టోనీ స్కాట్ – నివాళి

Tony_Scott

హాలీవుడ్ సినిమాలు చూసే వారెవరికైనా టోనీ స్కాట్ పేరు పరిచయం ఉండే ఉంటుంది. Top Gun, True Romance, Man on Fire, Deja Vu, Unstoppable లాంటి సూపర్ హిట్ సినిమాల కు దర్శత్వం వహించిన టోనీ స్కాట్, మరో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు Ridley Scott కి సోదరుడు.

The Hunger సినిమాతో 1987 లో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి , Tom Cruise నటించిన Top Gun సినిమాతో హాలీవుడ్ లో పెద్ద దర్శకుల సరసన చేరారు. దాదాపు పాతికేళ్ల పాటు 15 కి పైగా సినిమాలు రూపొందించిన టోనీ స్కాట్, కొన్ని లఘు చిత్రాలు, టెలివిజన్ సీరీస్ లతో పాటు కమర్షియల్స్, మ్యూజిక్ వీడియోస్ కూడా చిత్రీకరించారు.

పాతికేళ్ల సినిమా ప్రయాణంలో టోనీ స్కాట్ ఒక్క ఆస్కార్ నామినేషన్ కూడా పొందకపోయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి కల దర్శకుడిగా అందరి మన్ననలూ పొందాడు.

1944 జూన్ 21 న ఇంగ్లాండ్ లో జన్మించిన టోనీ స్కాట్, 68 ఏళ్ల వయసులో ఆగష్టు 19 న అమెరికాలో ఒక బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

టోనీ స్కాట్ మరణానికి నవతరంగం నీరాజనాలు అర్పిస్తోంది.

Click to comment

Leave a Reply

Subscribe to Navatarangam via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other subscribers

Copyright © 2015 నవతరంగం. Love For Cinema, powered by Venkat Siddareddy.

To Top
Menu Title