ప్రయోగం సమాప్తం: Chris Marker ఇక లేరు

CrisMarkerStaringBack

చలన చిత్రాలను నిశ్చలం చేసినా (La Jetee), కవిత్వాన్ని, చిత్రాలను, శబ్దాలనూ, మాటలను కలగలిపి సమకాలీన రాజకీయ, తాత్విక చర్చలు చేసినా (New Documentary), నడుస్తున్న జీవితాన్ని చరిత్రగా మారే విధానాన్ని డాక్యుమెంట్ చేసినా (“life in the process of becoming history), సినిమా వ్యాసమనే నూతన ప్రక్రియ (Essay Film) కు శ్రీకారం చుట్టినా అది Chris Marker ఒక్కరికే చెల్లింది.

Chris Marker జనాలకు అంతగా తెలియకపోవడానికి కారణాలనేకం. ఆయన సినిమాలు చాలా ప్రత్యేకమైనవి.

Film theorist Roy Armes మాటల్లో చెప్పాలంటే

“Marker is unclassifiable because he is unique…The French Cinema has its dramatists and its poets, its technicians, and its autobiographers, but only has one true essayist: Chris Marker.”

సినిమా చరిత్రలో ఎవరో కొద్ది మంది మాత్రమే నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అలాంటిది Chris Marker తన ప్రతి సినిమాతో ఒక నూతన ఒరవడిని సృష్టించారు. ఉదాహరణకు La Jetee. పూర్తిగా స్టిల్ ఇమేజెస్ తో చేసిన ఈ 28 నిమిషాల నిడివి గల సినిమా నేటికీ సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ తో తీసిన సినిమాల్లో ఉత్తమ సినిమాగా నిలుస్తుంది.

La jetée is a 1962 French science fiction featurette by Chris Marker. It is also known in English as The Jetty or The Pier. Constructed almost entirely from still photos, it tells the story of a post-nuclear war experiment in time travel. The film runs for 28 minutes and is in black and white.

అలాగే ఈయన రూపొందించిన మరో గొప్ప చిత్రం Sans Soliel. ఆయన రూపొందించిన చిత్రాల్లో మాస్టర్ పీస్ అని చెప్పుకోదగ్గ చిత్రం ఇది. ఆయన రూపొందించిన మిగతా చిత్రాల్లగే ఈ సినిమా కూడా ప్రత్యేకమైనది.

“Sans Soleil” (1982), often acknowledged as the masterpiece among Mr. Marker’s late works, is one of his least classifiable, a free-associative mix of ethnography, philosophy and poetry. Purporting to be the footage of a fictional cinematographer accompanied by his letters to a nameless woman, the film roams from Iceland to Guinea-Bissau to Japan, a favorite destination of Mr. Marker

వేటికవే ప్రత్యేకమైన సినిమాల ద్వారానే కాకుండా, cahiers du cinema పత్రిక లో Chris Marker రాసిన సినిమా వ్యాసాలతో అప్పటి ఫ్రెంచ్ సినిమా దర్శకులకు ఎంతో ప్రేరణ కలుగచేశారు. ఆ తర్వాత ‘New Wave’ సినిమాగా ఎదిగిన ఫ్రెంచ్ నవతరంగం సినిమాల అలలకు Chris Marker తో పాటు Agnes Varda, Alain Resnais, Alain Cavalier, Louis Malle లాంటి దర్శకులు శక్తినిచ్చారు.

రచయితగా, ఫిల్మ్ క్రిటిక్ గా, ప్రయోగాత్మక చిత్ర నిర్మాత గా Chris Marker తన ప్రతిభను చాటుకున్నప్పటికీ, 1955-1966 ల మధ్య ఆయన రూపొందించిన లెఫ్ట్ వింగ్ డాక్యుమెంటరీస్ ద్వారానే ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఈ కాలంలో ఆయన రూపొందించిన డాక్యుమెంటరీల గురించి చెప్తూ, ప్రముఖ ఫ్రెంచ్ రచయిత Henri Michaux, ప్యారిస్ లోని సోబోర్న్ యూనివర్శిటీని కూల్చివేసి దాని స్థానంలో Chris Marker ని ఉంచాలని అన్నారు.

యాభై కి పైగా చలన చిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించిన Chris Marker 1997 లో రూపొందించిన Immemory అనే ఒక మల్టిమీడియా ప్రెజెంటేషన్ ఆయన రూపొందించిన అత్యుత్తమ డాక్యుమెంట్ అని చెప్పుకోవచ్చు.

In Immemory, Chris Marker has used the format of the CD-Rom to create a multi-layered, multimedia memoir. The reader investigates “zones” of travel, war, cinema, and poetry, navigating through photographs, film clips, music, and text, as if physically exploring Marker’s memory itself. The result is a veritable 21st-century Remembrance of Things Past, an exploration of the state of memory in our digital era. With it, Marker has both invented a literary form and perfected it.

దాదాపుగా అరవై ఏళ్ల పాటు చలనచిత్ర పరిశ్రమకు సేవ చేసి జులై 30 వ తేది నాడు, 91 ఏళ్ల వయసులో తన జనస్థలమైన ప్యారిస్ లో మరణించారు. చలనచిత్ర చరిత్రలో ఒక ప్రయోగం సమాప్తమైంది.

1 Comment

1 Comment

  1. Varun

    August 15, 2012 at 5:43 pm

    La Jatee is not made entirely with still photos,there is one scene where a woman can be seen blinking her eye.

Leave a Reply

Subscribe to Navatarangam via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other subscribers

Copyright © 2015 నవతరంగం. Love For Cinema, powered by Venkat Siddareddy.

To Top
Menu Title