Menu

Monthly Archive:: August 2012

తిరువిళయాడల్

“తిరువిళయాడల్” అంటే భగవంతుని ఆటలు అని అర్థం. “తిరువిళయాడల్ పురాణం” తమిళ శైవ వాఙ్మయంలో ఒక భాగం. అందులోని అరవై నాలుగు కథల్లోంచి ఎంచిన నాలుగు కథలు కలిస్తే ఈ సినిమా. నలుపు-తెలుపుల తెలుగు సినిమాల్లో “నవరాత్రి” సినిమా నాకెందుకో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆ సినిమా తమిళ మాతృక తీసిన ఏ.పి.నాగరాజన్ ఈ తిరువిళయాడల్ కి కూడా దర్శకుడు. అదే ఏకైక కారణం ఈ సినిమా చూడ్డానికి. ఎందుకో గానీ నాకు ఈ సినిమా విపరీతంగా నచ్చింది.

సినిమాటోగ్రాఫ‌ర్ అశోక్ మెహ‌తా-నివాళి

బాండిట్‌ క్వీన్‌, ఉత్సవ్‌, మండి, త్రికాల్‌, రామ్‌ లఖన్‌, ఖల్‌నాయక్‌,గజగామిని, చల్తే చల్తే తదితర చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ మెహతా గత వారం ముంబై లో మరణించారు. శేఖర్ కపూర్, అపర్ణా సేన్, శశి కపూర్, సుభాష్ ఘాయ్, శ్యాం బెనగల్ లాంటి గొప్ప దర్శకుల సినిమాలకు సినిమాటోగ్రఫీ వహించి ఎప్ప‌టిక‌పుడు త‌న ప్ర‌త్యేక‌త‌ను చూపుతూ దేశంలో అత్యంత ప్ర‌తిభావంతులైన సినిమాటోగ్రాఫ‌ర్‌ల‌లో ఒక‌రుగా నిలిచారు. రెండు సార్లు జాతీయ అవార్డులతో పాటు ఎన్నో

ప్రపంచ చలన చిత్ర చరిత్ర 15: త్వరలో విడుదల

కదిలే బొమ్మల్ని చూడాలనుకున్న మనిషి కోరిక ఫోటోలతో మొదలై, క్రమంగా సెల్యులాయిడ్ పైన ఎక్కి మాటలు నేర్చి, రంగులు అద్దుకోని, బ్లాక్ బస్టర్ సినిమాగా, ఆర్ట్ సినిమాగా, సమాంతర సినిమాగా రకరకాలు రూపాంతరాలు చెందుతూ వచ్చిన సినిమా తరువాత ఏ కొత్త పుంతలు తొక్కబోతోంది? ఒకప్పుడు నాటకాలు, బొమ్మలాటలు, సంగీత కచేరిలు (ఒపెరాలు) వంటి వినోధసాధనాలకు అదనంగా వచ్చిన చేరిన సినిమా, అలాంటి కళలనే మింగేసిందనే అపప్రధ కూడా మూటకట్టుకుంది. అయినా ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరించారు.

తొక్కవలన “దేవుడు చేసిన మనుషులు”

  కథలేని కథని మడతకాజాలాగా మడతెట్టి రెండుసార్లు చుట్టేసి, నవ్వించే కామెడీ క్యారెక్టర్లతో,అడ్రస్ లేని అనాధలనే సెంటిమెంటుతో కట్టె-కొట్టె-తెచ్చె అన్నట్టు శ్రీమహావిష్ణువుతోనే చెప్పించేసిన పూరీజగన్నాథ్ మాయా చిత్రం ‘దేవుడు చేసిన మనుషులు’. దైవనిర్ణయంగా కలిసి బ్రతకడానికే పుట్టిన అనాధలైన ఒక థాయ్ లాండ్ అమ్మాయి (ఇలియానా)-ఒక హైదరాబాద్ అబ్బాయి (రవితేజ) ఒక “తొక్కలో” ఇంటర్వెషన్ వల్ల ఎలా కలిసారు అనేదే ఈ తొక్కలో సినిమా మూలబిందువు. రెండుసార్లు తొక్క తొక్క అనేసానని ఇది తొక్కలో సినిమా అనుకోకండి.

మణిరత్నం హ్యాంగోవర్ తో “అందాల రాక్షసి”

  మౌనరాగం-గీతాంజలి-ప్రేమిస్తే సినిమాలు చూశారా! బహుశా మొదటి రెండూ ఈ తరంవాళ్ళు చూసుండరు. అందుకే వీటిని కలగలిపి ఈ తరంవాళ్ళ కోసం కొత్తప్యాకేజిలో కాకుండా అవే సినిమాల్ని అదే పాత ప్యాకేజిలో కొత్త నటీనటులతో తీసిన అందమైన రాకాసి (బడ్జెట్) సినిమా “అందాల రాక్షసి”. సినిమా కథాకాలంకూడా 1991-92 కాబట్టి బహుశా ఆ కాలపు భావావేశాల్ని పండించడానికి తీసిన ఒక మిథికల్ లవ్ స్టోరీగా చెప్పుకోవచ్చు. గౌతమ్ (రాహుల్ రవీంద్రన్) డబ్బున్న కుర్రాడు. మిథున(లావణ్య) అనే అమ్మాయిని