Menu

Monthly Archive:: July 2012

ప్రపంచ చిత్ర చరిత్ర 8: సినీ ప్రపంచానికి ఛార్లీ ఛాప్లిన్ చేసిన నిశ్శబ్ద సేవ

ఛార్లీ చాప్లిన్ ని తెరపైన చూడగానే పెదాలపై చిరునవ్వు, కళ్ళలో తడి ఒకేసారి పుట్టడం అందరికీ అనుభవమయ్యే సత్యం. ఈ అనుభవం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో కాక యావత్ ప్రపంచానికి కలగడం కేవలం చాప్లిన్ మాత్రమే సాధించిన అద్బుతం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో అసంఖ్యాక అభిమానులు కలిగిన నటుడు, అప్పటికీ ఇప్పటికీ ఒక్క ఛార్లీ చాప్లినే అంటే అతిశయోక్తి కాదేమో. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభంతో బాధలు పడుతున్న ప్రపంచాన్ని నవ్వించడానికా అన్నట్లు చాప్లిన్ కూడా

“కేరళ వర్మ పళసి రాజ” గురించి…

౨౦౦౯ జాతీయ చలనచిత్ర  అవార్డుల్లో ఇళయరాజా కి ఉత్తమ నేపథ్య సంగీతానికి అవార్డు వచ్చినప్పుడు ఈ సినిమా గురించి మొదటి సారి విన్నాను. అయితే, పెద్దగా పట్టించుకోలేదు. మధ్యలో ఈ సినిమా గురించి చదివినప్పుడు ఏం.టి.వాసుదేవన్ నాయర్ స్క్రిప్టు రాసారు అని తెలిసింది. మిథునం కథని ఆయన మలయాళంలో తీసిన పద్ధతి నచ్చినందువల్ల  ఈ సినిమాపై కుతూహలం కలిగింది. మొత్తానికి ఇన్నాళ్ళకి సినిమా చూడగలిగాను – ఆంగ్ల సబ్టైటిల్స్ తో! ఈ సినిమా గురించి నా అభిప్రాయం ఇది: సినిమా

ప్రపంచ చిత్ర చరిత్ర 7: థామస్ ఆల్వా ఎడిసన్ vs గ్రిఫిత్

ప్రపంచ సినిమా చరిత్రలో మైలురాళ్ళుగా చెప్పుకొదగ్గ ఎన్నో ఆవిష్కరణలకు మూలమైన థామస్ ఆల్వా ఎడిసన్ క్రమ క్రమంగా సినిమా తీయాలనుకునే ఔత్సాహికుల పాలిట విలన్ లా తయారయ్యాడు. అప్పటికే సినిమా ప్రక్రియకి సంబంధించిన ఎన్నో పేటంట్లను సొంతం చేసుకున్న ఎడిసన్, అవి వాడాలనుకునే వారిపై భారీ సుంకాలు విధించడంతో సినిమా తీయటం అనేది కొందరికే పరిమితమైపోయింది. ఒకవేళ ఎవరినా ఎదిరించినా, చట్టపరంగా కేసులు వేసి వేధించేవారు. 1908 నాటికే ఇలాంటి కేసులు వందల సంఖ్యలో వేయబడ్డాయి. సినిమా

సైజు చిన్నదైనా రేంజ్ పెద్దదైన “ఈగ”

ఈగ సినిమా చేస్తున్న buzzzz ఈ పాటికే మీకు చేరి వుంటుంది. ఈ సినిమా హిట్టని, సూపర్ హిట్ అనీ, తెలుగు సినిమాకి సరికొత్త మైలు రాయి అనీ అటు ఇండస్ట్రీ, ఇటు మీడియా నిర్ణయించేశాయి. చూసిన ప్రేక్షకులు ఈలలతో ఈగకి బ్రహ్మరథం పడుతున్నారు. సమీక్షకులు, విమర్శకులు “సూపర్బ్” అని వందసార్లు అంటున్నారు. నిజమేనా అని నేను ఈగని “భూతద్దం”లోంచి చూశాను. చివరికి తేలిందేమిటంటే “ఈగ” సైజు చిన్నదైనా రేంజి పెద్దదే అని. కథ ఇప్పుడు కొత్తగా

ప్రపంచ చిత్ర చరిత్ర 6: సత్తు నాణానికి సినిమా ప్రదర్శన

పిట్స్ బర్గ్, స్మిత్ ఫీల్డ్ స్ట్రీట్ లొ డైమండ్ ఎవన్యూ, ఫిఫ్త్ ఎవన్యూ మధ్యలో వున్న ఒక చిన్న దుకాణం (Store Front) ఒకరోజు కొత్త అవతారం ఎత్తింది. “నికలోడియన్” అన్న పేరుతో, చుట్టూ వెలుగు చిమ్మే రంగురంగుల లైట్లతో ఆ వీధి మొత్తానికి కొత్త శోభ తెచ్చి పెట్టింది. ఆ “స్టోర్ థియేటర్” ముందు నిలబడి ఒక వ్యక్తి అరుస్తున్నాడు – “పిల్లల్లారా, పెద్దల్లారా.. రండి.. నేడే చూడండి.. లోపలికి దయఛేయండి.. ఇంతవరకూ మీరు చూడని