Menu

Monthly Archive:: June 2012

ప్రపంచ చిత్ర చరిత్ర 3: మొదటి సినిమా – మన సినిమా

అతని పేరు ఫ్రెడ్ ఓట్. పొడవైన బుర్రమీసాలు, కుదురుగా దువ్విన జుట్టు, చక్కటి సూటు, కుడి చేతిలో రుమాలుతో ప్రత్యక్షమయ్యాడు. ఎడమచేతిలో వున్న నశ్యం పొడిని ముక్కుతో ఎగబీల్చి గట్టిగా తుమ్మాడు. కేవలం అయిదు సెకండ్లు నడిచే ఈ సినిమానే అమెరికాలో కాపీరైట్ పొందిన మొదటి సినిమా (9 జనవరి 1894). అంతకుముందు 1888లో లీప్రిన్స్ “రౌంథేయ్ గార్డెన్” సినిమా తీసినా, మరింకెంతోమంది సినిమా తీసే ప్రయత్నం చేసినా “ఫ్రెడ్ ఓట్ స్నీజ్” అనేదే మొదటి సినిమా

7 Days in Slow Motion – త్వరలో

“7 days in slow motion” అనే ఈ సినిమా గురించి రెండేళ్ల నుంచీ వింటున్నాను. తెలుగు వాడైన ఉమాకాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు-ఇంగ్లీష్-హిందీ భాషల్లో హైదరాబాదు నేపథ్యంలో రూపొందించబడింది. ముఖ్యంగా ఈ సినిమా కి ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా విమర్శకుడు Roger Ebert రాసిన సమీక్ష చదివి నేను ఆకర్షితుడ్నయ్యాను. అమెరికా లోని డిస్నీ స్టూడియో లోని యానిమేషన్ విభాగంలో చికెన్ లిటిల్, ఫాంటాసిన 2000 లాంటి ఎన్నో చిత్రాలకు పనిచేసిన ఉమాకాంత్

గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్-సమీక్ష

వాసేపూర్. జార్ఖండ్ లోని ధన్ బాద్ జిల్లాలోని ఒక చిన్న టౌన్. స్వాతంత్రం రావడానికి పూర్వం వాసేపూర్ నివాసి అయిన పేరు మోసిన బందిపోటు సుల్తానా ఢాకు తన ఊరి నుంచి వెళ్లే గూడ్స్ రైళ్లను దోచుకుంటూ ఉంటాడు. ఇదే సమయానికి సుల్తానా ఢాకు పేరు చెప్పుకుని షాహిద్ ఖాన్ (జైదీప్ అహ్లావత్) కూడా దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఈ విషయం వల్ల సుల్తానా ఢాకు కి షాహిద్ ఖాన్ కి గొడవ జరుగుతుంది. తన వాళ్లందరూ ఈ

ప్రపంచ చిత్ర చరిత్ర 2: “ఎడిసన్ సరికొత్త ఆవిష్కరణ”: కెనిటోస్కోప్

“చెవులకి ఫోనోగ్రాఫ్ ఎలాగో, కంటికి కూడా అలాంటి పరికరాన్ని కనిపెడతాను” అని థామస్ ఆల్వా ఏడిసన్ ప్రకటించాడు. గ్రీకు పదాలు “కినిటో” (చలనం), “స్కోప్” (దర్శించు) కలిపి “కినెటోస్కోప్” (చలన దర్శని)అనే పేరు ఆ పరికరానికి నిర్థారించాడు ఎడిసన్. అయితే ఆ పరికరాన్ని ఎలా తయారు చెయ్యాలో అప్పటికికా అతనికి తెలియదు.. అప్పటికే మైబ్రిడ్జి చేసిన ప్రయోగాల ఫలితంగా జూప్రాక్సిస్కోప్ అనే అ పరికరం రూపొందించబడింది. మరో పక్క ఫ్రాన్స్‌లో లుమినరి బ్రదర్స్ కదులుతున్న బొమ్మల చిత్రాల్ని

ప్రపంచ చిత్ర చరిత్ర 1: చిత్రం చలనమైన వేళ

అది 1878 జూన్ 19 తేది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పాలోఆల్టో అనే నగరంలోని ఒక మైదానం. అనేకమంది ప్రేక్షకులు, పత్రికా విలేఖరులు ఉత్కంఠతతో చూస్తున్నారు. అప్పటికే ప్రముఖ ఫొటోగ్రాఫర్‌గా పేరు పొందిన ఎడ్వర్డ్ మైబ్రిడ్జ్ తన ఇరవైనాలుగు కెమెరాలను సరిచూసుకోని తెల్ల గడ్డం నెమురుకుంటూ కూర్చున్నాడు. ఆ ఇరవై నాలుగు కెమెరాలు ఒక దాని పక్కన ఒకటి ఇరవై ఏడు అంగుళాల దూరంలో పెట్టబడి వున్నాయి. అన్ని కెమెరాలు సెకనులో ఇరవై అయిదో వంతు కాలం