“విక్రమార్కుడి”ని జింతాత్త చేస్తే “రౌడీ రాథోడ్”

RR_NT

“జింత అంటే విక్రమార్కుడు… చితా అంటే తెలుగు సినిమా… జింతాత్తథా అంటే పచ్చడి పచ్చడి చెయ్యడం” ఇదీ రౌడీ రాథోడ్ సినిమా. దబాంగ్ సినిమా తరువాత హిందీ సినిమాకి దక్షిణాది సినిమాల రోగం ఒకటి పట్టుకుంది. ఆ రోగానికి వాహకుడిగా ప్రభుదేవా సమర్థవంతంగా తన వంతు సహాయం చేస్తున్నట్లున్నాడు. దక్షిణాది సినిమాలు హిందీలోకి వెళ్ళడం కొత్తేమీ కాదు. గతంలో జితేంద్ర, అనీల్ కపూర్ ఈ ఫార్ములాని పట్టుకోని విజయాలు పట్టేశారు. ప్రియదర్శన్ లాంటి దర్శకులు దక్షిణాది సినిమాలను హిందీలో తీసి సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు మొదలైన ఈ ట్రెండ్ హిందీ సినిమాలని అథపాతాళానికి తొక్కేసేస్తోందని రౌడీ రాథోడ్ స్పష్టం చేసింది. ఇంతా చేస్తే ఇది మనకు మాత్రమే తెలిసిన రహస్యం. తెలుగు విక్రమార్కుడు చూడని హిందీ ప్రజలకి మాత్రం ఇది వంద కోట్లు వసూలు చేసిన సూపర్ హిట్ సినిమా.

తెలుగులో విక్రమార్కుడుగా, ఆ తరువాత హిందీ డబ్బింగ్‌తో సోనీ మాక్స్ లో వందల సార్లు వచ్చిన ఈ సినిమాని పుననిర్మించడంలో వందో వంతు కూడా అందుకోలేక ఈ సినిమా చతికల పడింది. తెలుగు సూపర్ హిట్ దర్శకుడు రాజమౌళి తీసిన ప్రతి సినిమా ఎందుకు హిట్టౌతోందో వివరంగా తెలియజెప్పడానికి ఈ సినిమా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

కథ తెలిసిందే.. నిజానికి ఫ్రేం టు ఫ్రేం అలాగే తీసిన సినిమా కాబట్టి మార్పుకి అవకాశమే లేదు. ఇక నటీ నటుల విషయానికి వస్తే రవితేజగా అక్షయ్ కుమార్, అనుష్కాగా సోనాక్షీ సిన్హా, అజయ్‌గా సుకుమార్, వినీత్ కుమార్ (బావుజీ)గా నాజర్ తదితరులు నటించారు. హిందీ భాషలొ తీసిన తెలుగు సినిమా కబట్టి ప్రభుదేవా ఆయా పాత్రలకు దక్షిణాది తారలనే ఎంపిక చేసుకొవడం విశేషం అయితే ఎంత మాత్రం నప్పని పాత్రలతో ఆ నటీ నటులకి నటించే అవకాశం లేకుండాపోయింది. ముఖ్యంగా అజయ్ చేసిన టిట్లా పాత్రలో సుకుమార్ (చత్రపతి, మర్యాద రామన్న ఫేం) ఆ పాత్రకి ఆకార పుష్టిలాగే మిగిలి పోయాడు. సీనియర్ నటుడైన నాజర్ కూడా బీహారీ యాసలో డైలాగులు చెప్పడానికి (డబ్బింగ్ వున్నా లిప్ సింక్ కోసం) పడ్డ కష్టంలో నటన కొట్టుకుపోయింది. అది కప్పి పుచ్చడానికి ప్రభుదేవా (అతని నోట్లో పాన్‌తో) దర్శకత్వంతొ, ఎడిటింగ్‌తో ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఇక హీరో పాత్రలో అక్షయ్ కష్టపడ్డా రవితేజ తో పోలిస్తే పేలవంగా వున్నాడు. సోనాక్షి సిన్హా ఎప్పటిలాగే శత్రుగన్ సిన్హాకి ఆడ ముఖం పెట్టినట్లు వుంది.

ఒక టికెట్ పైన రెండు సినిమాలు చూపిస్తామని ముందే ప్రకటించినట్లు చూసినంత సేపు విక్రమర్కుడు గుర్తుకువచ్చి బాధ కలుగుతుంది. మొత్తం మీద తెలుగు వాళ్ళు చూసి తట్టుకోలేని సినిమా. హిందీవారికి వంద కోట్ల సూపర్ హిట్ సినిమా. అయితే అయ్యిందిలే అని వూరుకునేందుకు లేదు… ఈ మూసలో ఇంకెన్ని తెలుగు సినిమాలు వరస కట్టాయో గుర్తొస్తేనే భయం వేస్తోంది.

3 Comments

3 Comments

 1. Sreedhar

  July 3, 2012 at 12:57 pm

  Why there is no post about Gabber Singh in Navatharangam ??? Is it not worth mentioning about Gabber Singh in this website ??

  • Why don’t you write one. We will post it. Here the members chose what to write. You can also become a member and write what you want.

  • emmkaypee

   July 19, 2012 at 6:39 pm

   Gabbar Singh Review Navatarangam lo vasthundi ani nenu chala aatram gaa eduru choosaanu. still waiting, naku telisinantha varaku navatarangam lo reviews kontha genuine gaa vastaayi. Gabbar Sing Super Hit ani lokam kodai Koosthundi kabatti veellu matram emi review rayagalaru, Gabbar singh cinema ATHI KI VEKILI THANANIKI, PORAMBOKU THANANIKI OKA PARAKASTA MARIYU NILUVETTHU NIDARSHANAM, anduke intha hit aiyaina cinema baga ledu ani review rasthe bagodu kanuka ilaa mounam gaa vundi poyaaru Navatarangam vallu
   Navatarangam editors ki cinema chala bagundi ani review rayamanandi Dhairyam vunte

Leave a Reply

Subscribe to Navatarangam via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other subscribers

Copyright © 2015 నవతరంగం. Love For Cinema, powered by Venkat Siddareddy.

To Top
Menu Title