Menu

అల్వీదా బాంబే సూపర్ స్టార్

దిగ్గజ ఎలట్రానిక్ కంపెనీ ఒకటి, ఈ మధ్యే ఓ యాడ్ చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది…. కంపెనీ ప్రోడక్ట్ సంగతి అలా ఉంచితే.. ఈ యాడ్ లో.. బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించిన బాలీవుడ్ వృద్ద నటుడు ఒకరు …..టాక్ ఆఫ్ ద నేషన్ అయ్యాడు.. ఆ మధ్య…మాసిన తెల్ల గడ్డంతో..మొహం లోపలికి పీక్కుపోయి…

బాడీ మూవ్ మెంట్ కాదు కదా.. కనీసం ఫేస్ ఎక్స్ ప్రెషన్ కూడా అంతగా కనిపించడం లేదు .. ఎందుకీయనని సదరు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రిఫర్ చేసిందని ఈ తరం భావిస్తుండవచ్చు … అంతే కాదు .. ఒకడుగు ముందుకేసి .. అసలు ఈయనతోనే చేయాలని కంపెనీ అంతెందుకు ప్రిఫరెన్స్ ఇచ్చిందనీ… అనుకోవచ్చూ కూడా..
ఈ యాడ్ చత్రీకరించిన కొన్నిరోజులకే తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ ఆయన హాస్పటల్ లో జాయిన్ అయితే.. కండీషన్ ఆల్ మోస్ట్ సీరియస్ అని మీడియా హైప్ క్రియెట్ చేస్తే.. దేశం ఒక్క సారిగా ఉలిక్కిపడింది.. ఆయన ఆరోగ్య సమాచారం ఏంటో క్లియర్ గా తెల్సుకోవాలని.. ఏకంగా ఆయన ట్రీట్ మెంట్ అందుకుంటున్న హాస్పటల్ వైపే పరుగులు తీసారు కొందరు అభిమానులు..ఇక సాక్షాత్ . ..మరెందరో ప్రముఖులు.. ఆయన త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు అంటే .. అర్ధమవుతుంది ఆయన ఎంత గొప్ప నటుడో…. ఆయన ఎవరో కాదు.. సెన్సేషనల్ సూపర్ స్టార్ ఆఫ్ బాలీవుడ్ .. రాజేష్ ఖన్నా..

రాజేష్ ఖన్నా .. ఇప్పుడంటే వయసు మీద పడి… తీవ్ర అనారోగ్యం తో బాధపడుతూ.. ఇలా వైట్ బియర్డ్ మ్యాన్ గా కనిపిస్తూ చాలా నీరసించి కనిపిస్తున్నారు కానీ.. స్టోరీని మూడు దశాబ్దాలు వెనక్కి తిప్పితే .. అసలు సిసలు రాజేష్ ఖన్నా అంటే ఎంటో తెల్సిపోతుంది..

సూపర్ స్టార్ అనే బిరుదు ఇప్పుడు చాలామంది ప్రసిద్ద హీరోలకు ఇంటిపేరుగా మారింది కానీ.. అసలు ఇండియన్ సినిమాలో సూపర్ స్టార్ అనే బిరుదు పుట్టిందీ, పెరిగిందీ… రాజేష్ ఖన్నా స్టార్ డమ్ తోనే ఆంటే మీరు ఆశ్చర్యపోకమానరు..

బాలీవుడ్ ఫస్ట్ ఎవర్ సూపర్ స్టార్ టైటిల్ ను అందుకున్న మొదటి కథానాయకుడు రాజేష్ ఖన్నా..

రాజేష్ ఖన్నా డైలాగులు… రాజేష్ ఖన్నా పాటలు.. రాజేష ఖన్నా మ్యానరిజమ్స్.. రాజేష్ ఖన్నా డ్రెస్సింగ్ స్టైల్ .. మొత్తంగా రాజేష్ ఖన్నా సినిమాలు 70ల్లో .. ఆసేతు హిమాచలాన్ని ఉర్రూతలూగించాయి..

