలు నవతరంగంలో ప్రచురించేందుకు అనుమతించారు. తరచూ మెయిల్ చేస్తూ నవతరంగం సేవని కొనియాడారు. నవతరంగం వారి అభినందనల స్పూర్తితో ముందుకు సాగగలదని తలుస్తూ, వారికి ఆత్మ శాంతికి ప్రార్థిస్తున్నాము.