Menu

Monthly Archive:: July 2012

ఈగ

గత రెండేళ్లుగా తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చూసి మొత్తానికి ఈ రోజు ఈగ సినిమా విడుదలైంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు  మరియు సాయి సంయిక్తంగా నిర్మించిన ఈగ సినిమాని దర్శకుడు రాజమౌళి రూపొందించారు. చనిపోయిన హీరో పునర్జన్మ ఎత్తి విలన్స్ ని ఎదుర్కోవడం అనేది ఈ సినిమా మూలకథ. ఇలాంటి కథలతో సినిమా అనే కళ ఆవిర్భవించినప్పటినుంచి అన్ని దేశాల్లో అన్ని భాషల్లో సినిమాలు వచ్చాయి; వస్తాయి కూడా! అయితే 

ప్రపంచ చిత్ర చరిత్ర 5: సినిమా పరిభాష దిశగా తొలి అడుగులు

అప్పటికి కదిలే చిత్రాలన్నింటిని సినిమాలుగానే పరిగణించేవారు.. అయితే 19వ శతాబ్దం చివర్లో వచ్చిన సినిమాలన్నీ సంఘటనా చిత్రాలే కాని పూర్తి నిడివి చిత్రాలు కావు. వుదాహరణకి లుమినరీ సోదరులు తీసిన తొలి చిత్రంలో లుమినరీ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కార్మికులు కనిపిస్తారు. ఇలాగే ప్లాట్‌ఫారం మీదకు వస్తున్న రైలు, స్ప్రింక్లర్‌తో ఆడుతున్న తోటమాలి, మనదేశానికి వస్తే లార్డ్ కర్జన్ డిల్లీ దర్బారు, కుస్తీపోటీలు ఇలాంటివన్నీ చిత్రీకరించేవారు. అయితే సినిమా ద్వారా ఒక కథ చెప్పవచ్చని, అప్పటికే ప్రాచుర్యంలో

ఎర్ర సముద్రం (2008)

“వీర తెలంగాణ” చూసాక, ఈసారి ఎలాగైనా మరిన్ని ఆర్.నారాయణ మూర్తి సినిమాలు చూడాలి అని నిశ్చయించుకున్నాను. ఆ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు ఒక డీవీడీ షాపులో ఆర్.నారాయణమూర్తి సినిమాలు ఏమన్నా ఉన్నాయా? అని అడిగితే, “ఎర్ర సముద్రం” డీవీడీ ఇచ్చారు. ఈ సినిమా గురించి ఏదో లీలగా విన్న గుర్తు ఉంది కానీ, అసలు దేని గురించి అన్నది ఏమీ తెలియదు. అయినా సరే, చూద్దమనుకుని కొన్నాను. చూసాను. ఈ సినిమా గురించి ఒక చిన్న పరిచయం.

“విక్రమార్కుడి”ని జింతాత్త చేస్తే “రౌడీ రాథోడ్”

“జింత అంటే విక్రమార్కుడు… చితా అంటే తెలుగు సినిమా… జింతాత్తథా అంటే పచ్చడి పచ్చడి చెయ్యడం” ఇదీ రౌడీ రాథోడ్ సినిమా. దబాంగ్ సినిమా తరువాత హిందీ సినిమాకి దక్షిణాది సినిమాల రోగం ఒకటి పట్టుకుంది. ఆ రోగానికి వాహకుడిగా ప్రభుదేవా సమర్థవంతంగా తన వంతు సహాయం చేస్తున్నట్లున్నాడు. దక్షిణాది సినిమాలు హిందీలోకి వెళ్ళడం కొత్తేమీ కాదు. గతంలో జితేంద్ర, అనీల్ కపూర్ ఈ ఫార్ములాని పట్టుకోని విజయాలు పట్టేశారు. ప్రియదర్శన్ లాంటి దర్శకులు దక్షిణాది సినిమాలను

ప్రపంచ చిత్ర చరిత్ర 4: భారత సినీ దర్శకులకే “దాదాసాహెబ్”

భారతదేశంలో తొలి సినిమా ప్రదర్శన 1896లో బాంబేలో జరిగింది. లుమినరీ సోదరులు తీసిన ఆరు చిత్రాలను అక్కడ ప్రదర్శించారు. అయితే ఆ చిత్రాలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రం ఒకటుంది. “ది అరైవల్ ఆఫ్ ఎ ట్రైన్ అట్ లా సియోటాట్ స్టేషన్” అనే ఈ చిత్రంలో కెమెరా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫార్మ్ పైన వుండగా ఒక రైలు దూసుకుంటూ వచ్చి ఆగడం కనిపిస్తుంది. లుమినరీ సోదరులు అనేక దేశాల్లో ఇచ్చిన ప్రదర్శనలో ఈ చిత్రాన్ని కూడా జతపరిచారు.