70 స్ స్టారాతిస్టారుడు .. కన్నెపిల్లల కలల రాకుమారుడు .. వరుస హిట్ల అత్యంత చరిష్మాగల కథానాయకుడిగా రాజేష్ ఖన్నా ఓ వెలుగు వెలిగాడు..
బాలీవుడ్ సినీ చరిత్రలో ఓ దశాబ్దం .. ఖచ్చితంగా ఓ దశాబ్దం.. రాజేష్ ఖన్నా తన సినిమాలతో శాసించాడు .. ఒకటి కాదు రెండు కాదు ..ఏకంగా..15 వరుస సినిమాలు సూపర్ హిట్లు ఆయన ఖాతాలో మాత్రమే ఉన్నాయి.. సుమారు నాలుగు సంవత్సరాల పాటు ఆయన సినిమాలన్నీ బాక్సీఫీస్ వద్ద సిల్వర్ జూబ్లీలు.. గోల్డెన్ జూబ్లీలు జరుపుకున్నాయి ..సంచలన నటుడిగా రాజేష్ ఖన్నాను నిలబెట్టాయి.

వందేళ్ల భారతీయ సినిమాలో.. 15 వరుస సూపర్ డూపర్ హిట్లు అందించిన కథానాయికుడు మరొకరు కనిపించరు.అదీ ఒక్క రాజేష్ ఖన్నా కు మాత్రమే ఉన్న చెక్కుచెదరని ట్రాక్ రికార్డ్ .. 70ల్లో ఆయన వరుస విజయాలతో ఫేస్ ఆఫ్ బాలీవుడ్ గా మారారు..ఇక అమ్మాయిలకైతే గ్రీకు వీరుడిగా మారి.. వారి హృదయాలను కొల్లగొట్టాడు..
చాలా అంటే చాలా తక్కువ రోజుల్లో ఎక్కువ కాలం గుర్తుండే సినిమాలు చేసి.. పలురకాల పాత్రలతో మెప్పించి.. సూపర్ స్టార్ ఇమేజ్ తో .. స్టార్ డమ్ ను ఎంజాయ్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో .. రాజేష్ ఖన్నా..

బాలీవుడ్ని రాజేష్ ఖన్నా ఏలిన కాలాన్ని .. ఓ మ్యాజికల్ పీరియెడ్ గా అభివర్ణించవచ్చు. 1970ల్లో సినిమా రిలీజ్ అవుతుందంటే .. అందులో రాజేష్ ఖన్నా ఉన్నాడంటే చాలు .. సినిమా సూపర్ హిట్టే అనే భావన ఉండేది.. అలా ఎన్నో సార్లు ప్రూవ్ అయింది.. ఫర్ ఎగ్జాంపుల్.. 1971 లో స్టార్ హీరో షమ్మీ కపూర్ , హేమా మాలినీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అందాజ్.. నిజానికి షమ్మీకపూర్ ఇమేజ్ చాలు, ఈ సినిమా నడవడానకి ..

కానీ ఇదే సినిమాలో రాజేష్ ఖన్నా చేసిన పది నిముషాల పాత్ర.. సినిమాను హిట్ స్థాయి నుంచి.. సూపర్ డూపర్ హిట్ స్ఠాయికి చేర్చించి ..జస్ట్ బికాజ్ ఆఫ్ రాజేష్ ఖన్నా ఇమేజ్..

రాజేష్ ఖన్నా చూడటానికి అంతగా ఏగబడేవారో .. ఆయన నటనను అస్వాదించడానికి ఎంతగా ఉత్సుకత చూపావారో.. ఈ అందాజ్ సినిమా ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు..
మంచి అందగాడిగా.. అంతకంటే మించి చాలా సహజంగా హావభావాలు ప్రకటించే నటుడిగా రాజేష్ ఖన్నా .. అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచేవాడు..ఆయన ఎక్కడుంటే అక్కడ అమ్మాయిలు వచ్చి వాలిపోయేవారు .. ఆయన కారు పై లిప్ స్టిక్ తో అద్దిన ముద్దులను కురిపించి మురిసేవారు.. మరికొందరు వీరాభిమానులు .. ఆయన ఫోటో పెట్టుకోని… నుదుటను సింధూరం ధరించి.. పెళ్లి అయిపోయిందనీ భావించేవారు.. ఇక రక్తంతో రాసిన ప్రేమలెఖల్తో .. ఆయన ఇంటిముందున్న పోస్ట్ బాక్స్ నిండిపోయేది..

ఇక బయటి ప్రదేశాల్లో రాజేష్ ఖన్నా సినిమా షూటింగ్ అంటే .. ఆయన కోసం వచ్చే అభిమాన ప్రవాహాన్ని అడ్డుకోవటడం మామూలు విషయం కాదు.. అమర్ ప్రేమ్ షుటింగ్ .. కోల్ కత్తాలోని హౌర్ బ్రిడ్జ్ దగ్గర చిత్రీకరించాల్సి ఉండాల్సి ఉంది. కానీ ఆయన కోసం వచ్చే అభిమానులతో బ్రిడ్జ్ నిండి కూలిపోయే ప్రమాదం ఉండే అవకాశం ఉందని నిర్ణయించి.. భయపడి అక్కడ షూటింగ్ ఆపిన సందర్భాలు ఉన్నాయి..

