Menu

శ్రీ మామూలు నారాయణ (శ్రీ మన్నారాయణ )

అర్జంట్ గా సినిమాకథ కావాలంటే ఏం చెయ్యాలి? ఏదైనా పాత సినిమాని తీసుకొని రీసైకీలింగ్ చేసి కొత్తగా ప్యాక్ చేసి ప్రేక్షకులను చూపిస్తే చాలు. అందులో స్టార్ హీరో వుంటే, అతన్ని చూపించి వారం రోజుల్లో కోట్లు కలెక్షన్ చూడోచ్చన్నది. సినిమా వాళ్ళ దురాలోచన.

 

ఆలోచన ఎలాంటిదైనా తీయబోయే సినిమాలు పాత కథయిన కొంచెం సరికొత్తగా చెప్పాలన్న స్పృహ వుంటే ప్రేక్షకులు కూడా ఆసక్తి గా చూస్తారు. అలా కాకుంటే అది శ్రీమన్నారాయణ సినిమా లాగా తయారవుతుంది.

 

ఎప్పుడో ఎనబై దశకంలో వచ్చిన పగ, ప్రతీకారం అన్న టైపు సినిమా కథను పట్టుకొని, ఇద్దరు హీరోయిన్లను, కలర్ ఫుల్ పాటలు, స్టెప్పులు పెట్టి అందమైన లొకేషన్ లు భారీబడ్జెట్, ఆరుగురు విలన్ లలో సినిమా కాస్త రీచ్ గా తీసేసారు. కథ మాత్రం పాత చింతకాయ పచ్చడి. పాత సీసాలో పాత సార పోసి కొత్తది అని చెప్పాలని విశ్వప్రయత్నం చేసిన సినిమా.

 

సినిమా కథ విషయానికి వస్తే హీరో బాలకృష్ణ ఒక పెద్ద మీడియా లో డేరింగ్, డాషింగ్ జర్నలిస్ట్. అన్యాయాలను, అక్రమాలను పరిశోధించి, ప్రయత్నించి వెలికి తీసి ప్రజలను చైతన్యవంతులుగా చేసి, దోషులకు శిక్ష పడేటట్లుగా చేస్తుంటాడు. అలా ఒక విలన్ మంత్రి, అతని బావమరిది సైనికుల ఇళ్ళ స్థలాన్ని ఆక్రమించుకొని పెద్ద అపార్ట్ మెంట్ లు కట్టించుంతారు. ఈ అన్యాయాన్ని వెలికి తీసి మంత్రి గారిని పదవి నుంచి వుడదీయించుతాడు హీరో.

 

హీరో తండ్రి రైతే రాజు అని నమ్మిన వ్యక్తీ .రైతుల సమస్యలు తీర్చాలని సుమారు ఐదు వేలకోట్ల రూపాయలు అందరివద్దనుంచి సమకూర్చి ఒక నిధిలాగా ఏర్పాటు చేస్తాడు. ఆ నిధిని కొట్టేయాలని ఆరుగురు విలన్ లు కుట్ర చేసి హీరో తండ్రిని చంపి, డబ్బుని తీసుకొని హీరోనే కొట్టేసి దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని నమ్మించి అరెస్టు చేయిస్తారు.

 

హీరో జైల్లో నుండి తండ్రి హత్యకు కారకులైన వారెవరో తెలుసుకొని జైల్లోంచి వివిధ గెటప్ లలో వచ్చి మొదట ముగ్గురిని, జైల్ నుంచి వచ్చి మరో ముగ్గురిని చంపి రైతుల సొమ్ము ను రైతులకు అందేటట్లు చేస్తాడు. అదీ స్థూలంగా కథ

బాలకృష్ణ మీడియా జర్నలిస్ట్ గా ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయింది. అభిమానులను అలరించే విధంగా వుంది. హీరో మీడియా జర్నలిస్ట్ కాబట్టి సినిమా అంతా మీడియా జర్నలిజం మీద వుంటుందని భావిస్తారు. అలా తీసి వుంటే నిజంగా కొత్తగా బావుండేది. కాని హీరో వృత్తి అది అని మాత్రమే చూపించి, మిగతాదంతా తండ్రి ఆశయ సాధన కోసం చేసే ప్రయత్నంగా నడిపించారు కథను. దాంతో కథ, కథనం పాతదైపోయింది. ప్రేక్షకులు ఆసక్తిని కోల్పోతారు.

 

ఇక బాలకృష్ణ వేసిన వివిధ గెటప్ ప్రేక్షకులకు మంచి వినోదం. అలా గెటప్ లలో వచ్చి బాలకృష్ణ విలన్ లను చంపడం నవ్వు పుట్టిస్తుంది. బాలకృష్ణ గారికి వయసు మీదపడిందన్న విషయం స్పష్టంగా కనపడుతుంది. డాన్స్ చెయ్యడంలో ఆయన చాలా కష్టపడుతున్నాడు.

 

ఇద్దరు హీరోయిన్ లు ఓ.కె. సంగీతం, పాటలు బావున్నాయి. ఫోటోగ్రాఫీ రిచ్ గా వుంది. ఆరుగు విలన్ లు విలనీజం పండించారు. MS, కృష్ణ భగవాన్ లవి వేస్ట్ పాత్రలు .వాళ్ళను సరిగా వాడుకోలేకపోయారు.

దర్శకుడు రవి చావలి కథను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించి వుంటే బావుండేది. బాలకృష్ణ మళ్ళి నిరాశ ఎదురుకాబోతుంది. ఆయన కథల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.

– రవికిరణ్

3 Comments
  1. Kriti September 3, 2012 /
  2. ADI November 30, 2012 /
  3. RAJA December 21, 2012 /