Menu

మిథునాంజలి

ఓ శుభ ముహూర్తానా నేను నా టీనేజిలో దూరదర్షన్ లో “శివ” “గీతాంజలి” అనే సినిమాలను ఒకే సంవత్సరంలో చూడడం జరిగింది. “శివ” నన్ను సంభ్రమాశ్చార్యాలకి గురి చేస్తే, గీతాంజలి జీవితం పట్ల కూతుహలంతో కూడిన ఆసక్తిని రెకెత్తించింది. బ్రతికితే ఇలాంటి ఆహ్లదకర వాతవరణంలో జీవితాన్ని అనుభవించి బతకాలని అనుకునేవాణ్ని ఆ రోజుల్లో. ఇప్పటికి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అనుకుంటూనే ఉంటాను. ఎందుకంటే జీవితంలో కౌమారంలో ఉన్న ప్రశాంతత యుక్త వయస్సులో ఉండదు కనుకా, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రెండు రోజుల క్రితం “మిథునాంజలి” సారీ “అందాల రాక్షసి” అనే సినిమాని చూడడం జరిగింది. రాక్షసిని చూడక ముందు “గీతాంజలి” సినిమాని థియేటర్ లో చూడలేదన్నా బాధ ఉండేది. ఆ బాధ దీనితో పోయింది. ఇప్పటి వరకు రెండు సార్లు చూశాను. ముచ్చటగా మూడోసారి చూసి డివిడి విడుదలయ్యాక కొనేసుకుందామనుకుంటున్నాను. నాకంతగా నచ్చింది మరీ.

మణిరత్నం గీతాంజలిలో ఎక్కడా చూసినా దట్టమైన పొగమంచు, గజగజ వణికించే చలి ఒంటినిండా కాశ్మీరి శాలువా కప్పుకొని “ఆమని పాడవే కోయిలా” అంటు హీరో నాగర్జున పాడుతూ చెట్లు, పుట్టలు పట్టుకు తిరుగుతూ ఉంటే హీరోయిని గిరీజ కొంటే కోనాంగిలా తన అనుచర గనంతో హీరోని వెంబడించే దృశ్యం ఇప్పటికి చాలమంది సిని ప్రియులకి గుర్తుండే ఉంటుంది… ఉండోచ్చు, ఎందుకంటే “ఏంట్రా సడన్ గా ఈ మగాళ్లందరికి ధైర్యం వచ్చిందని అనుకున్నాను”. “ఏయ్ లేచిపోదామన్నా మగాడా రా బయటికి రా” అంటు గీతాంజలి చెక్క బ్రిడ్జి పైనుండి అరిచే అరుపులు ఇంకా సినీ ప్రియుల హృదయాలలో మారుమ్రోగుతూనే ఉంటాయి. అలాంటి సినీ ప్రియుల్లో ఒక్కడు ఈ చిత్ర దర్శకుడు హను రాఝవపుడి.

ప్రపంచం పట్ల ఆసక్తి, కూతుహలం, కోరిక, ఆశ ఇవన్నీ టీనేజి వయస్సులో కలిగే భావనలు. ఎందుకంటే టీనేజిలో వాస్తవ ప్రపంచం కనిపించదు. ఉహా ప్రపంచం మాత్రమే ఉంటుంది. అప్పుడు మనసుని బలంగా ఆకర్షించేవే మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి. అందరి గురించి నాకు తెలియదు గానీ నాకు మాత్రం పైన పెర్కోన్న భావనలే నా టీనేజిలో కలిగాయి. ఈ కథ కాలం 1991 – 1992 నా టీనేజి కాలం కూడ అదే. కథని ఇరవై ఏళ్లు వెనక్కి ఎందుకు తీసుకెళ్లాడో చాలా మందికి అర్ధం కాలేదు. నాకు తెలిసి  1991 – 1992 మధ్య కాలంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెర్రి మిడియా కానీ, సెల్ పోన్ సొల్లు కానీ, ఇంటర్నెట్ రోధ కానీ, పాశ్చాత్యా పోకడ కానీ ఏమి లేవు. పురుష లక్షణాలు కలిగిన పురుషోత్తములు, వ్యక్తిత్వానికి సరైనా అర్ధం చెప్పగల్గిన అమ్మాయిలు, యండమూరి నవలలు, సంవత్సరం ఆడే సినిమాలు, మనసుని తేలికపరిచే స్నేహితుల ఉత్తరాలు, అమ్మమ్మ చేత్తో చేసే ఆవకాయ, పల్లే వెలుగు, పట్టణ సొగసు ఆ రోజుల్లో స్వచ్చంగా ఉండేవి. ఆ స్వచ్చతను హను రాఝవపుడి అనుభవించి ఉంటాడు కాబోలు. అందుకే కథ కాలం  1991 – 1992 లోకి తీసుకెళ్లి ఉంటాడని నా ఉహా, బహుష అదే నిజం అయి ఉండోచ్చు.