నిజానికి ఇప్పటి సూపర్ స్టార్లు గా కీర్తించబడుతున్న అమితాబ్, షారుక్ , సల్మాన్, అమీర్ ఖాన్ లకు కూడా ఇంత క్రేజ్ ఎన్నడూ లేదు అంతే అతిశయోక్తి కాదు.అదీ 70ల్లో రాజేష ఖన్నా సమ్మోహన పరిచిన తీరు..

స్టార్ నుంచి సూపర్ స్టార్ వరకు రాజేష్ ఖన్నా ప్రయాణం ..చాలా చిన్న ప్రయాణమే.. ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది రోజులకే..కొద్ది సినిమాలకే..తనదైన ఛరిష్మాతో రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ గా అవతరించారు. అంతే కాదు.. బాలీవుడ్ ను ఓ దశాబ్ద కాలం గుప్పెట పెట్టుకోని.. శాసించారు.

రాజ్ కపూర్ .. దిలీప్ కూమార్ .. దేవానంద్.. లాంటి లెజెండరీ హీరోల ప్రాభవం తగ్గుముఖం పడుతున్న సమయంలో.. అప్పటి తరం యూత్ ఐకాన్ గా .. బాలీవుడ్ లో రైన దూసుకువచ్చిన సంచలనం రాజేష్ ఖన్నా ..

1942 డిసెంబర్ 29 న అమ్రుత్ సర్ లో జన్మించిన రాజేష్ ఖన్నా అసలు పేరు జతిన్ ఖన్నా .. చిన్నప్పటి నుంచే స్టేజీ షోలు ఇవ్వడం అందులో అవార్డులు కొట్టేయడం రాజేష్ ఖన్నాకు వ్యసనంగా మారిందనే చేప్పాలి..స్కూల్ నుంచి కాలేజీ చదవుల వరకు ఇదే యాక్టింగ్ స్టైల్ ను కొనసాగించాడు జతిన్ ఖన్నా అలియాస్ రాజేష్ ఖన్నా.. 1965లో ఫిలింఫెయిర్, యునైటెడ్ ప్రొడ్యుసర్స్ అర్ఘనైజ్ చేసిన ఆల్ ఇండియా టాలెంట్ కాన్టెస్ట్ లో పదివేల మందితో పోటీ పడి.. కాన్టెస్ట్ గెలిచి..వారితో సినిమా ఒప్పందాన్ని కుదుర్చుకుని హీరోగా తొలిసినిమా అవకాశాన్ని అందుకున్నాడు.సినిమాల్లోకి ఎంట్రి ఇస్తున్న సమయంలో వారి కుటుంబికులు జతిన్ ఖన్నా పేరును రాజేష్ ఖన్నా గా మార్చారు..

1967లో ఆఖ్రీ ఖత్ రాజేష్ ఖన్నా హీరోగా నటించిన తొలిసినిమాగా విడుదలైంది.అదే ఏడాది రాజ్ కూడా విడుదలైంది. యునైటెడ్ ప్రొడ్యుసర్స్ ఒప్పందం తో వారితోనే Aurat, Doli , Ittefaq వంటి సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు.

ప్రతీ స్టార్ హీరోకు కెరీర్ ను మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్ సినిమా ఒకటి ఉంటుంది.. అదీ రాజేష్ ఖన్నా జీవితంలోనూ జరిగింది. 1969 .. శక్తి సామంత డైరెక్షన్ లో కష్మీర్ కి ఖలీ, యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శక్తిసామంత డైరెక్షన్ లో, గ్లామరస్ డాల్ షర్మీలా ఠాగూర్.. అండ్ అప్ కమ్మింగ్ ఆర్టిస్ట్ రాజేష్ ఖన్నా కాంబినేషన్ లో ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన సినిమా ఆరాధన..

సినిమా విడుదలైన తర్వాత .. ఓ ప్రభంజనం అయ్యి.. అప్పటివరకు బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచి.. ఓవర్ నైట్.. రాజేష్ ఖన్నాను సూపర్ స్టార్ ను చెసి.. నేషన్స్ హార్ట్ త్రోబ్ గా మారేలా చేసింది ఆరాధన సినిమా..

