Menu

Monthly Archive:: July 2012

ఉల్లాస వేళల ఆనంద స్వరం విషాద సమయాల ఓదార్పుల వరం శ్రీ బాలు గారి పాట

సత్యలోకం లో ఓ అందమైన సాయంత్రం కచ్చపి తీవెలలో స్వరసుమాలు విరుస్తున్నాయి. బ్రహ్మదేవుడు తన్మయుడై ఆ రాగ పరిమళాలను ఆస్వాదిస్తున్నాడు. యింతలో మహతిని మీటుకుంటూ నారదుడు ప్రవేశించాడు , వెన్నంటే తుంబురుడూను , వీరిని చూడగానే బ్రహ్మదేముడికి భూలోకం గుర్తొచ్చింది . శూన్యం నుండి ధ్వని ప్రసరించదనీ స్పురణకొచ్చింది . తన భార్య సరస్వతికి ఎంతో ప్రియమైన ఆ వీణారావాలు భూలోక వాసులని చేరవని కొద్దిగా దిగులు చెందాడు . పాపం చతుర్ముఖుడు కదా అంతర్ముఖుడు కాలేకపోయాడు

బై.. బై.. బాబూమోషాయ్…

రాజేష్ ఖన్నా…!! ఆ పేరులో ఎంత మహత్యం వుందో తెలియాలంటే డెబ్భైల్లో టీనేజ్ లో వున్న అమ్మాయిల్ని అడగాలి. ఆయన ఫోటో ఎదురుగా పెట్టుకోని, కత్తితో వేలు కోసుకోని దాన్నే సింధూరంగా పెట్టుకోని రాజేష్ ఖన్నా భార్యలుగా ఎంతమంది మారిపోయారో వాళ్ళే చెప్తారు. ఆయన హోటల్లో వున్నాడంటే బయట అర్థరాత్రి దాటినా వరసకట్టి నిలుచున్న అమ్మాయిల వివరాలు కావాలంటే ఆయనతో పనిచేసిన షర్మిలా టాగూర్ నో, ముంతాజ్ నో అడగాలి. కేవలం ఆయన కారు అయిన పుణ్యానికి

దివ్యమైన మిక్సప్ – కాక్ టెయిల్

వెరోనికా (దీపికా పడ్కోనే) గౌతమ్ (సైఫ్ అలీ ఖాన్) ని ప్రేమిస్తే గౌతమ్ మీరా(డయానా పెంటీ)ని ప్రేమిస్తాడు. అబ్బే! రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనిపిస్తోందా? ఇక్కడే రచయిత ఇంతియాజ్ అలీ తన వైవిధ్యం చూపిస్తాడు. వెరోనికా-గౌతమ్-మీరా ముగ్గురూ కలిసి ఒక ఫ్లాట్లో ఉంటారు. వెరోనికా-గౌతమ్ లు సహజీవనం చేస్తుంటారు. కానీ గౌతమ్, శారీరకంగాకలిసి ఉంటుంన్న వెరోనికాతో కాకుండా వెరోనికా స్నేహితురాలైన మీరాతో ప్రేమలో పడతాడు. వెరోనికా స్నేహం పోగొట్టుకోలేక,తనను మోసం చేస్తున్నానేమో అనే ఫీలింగ్ లో

ప్రపంచ చిత్ర చరిత్ర 9: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు…

1905 ప్రాంతానికల్లా సినిమా ప్రపంచపటంపైన బుడిబుడి అడుగులు మొదలుపెట్టింది. 1912 థామస్ ఎడిసన్ ఒక్క రీలుకి మించి సినిమా వుండకూడదని నియత్రించడంతో అమెరికాలో సినిమా ఒక రీలుకే పరిమితమైపోయింది. ఇలాంటి నియంత్రణ లేని ఆస్ట్రేలియా, యూరప్ లలో నాలుగు ఐదు రీళ్ళ సినిమాలు కూడా తయారయ్యాయి. ఎడిసన్ శాసనాన్ని తప్పించుకోడానికి ఎడిసన్ ట్రస్ట్ సభ్యులు కూడా మూడు నాలుగు రీళ్ళ సినిమాలు రూపొందించినా వాటిని విడి విడిగా ఒక వారం తరువాత మరికటి విడుదల చేసేవారు. ఒక