ఈ కథ విషయానికి వస్తే గౌతమ్ (రాహూల్) ఓ వ్యాపార వెత్త కొడుకు కానీ సాదారణ జీవితం గడపాలని అతని కోరిక తండ్రి కోడుకుల మధ్య ఎప్పుడు దీని గురించే గొడవ. మొదటి చూపులోనే మిథున (లావణ్య) ని ప్రేమిస్తాడు. తన లోకంలోనే విహరిస్తు దేవతని చేస్తాడు. ఆ దేవతకి యాక్సిడెంట్ అవుతుంది. మిథునని ప్రేమిస్తున్న విషయం తెలిసిన గౌతమ్ తండ్రి మిథున తండ్రి ఆపరేషన్ కి అయ్యే ఖర్చుని భరించి, తన కొడుక్కి మిథునని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇరువురికి పెళ్లి జరుగుతుంది. కానీ, ఆమె తనువు మాత్రమే తనతో ఏడడుగులు నడిచిందని, మనసు మరొకరి దగ్గరే ఉందని తెలుసుకుంటాడు గౌతమ్. అప్పటికే సూర్య (నవీన్ చంద్ర) వ్యక్తి ప్రేమలో పడిందని, అతడు యాక్సిడెంట్ లో చనిపోవడం వలన తనతో పెళ్లికి ఒప్పుకుందని, తెలుసుకుని ఆమె మనసు తనని కోరుకున్నప్పుడే ముట్టుకుంటానని మిథునతో అంటాడు గౌతమ్.

కొంతకాలం తరువాత మిథున మనసులో గౌతమ్ ప్రవేశిస్తుండగా సూర్య బ్రతికే ఉన్నడని తెలుస్తుంది. ఆ పరిస్ధితుల్లో సూర్యని ఇష్టపడుతున్న మిథునని అప్పగించడానికి సిద్దపడతాడు గౌతమ్. సూర్య బతికున్నంత కాలం తన కొడుకు సుఖంగా ఉండలేడన్నా బెంగతో గౌతమ్ తండ్రి సూర్యని హత్య చేయించడానికి పథక రచన చేస్తాడు. ఆ ఫథకంలో సూర్యకి బదులుగా గౌతమ్ మరణిస్తాడు. గౌతమ్ ని మరిచిపోలేని మిథున తనని మరిచిపోయాకే నిన్ను కలుస్తానని సూర్యతో చెప్పడంతో, కథ మళ్లీ మొదటికి వస్తుంది.

