Menu

ఒక ‘చిన్న బడ్జెట్ సినిమా’ కథ

సంవత్సరానికి తెలుగులో విడుదలయ్యే సినిమాలలో అధికశాతం చిన్న బడ్జెట్ సినిమాలే ఉన్నాయి. విడుదలైన చిన్న బడ్జెట్ సినిమాలలో చాలా వరకు విజయవంతం కానివే. కారణం, బలహీన కథలను ఎంచుకోవడం ఒకటయితే బలహీన దర్శకుడిని ఎంచుకోవడం మరొకటి. ఇదికాక డబ్బు కొరతతో మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి.

 

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమాలూ ఉన్నాయి – చిత్రం, నువ్వే కావాలి, జయం, a film by aravind, ఆనంద్, ఐతే, మంత్ర, అనుకోకుండా ఒకరోజు, అలా మొదలైంది మొదలైనవి. ఈ సినిమా కథలు వేటికవే వైవిధ్యమైనవి.

 

ఒక్క హైదరాబాద్, సికిందరాబాద్ లనే తీసుకుంటే, ఇక్కడ జనాభా బాగా పెరిగింది. అంటే థియేటర్ కి వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఇది ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది, మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్ కి వస్తారని. ఉదాహరణకు ‘ఆనంద్’, ‘అనుకోకుండా ఒకరోజు’ లాటి సినిమాలు మూడోవారానికే థియేటర్ లు పెంచుకుని బాగా business చేసాయి.

 

సినిమా తీయాలనుకున్నప్పుడు, చిన్న సినిమాకి ఎలాంటి జెన్నర్(genre) అయితే మంచిదో నిర్ధారించుకోవాలి. ఇక్కడ horror, humour, crime, drama genre అయితే బాగా పనిచేస్తాయి. horror, suspense thriller genre సినిమాలలో పాటలు అవసరం లేదు కాబట్టి ఆ ఖర్చు కలిసొస్తుంది. ఆ కోవకి చెందిన ‘a film by అరవింద్’ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. డబ్బు పెట్టగలిగితే ‘మంత్ర’, ‘అనుకోకుండా ఒకరోజు’ సినిమాల్లోలాగా పాటలు పెట్టుకోవచ్చు.

 

ఏ సినిమాకైనా మంచి కథనే మూలం. కథలో freshness, originaality చిన్న బడ్జెట్ సినిమాలకి మంచిది. ఇలాంటి scripts, సినిమాలో భారీ visual effects, పెద్ద పెద్ద sets లేకున్నా సినిమాని నడిపించగలవు. Romantic comedy genre కి చెందిన ‘అలా మొదలైంది’ సినిమాలో ఒక్క set కూడా వెయ్యలేదు, jimmy jib crane equipment ని వాడలేదు. అయినా సినిమా ఎంత మంచి విజయం సాధించిందో మనకు తెలుసు.

 

వేదం సినిమా కథ సిధమైన తర్వాత దర్శకుడు క్రిష్, తన సినిమాలో సరోజా పాత్రని చెయ్యమని నటి అనుష్కని కలిసినప్పుడు ఆమెకు కథాపాత్రలు నచ్చడంతో తన remuneration లో ౩౦ శాతం తగ్గించారు. ఇలా పెద్ద ఆర్టిస్ట్లు నటించడం చిన్న సినిమాకి (వేదం చిన్న సినిమా కాకపోవచ్చు) పబ్లిసిటీ వస్తుందన్నది వాస్తవమే అయినా, మంచి కథలు వచిన్నప్పుడైనా స్వచ్చందంగా ముందుకురావడం(గెస్ట్ రోల్స్ కాదు) industry కి కూడా మంచిది. కొత్త నటీనటులతో విడుదలైన చిన్న బడ్జెట్ సినిమాలు కూడా మంచి విజయం సాధించినవి ఉన్నాయి. ప్రతిభగల కొత్త నటీనటులు అవకాశంకోసం ప్రయత్నించడం మనం గమనిస్తూనే ఉన్నాం. పైగా వీళ్ళ remuneration లు చాలా తక్కువగా ఉంటాయి. ఎంపికైన నూతన నటీనటులకు కథలోని సన్నివేశాలు వివరించి, రిహార్సల్స్ ఇవ్వడం ద్వారా షూటింగ్ జరిగేటప్పుడు ఇబ్బంది లేకుండా, షూటింగ్ జరిగే రోజులు పెరగకుండా చూడచ్చు.

