Menu

Rules of the game

ఈ మధ్య నేను చూసిన సినిమాల్లో అన్నింటికంటే మంచి సినిమా ఈ Rules of the game. ఈ మధ్యే కాదు నా జీవితంలో చూసిన చాలా సినిమాల్లోకెల్లా అత్యంత గొప్పదైన ఈ సినిమాకి దర్శకుడు Jean Renoir. ఫ్రెంచ్ సినీ చరిత్రలో మకుటంలేని మహరాజు లాంటి Jean Renoir ఎన్నో కళాఖండాలను తెరకెక్కించినప్పటికీ ఈ సినిమా మాత్రం ఆయన తీసిన సినిమాల్లోకెల్లా అత్యుత్తమ చిత్రమని చెప్పొచ్చు.

ప్రపంచలోని అత్యుత్తమ సినిమాల లిస్టులో ఎప్పుడూ స్థానం కల్పించుకుని దాదాపు 70 ఏళ్ళ తర్వాత కూడా ప్రేక్షకుల మరియు విమర్శకుల మన్ననలు పొందుతున్న ఈ సినిమా 1930 ల నాటి ఫ్రెంచ్ బూర్జువా సమాజానికి ప్రతిబింబంగా నిలుస్తుంది.

వ్యగ్యం అనే పదానికి అర్థం ఈ సినిమా అని చెప్పొచ్చు. ఇందులో కథ Christine అనే అమ్మాయి చుట్టూ నడుస్తుంది. ఈమె కు అప్పటికే పెళ్ళి అయిపోయినప్పటికీ André Jurieux ఆమెను ప్రేమిస్తున్నాని వెంటపడతాడు. కానీ ఈమె భర్త Robert ఇదివరకే Geneviève అనే మరొకామెతో సంబంధం కలిగి వుంటాడు. Christine ని ఎలా అయినా తనదాన్ని చేయమని André తన స్నేహితుడైన Octave ని అడుగుతాడు. ఆ ప్రయత్నంలో Octave తనకు Christine పై వున్న ప్రేమను ఆమెకి తెలియచేస్తాడు. వీరందరూ మరో పెద్ద గుంపుతో కలిసి వేటాడడానికి ఒక మహల్లాంటి ప్రదేశం చేరుకుంటారు. అక్కడ వున్న పనివాళ్ళలో దాదాపుగా ఇలాంటి లవ్ ట్రయాంగిల్ ఒకటి నడుస్తుంది. ఈ గందరగోళంలో ప్రేక్షకుడిని ఒక పాత్రను చేసి ఆనాటి సమాజంపై Renoir చేసిన ఒక అధ్భుతమైన satire ఈ సినిమా.

ఒక్క మాటలో చెప్పాలంటే మాస్టర్‍పీస్!

చదివితెలుసుకోవడంకంటే చూసి ఆనందించవలసిన సినిమా ఇది. చాలా గొప్ప సినిమాలలాగే విడుదలయినప్పుడు ప్రేక్షకాదరణ పొందలేకపోయిన ఈ సినిమా ఆ తర్వాత కాలంలో చాలా సార్లు నిషేధించబడింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుధ్ధంలో దాదాపుగా మంట కలిసింది. కానీ సినీ ప్రేమికులెవరో చేసిన పుణ్యంతో డిజిటల్ ప్రక్రియతో restore చేయబడింది. ఏ ప్రముఖ DVD షాపులోనయినా మీకు దొరుకుతుంది. తప్పక చూడండి.
ఈ సినిమాలో వున్న ప్రత్యేకత ఏంటంటే ఇందులో కెమెరా యొక్క presence ని మర్చిపోయి ఈ సినిమా జరిగే మహల్లో మనమే తిరుగుతూ అక్కడి పాత్రలను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. సత్యజిత్ రే Renoir సినిమాలు చూసే బాగా ప్రేరణ చెందాడట! The River సినిమా చిత్రీకరణకు Renoir కలకత్తా వచ్చినప్పుడు సత్యజిత్ రే కలిసి సినిమాల గురించి చాలా సేపే సంభాషించారట. తన తొలి సినిమా తీయకముందు సత్యజిత్ రే లండన్ లో వుండగా చూసి ప్రేరణ పొందిన వంద సినిమాల్లో ఈ Rules of the Game సినిమా ఒకటి.

ఈ సినిమాలోని సంభాషణలు ఒక్కొక్కటీ ఒక్కో వజ్రపు తునక. బూర్జువా సమాజంపై సంధించిన అస్త్రం. ఉదాహరణకు కొన్ని:
Robert: Corneille! Put an end to this farce!
Corneille: Which one, your lordship?

Robert: [to Schumacher] I have no choice but to dismiss you. It breaks my heart, but I can’t expose my guests to your firearms. It may be wrong of them, but they value their lives.

ప్రఖ్యాత దర్శకుడు Robert Altman ఈ సినిమా గురించి చెబుతూ “Rules of the Game taught me the rules of the game” అన్నారు. ఈ సినిమా చూసి సినిమా తీయాలనుకునే వాళ్ళు నేర్చుకొవలిసింది చాలా వుంది.

One Response
  1. ravi May 29, 2008 /