Menu

Monthly Archive:: April 2012

బాగలేదు అని చెప్పలేని సినిమా: దేవస్థానం

ప్రస్తుత తెలుగు సినిమా ట్రెండ్ కి భిన్నంగా ఏ మాత్రం స్టార్ లు లేని సినిమా, అదీ కథను నమ్ముకున్న సినిమా రావటం అరుదుగా జరుగుతుంది. కానీ అలాంటి ప్రతి సినిమా శంకరాభరణం కాలేదు. ఇప్పుడు దేవస్థానం పరిస్థితి కూడా అంతే. కే. విశ్వనాధ్, యస్పీబీ, ఆమని వంటి దిగ్గజాలు వున్నారు, మానవ జీవితం గురించి ముఖ్యంగా మానవత్వం గురించి మంచి కథ వుంది – ఇన్ని వున్నా మంచి సినిమా చూశాం అన్న తృప్తిని పూర్తిగా ఇవ్వలేకపోయిన

ఒక “గుప్త దాత” కథ – విక్కీ డోనార్

దానం చేసే దాతల్లో కొంతమంది గొప్పగా చెప్పుకోవచ్చు, కొంతమంది చెప్పుకోకుండా గుప్తంగా వుండటానికి ఇష్టపడచ్చు. కానీ చేసిన దానమే నలుగురికీ చెప్పుకోలేనిదైతే ఆ దాత “గుప్త దాత” గా వుండిపోవాల్సిందేనా? అతను చేసిన దానం గురించి తెలిసిన తరువాత అతని కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇలాంటి కథాంశంతో రూపొందించిన చిత్రమే విక్కీ డోనార్. ఇంతకీ అతను అంత గుప్తంగా చేసిన దానం ఏమిటనా మీ అనుమానం? అయితే వినండి. విక్కీ ఒక sperm donor.

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: Pirates of Silicon Valley

  ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని శాసించినవాళ్ళు ఇద్దరున్నారు. స్టీవ్ జాబ్స్ టెక్నాలజీ అంటే ఏమిటో తెలిసినవాళ్ళకి ఈ పేరు తెలియకుండా వుండే అవకాశమే లేదు. ఆయన పేరు తెలియకపోయినా కనీసం ఐపాడ్, ఐఫోన్ అనే పేర్లు విని వుండకపోతే ఆ వ్యక్తిని సాంకేతిక నిరక్షరాస్యుడని (technology illiterate) ప్రకటించేయచ్చు. బిల్ గేట్స్ కంప్యూటర్ల గురించి తెలియని సాంకేతిక నిరక్షరాస్యుడికి అయినా ప్రపంచంలోనే అత్యంత ధనికుడుగా బిల్ గేట్స్ సుపరిచితుడు. ఇక కంప్యూటర్ అంటేనే విండోస్ అనేంతగా చొచ్చుకుపోయిన

చూసినవాళ్లకి ‘డాష్ డాష్’

(రివ్యూ కన్నా ముందు నా సోది ఉందీ.. ఇబ్బంది కలిగితే ఈ సారికి క్షమీంపుము.)   ఇదిగో టైటిల్ చూసి ఇదేదో సినిమా రివ్యూ అనుకునేరు.. కాదు కాదు.. ఆనందాన్ని పంచుకుంటే పెరుగుతుందంట, దుఃఖాన్ని పంచుకుంటే తరుగుతుందంటా.. చేసిన పాపం చెప్తే పూర్తిగా పోతుందంటా..ఏదో నా పాపాన్ని కడుక్కునే ప్రయత్నమన్న మాట. రోజూ లేచే టైం కన్నా లేటగా లేవటం తో హడావిడిగా రెడీ అయ్యి, కబోర్డ్ లో ఉన్న అరడజన్ డియో స్ప్రే లలో ఒక

మూసలోకూడా ఒదగని ‘రచ్చ’

ఐదు ఫైట్లు, ఆరు పాటలు, వీలైనంత మంది కామెడియన్సూ, సాధ్యమైనన్ని డబుల్ మీనింగ్ డైలాగులూ, ఫ్యూడల్ ఫ్లాష్ బ్యాక్, కథకు సంబంధం లేకుండా సినిమా అంతా స్లీప్ వాకింగ్ చేసే హీరో, కథతోపాటూ కథానాయకుడి గమ్యాన్నీ నిర్దేశించే ఆపద్ధర్మ హీరోయిన్ ఇవి ‘రచ్చ’ సృష్టించిన కొత్త కమర్షియల్ సినిమా ఫార్ములా. మాస్ సినిమాలు అనబడే ఫార్ములా చిత్రాలు చాలా అవసరం. ఎందుకంటే, అవి అసెంబ్లీలైన్ ప్రొడక్షన్స్ లాంటివి. సఫల ప్రయోగాల ఆధారంగా తయారయ్యే ప్రోడక్టుల్లాంటివి. అందుకే చిరంజీవి,