రాజేష్ ఖన్నా మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్.. పాటలు..డైలాగులు.. అన్నీ కలపి.. యూత్ ని కావాల్సిన సినిమాగా నిలిపింది. రోమాంటిక్ హీరోగా రాజేష్ ఖన్నాకు.. సరికొత్త ఇమేజ్ తో పాటు.. ఈ సినిమా ట్రెమెండస్ హిట్ తోనే రాజేష్ ఖన్నాకు.. సూపర్ స్టార్ స్టేటస్ అందివచ్చింది..

ఆరాధన తర్వాత రాజేష్ ఖన్నా.. సారీ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా.. ఇక వెనుదిరిగి చూసుకోలేదు.. 1969 ఆరాధన తో బాలీవుడ్ లో మొదలైన రాజేష్ ఖన్నా హవా ఓ దశాబ్దం వరకు .. మాగ్జమ్ సూపర్ డూపర్ హిట్లతో సాగింది..

ఆరాధన సినిమా ఒక్క రాజేష్ ఖన్నాకే కాదు.. స్టార్ సింగర్ కిషోర్ కుమార్ కు బ్రేక్ నిచ్చిన సినిమాగా , ఆర్ .డి. బర్మన్ కంపోజిషన్ కు క్రేజ్ ను తెచ్చి పెట్టిన సినిమాగా నిలిచింది. మరీ ముఖ్యంగా కిషోర్ కుమార్ స్వరం.. రాజేష్ ఖన్నాకు ఆహార్యం అతికినట్లు సరిపోయి.. ఎన్నో సూపర్ హిట్ పాటలకు ప్రాణం పోసింది. ఈ తర్వాతి కాలంలో ఆర్ డి బర్మన్, కిషోర్ కుమార్, రాజేష్ ఖన్నా ల కాంబినేషన్ లో 30 కి పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఆరాధన సూపర్ హిట్ టీం కంటిన్యూ అయింది.. కటీ పతంగా, అమర్ ప్రేమ్, అనురోధ్ ఇలా శక్తి సామంత, రాజేష ఖన్నా కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్నీ సూపర్ హిట్లు గా నిలిచాయి.

రాజేష్ ఖన్నా అసలైన ట్రైండ్ కంటిన్యూ అయిన డికేడ్ ఇది.. ఆ తర్వాత నాలుగేళ్లు.. వరుసగా విడుదలైన 15 సినిమాలు.. 15 సినిమాలు సూపర్ డూపర్ హిట్యయ ఓ విధంగా ఇండియా అంతటా..రాజేష్ ఖన్నా మానియా సాగింది ఈ పిరియెడ్ లో ..వీధి విధినా రాజేష్ ఖన్నా సినిమా పాటలు.. మ్రోగుతూ.. ఇంటింటా రాజేష్ ఖన్నా పోస్టర్లు వెలిసిన రోజులవి.

ఈ టైం లో ప్రతీ హీరోయిన్ రాజేష్ ఖన్నా తో ఒక్క సినిమా చేస్తే చాలు.. ఫిల్మ్ కెరీర్ సెటిల్ అవుతుందని భావించేవారు..

షర్మీలా ఠాగూర్ , రాజేష్ ఖన్నా కాంబినేషన్ లో ఆరాధన, అమర్ ప్రేమ్, చోటీ బహూ, బద్మాన్ ఫరిస్తా, రాజా రాణి, సఫర్, దాగ్ వంటి సూపర్ హిట్లు బాలీవుడ్ కు అందాయి.

ఇక తన ఫేవరేట్ హీరోయిన్ ముమ్ తాజ్ తో 8 సినిమాలు చేసాడు రాజేష్ ఖన్నా.. వీరిద్దరి కాంబినేషన్ లో దో రాస్తే, బదన్, సచ్చా జూటా, దుష్మన్, ఆప్ కి కసమ్, రోటీ, ప్రేమ్ కహాని వంటి సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

రోమాంటిక్ హీరోగా రాజేష్ ఖన్నా ఎన్నో సినిమాలు మెప్పించినా.. ఆయన కంటూ ప్రత్యేకమై ఇమేజ్ ను అందించిన మరికొన్ని సినిమాలు ఇక్కడ ప్రస్తావించాలి. ఒక పక్క రొమాంటిక్ సినిమాలు చేస్తూనే మరో పక్క కంప్లీట్ ఫ్యామ్లీ మోడ్ లో సాగే సెంటిమెంటల్ సినిమాల్లో నటించి మెప్పించడం రాజేష్ ఖన్నాకే చెల్లింది.. ఇక రాజేష్ ఖన్నా స్టైల్ ఆఫ్ డైలాగ్స్ అప్పుడే కాదు ఈ నాటికి పాపులరే..