ప్రేక్షకులు కథని అర్ధం చేసుకోవడానికి తిప్పలు పడే విధంగా స్టోరి నెరెషన్ చేశాడు దర్శకుడు. కథ చెప్పే విదానాన్ని పక్కన పెడితే బావుకత ఉట్టిపడే డైలాగ్స్, అధ్బుత పోటోగ్రఫి, లెన్తీ షాట్స్, ఎక్స్ ట్రీమ్ క్లోజప్ షాట్స్, చిత్రీకరణ మన మనసును రెండు గంటలు కట్టి పడేస్తాయి. తొంబైవ దశకం నాటి కార్లు, ఇళ్లు, ల్యాండ్ లైన్ పోన్లు, యస్ టిడి బూత్ లు, హొర్డింగులు, మహబారత్ హింది సిరియల్, ఉదయం పేపర్ ఈ జాగ్రత్తలన్నీ ఇరవై ఏళ్ల క్రితం నాటి పరిస్ధితులను కళ్లకి కట్టాయి. అక్కడక్కడ కొన్ని చోట్లా ట్రాఫిక్ లో నేటి వాతవరణం “పిల్ల జమిందార్” హొర్డింగ్ కనిపించే సరికి కాస్త చిరాకు వేస్తుంది. ఈ పొరపాట్లని సినిమా బిగినింగ్ లో ముందే చెప్పేశారు. కానీ, ఆ జాగ్రత్త కూడ తీసుకుంటే అధ్భుత దృశ్యకావ్యం అయ్యేది. ఈ తరహ టేకింగ్ ని నేను తెలుగులో చూడడం ఇదే మొదటిసారి. గతంలో నేను హాలివుడ్ దర్శకుడు సెర్గిలియోన్ “ద గుడ్ ద బ్యాడ్ ద అగ్లి”, బాలివుడ్ దర్శకులు “అనురాగ్ కాశ్యప్” “దిబాకర్ బెనర్జీ” కోలివుడ్ దర్శకులు “గౌతమ్ వాసుదేవ్ మీనన్” “శ్రీరామ్ రాఝవన్” సినిమాల్లో చూశాను.  కానీ, టాలివుడ్ లో ఒక తెలుగు సినిమాలో చూడడంతో నాకు చాలా గర్వంగా అనిపించింది. హను రాఝవపుడికి తెలుగులో ఒక అగ్ర దర్శకుడిగా నిలబడే అవకాశం ఉంది.

ఈ సినిమాలో విషిష్టత ఏమిటంటే టెక్నిషియన్స్, ఆర్టిస్ట్స్, నిర్మాత, దర్శకుడు అందరూ కొత్తవారే. దర్శకుడి ప్రతిభ, ఆర్ట్ డైరెక్టర్ నైపుణ్యం, కెమెరామెన్ పనితనం, హీరోలా పెర్పామెన్స్, హీరోయిన్ నటన అన్నీ కొట్టోచ్చినట్లు కనిపిస్తాయి. సినిమా బడ్జెట్ ఆరున్నర కోట్లు అయ్యిందని విన్నాను. ఇది కొరుకుడు పడని అంశం. కథ విషయంలో అంతా భావుకత్వాన్ని, నవ్యతని ప్రదర్షించిన తెలుగు దర్శకుడు తమిళ డైరెక్టర్లలా ట్రాజెడీ చేయడం బాగలేదు. ఇంతకన్న గొప్పగా తీసినా గీతాంజలిలో సినిమా మొదట్లోనే హీరో, హీరోయిన్ ఇద్దరికి క్యాన్సర్ ఉన్నదని చెప్పి, క్లైమాక్స్ లో వాళ్లని చంపకుండా ఎంతకాలం బతుకుతారో తెలియదు కానీ, బతికినంత కాలం హాయిగా బతుకుతారని చెబుతాడు ఆ చిత్ర దర్శకుడు మణిరత్నం. అందుకే ఆ సినిమా క్లాసిక్ అయ్యింది. దర్శకుడు మణిరత్నం భారతీయ దర్శకుల్లో మణి  “రత్నం” అయ్యాడు.

కొసమెరుపు : సినీ భావకులకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది. సగటు ప్రేక్షకుడికి నచ్చదు. పెట్టిన పెట్టుబడిలో రూపాయి వెనక్కి తిరిగి రావడం చాలా చాలా కష్టం.

 వర్ధమాన దర్శక రచయిత

                                                                                   బొమ్మ వేణుగౌడ్

                                                                                   venugoud18@gmail.com

                                                                                9032866063.

  

6 Comments
  1. sharma August 23, 2012 /
  2. Krishna August 24, 2012 /
  3. టి.యస్.కళాధర్ శర్మ December 29, 2012 /
  4. jagan January 24, 2013 /