బావర్చీ సినిమాలో మధ్య తరగతి యువకుడి పాత్రతో మెప్పించినా.. సఫర్ సినిమాలో అనారోగ్య కారణాల వల్ల నిస్సహాయ పాత్రలో జీవించినా .. అది రాజేష్ ఖన్నాకే చెల్లుతుంది..

శక్తిసామంత , మన్ మోహన్ దేశాయ్, ఓం ప్రకాశ్ మెహ్రా, యష్ చోప్రాలతో మంచి హిట్ సినిమాలు అందించిన రాజేష్ ఖన్నా.. హృషికేష్ ముఖర్జీ లాంటి ప్రసిద్ద దర్శకుడి సినిమాల్లోను నటించారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఆనంద్ సినిమా గురించి..ఈ సినిమాలో కాన్సర్ బాదితుడిగా.. లైఫ్ ను ఈజీగా తీసుకునే పాత్రలో రాజేష్ ఖన్న నటన.. ఆకాశం అంత ఎత్తున నిలుస్తుంది. ఎమోషన్ సీన్స్ లో చాలా సహజం నటించి మెప్పించాడు రాజేష్ ఖన్నా..

సెంటిమెంట్ అంటే హీరో కన్నీరుపెట్టి ప్రేక్షకులను ఏడిపించడం కాదు .. కేవలం నటనతోనే సెంటిమెంటను పడించి.. ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించడం అనే పంధాను అనుసరించాడు రాజేష్ ఖన్నా. అందుకు తగ్గ నటన కనబర్చి.. తన నటనపరిపూర్ణత సాధించుకున్నాడు కూడా.

ఇక ఇదే సినిమాలో అమితాబ్ ని బాబు మోషాయ్ అని పిలిచే డైలాగ్.. సినిమాలో సందర్భాను సారం వచ్చే డైలాగులు.. రాజేష్ ఖన్నా మ్యానరిజన్ మిక్స్ చేసి చెప్పిన విధానం..ప్రేక్షకుల్ని అకట్టుకున్నాయి..

రాజేష్ ఖన్నా డైలాగుల గురించే మాట్లాడుకోవాల్సి వస్తే.. అమర్ ప్రేమ్ లో .. పుష్పా ఐ హేట్ టియర్స్ .. అనే డైలాగ్ కూడా చాలా పాపులర్ డైలాగ్ గా నిలిచి.. రాజేష్ ఖన్నా మార్క్ ను చూపించింది.

సినీ జీవితం అనేది విచిత్రమైన ప్రపంచం…. అందునా స్టార్ డమ్ కళ్లు మూసి కళ్లు తెరిసే లోపు మాయం అవుతుంది. ఇలాంటి పరీస్ధితిలో ఓ దశాబ్దం బాలీవుడ్ ను ఏలిన వ్యక్తికి .. పరాజయాలు పలకిరించాయి..యాంగ్రిమెన్ గా అమితాబ్ తెరపైకి దూసుకువస్తున్న సమయంలో .. రాజేష్ ఖన్నా .. స్టార్ డమ్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.. ఇటు ఫ్యామిలీ లైఫ్ కూడా ఆయనని చాలా ఇబ్బంది పెట్టింది.

ఫిల్మ్ కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో ప్రముఖ్ ఫ్యాషన్ డిజైనర్ ..నటి.. అంజు మహేంద్రు తో దాదాపు 7ఏళ్లు సహజీవనం చేసి.. కాంట్రవర్సియల్ పర్సెన్ గా నిలిచారు. ఆ తర్వాత ఎందుకో వీరిద్దరి మనస్పర్ధలు ఏర్పడి దూరం అయ్యారు. బాబీ సినిమాలో హీరోయిన్ 16 ఏళ్ల డింపుల్ కపాడియాను చూసి మనసు పారేసు కున్న రాజేష్ ఖన్నా ఆమెను పెళ్లాడాడు. డింపుల్ తో పెళ్లి సమయానికి అప్పటికి రాజేష్ ఖన్నా వయసు 30 .. ఇదో కాంట్రవర్సీ.. కానీ రాజేష్ ఖన్నా మానియా సాగుతున్న సమయంలో పెళ్లి కబట్టీ అది అంత పెద్ద ఇష్యూ కాలేదు.

పెళ్లి తర్వాత పదేళ్ల కు మళ్లీ రాజేష్ ఖన్నాకు, డింపుల్ కపాడియాకు మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడాకులు వరకు వెళ్లింది. విడాకుల సమయానికి వీరిద్దరికి ఇద్దరు పిల్లలు.. ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా… ఇదే సమయంలో ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోవడం.. వ్యక్తిగత జీవితం అతలాకుతలం అవడం.. ఆయనకు డిప్రెషన్ కు లోనయ్యేలా చేసింది..

కొన్ని రోజులు ఇంటికే పరిమితం అయిన ఆయన ఎట్టకేలకు .. అమితాబ్ బచ్చన్ స్ట్రాంగ్ హవాను ఎదుర్కొని నిలబడే ప్రయత్నం చేస్తూ.. తనే నిర్మాతగా మారి అలగ్ అలగ్ సినిమాను నిర్మించి. విజయాన్ని అందుకున్నాడు.అలగ్ అలగ్ సినిమా రాజేష్ ఖన్నా సినీ జీవితంలో చివరి హిట్ గా నిలిచిన చిత్రం. ఈ సినిమా తర్వాత రాజేష్ ఖన్నా చేసిన సినిమాలన్నీ.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడి.. ఆయనకున్న చరిష్మా తగ్గిందని నిరూపించాయి.

కెరీర్ మొత్తంలో 160 సినిమాల్లో నటించిన రాజేష్ ఖన్నా .. 14 సినిమాలుగాను ఉత్తమ నటుడిగా ఫిలిం ఫెయిర్ కు నామినేట్ అయ్యి.. 3 సార్లు ఆ అవార్డును గెల్చుకున్నా రాజేష్ ఖన్నా .. అనేక అవార్డ్ సంస్ధల నుంచి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్ అందుకోని.. బాలీవుడ్ లివ్వింగ్ లెజెండ్ గా కీర్తింపబడుతున్నారు.
రాజేష్ ఖన్నా 1990లో సినీ జీవితానికి పూర్తి గా స్వస్తి చెప్పి.. రాజకీయ రంగ ప్రవేశం చేసాడు. రాజీవ్ గాంధీ ఆహ్వానం మీద న్యూ ఢిల్లీ నుంచి పోటీ చేసి గెలిచి.. 91 నుంచి 96 వరకు ఎమ్ పీ గా కొనసాగారు.

రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా అవన్నీ.. అంతంత మాత్రంగానే ఆడాయి.. అమితాబ్ లా స్మాల్ స్క్రీన్ పై హవా కొనసాగిద్దాం అని చేసిన సీరియళ్లను ఎవరూ పట్టించుకోలేదు.. సో.. 1990 తర్వాత రాజేష్ ఖన్నా ఫేమ్ నానాటికి దిగజారుతూ వస్తూ.. ఈ తరానికి వచ్చే సరికి.. ఆయనంటే ఎవరో బాలీవుడ్ సినీయర్ నటుడు అనే స్ధాయికి వచ్చింది. కానీ ఫస్ట్ హిట్ ఆరాధనలోని మెరీ సప్నోంకి రాణిలో రాజేష్ ఖన్నా అభినయం భారతీయ సినిమా ప్రపంచం ఎన్నటికి మర్చిపోదూ.. మర్చిపోలేదు కూడా .. కేవలం తన ఇమేజ్ తో ఓ దశాబ్దకాలం కష్మీర్ నుంచి కన్యూకుమారి వరకూ ఉర్రూతలూగించిన వన్ అండ్ ఓన్లీ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ ఆయన.

తన సినీ జీవితంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన క్లాసిక్ మూవీ ఆనంద్ సినిమా కథనమే.. తన నిజజీవిత గాధ గా ముగుస్తుందని ఎవరూ మాత్రం ఊహిస్తారు చెప్పండి.

దిలీప్ కుమార్ డెడికేషన్, రాజ్ కపూర్ స్పోంటేనిటీ,దేవా నంద్ స్టైల్, షమ్మీ కపూర్ రిథమ్, వీరి కలబోతే .. బాలీవుడ్ సెన్సేషనల్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా.. అందుకే ఆయన అంత త్వరగా స్టార్ డమ్ అందుకోగలిగాడు.. తిరుగులేని ఇమేజ్ తో.. భారతీయ సినీ ప్రేక్షకుల మదిలో సుస్ధిర స్ధానాన్ని ఏర్పరుచుకున్నాడు.

–చంద్రకాంత్