 

సినిమాలలో, అసిస్టెంట్ డైరెక్టర్ గాను అసిస్టెంట్ కెమెరామెన్ గాను అవకాశంకోసం ఆత్మవిశ్వాసంతో ఉన్న కొత్త వాళ్ళని లేదా ఇంతకు ముందే ఒకటీ రెండు సినిమాలకి పనిచేసిన వాళ్ళని teamలోకి తీసుకోవడం ఒక పద్దతయితే, ఫిల్మ్ స్కూల్ లో చదివిన విధ్యార్తులను తీసుకోవడం మరో పద్దతి. ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన వారికి ఫిల్మ్ మేకింగ్ గురించి పరిచయం ఇవ్వనక్కరలేదు. డబ్బు కోసం పనిచెయ్యని వారు కచ్చితంగా గుర్తింపుకోసం, అనుభవంకోసం పనిచేసి ఉంటారు. కాబట్టి వారి పనికి గుర్తింపునివ్వాలి. మొదటి అవకాసంకోసం ఉత్సాహంతో ఎదురుచూస్తున్న ప్రతిభగల ఆర్ట్ డైరెక్టర్, కామెర మెన్, కాస్ట్యూమ్ డిజైనర్స్ , డాన్స్ కోరియోగ్రాఫెర్స్ ఇండస్ట్రిలో ఉండనే ఉన్నారు.

 

స్టోరీ బోర్డ్ అవసరం: లొకేషన్ ని దృష్టిలో ఉంచుకుని షాట్ డివిజన్ ముందే చేసుకోవాలి. Action మరియు adventure లాటి కష్టమైనా సన్నివేశాలయితేనే స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ సహాయం తీసుకోవాలి. లేదా మీరు తీయాలనుకున్న సన్నివేశాన్ని విజువలైజ్ చేసి ఆ లొకేషన్లో ఎన్ని పాత్రలు ఉన్నాయి, వాటి కదలికలు, వాటి మధ్య సంభాషణలు మరియు రియాక్షన్స్ ని బట్టి, సన్నివేశం మూడ్ ని బట్టి ఎన్ని షాట్స్ కావాలో ఊహించి కేమెర angles తో స్టొరీ బోర్డ్ వేసుకోవచ్చు.

 

డిజిటల్ కెమెరా మరియు ఫిల్మ్ కెమెరాలు: ఈ రెండింటిలో డిజిటల్ కేమెరాల rental cost తక్కువగా ఉండటమే కాకుండా post-production ఖర్చులు కూడా తగ్గుతాయి. ఫిల్మ్ కెమెరా (ఉదా: Arri 435) లకు Raw stock కొనాలి, షూటింగ్ అయిన తర్వాత footageని processing, tele cine చేసి డిజిటల్ వీడియోగా మార్చి ఎడిటింగ్ కి పంపాలి. అదే డిజిటల్ కెమేరాతో షూట్ చేస్తే పైన చెప్పిన కర్చులు లేకుండా నేరుగా ఎడిటింగ్ కి పంపచ్చు. డిజిటల్ కామెరలలో ఇప్పుడు ఎక్కువగా వాడుకలో ఉన్నవి canon 5D mark II, red one mysterium మరియు arri alexa.

 

canon 5D mark II తో తీసిన తెలుగు సినిమా ‘దొంగల ముఠా’. ఇదే కెమేరాతో చెన్నైకి చెందిన నా మిత్రుడు, సినిమాటోగ్రాఫర్ Sooraj Nallusami మడగాస్కర్ లో THB beer promotional song తీసారు. దీని విజువల్ క్వాలిటి అద్బుతంగా వచ్చింది. ఒకసారి ఈ link ని చూడండి – (http://vimeo.com/27948842). ఈ సాంగ్ లో సినిమాటోగ్రఫి గురించి ఆ కెమెరామెన్ తో చర్చించినప్పుడు “canon 5D mark II తో కాంపాక్ట్ ప్రైం (cp2) lens వాడార”ని తెలిసింది. ఈ డిజిటల్ కోవకి చెందినవే red one mysterium, arri alexa. canon 5D mark II తో పోలిస్తే వీటి విజువల్ క్వాలిటి కాస్త ఎక్కువ. red one కి ఉదాహరణ ‘180(తెలుగు)’, ‘ఈనాడు(తెలుగు)’. arri alexa తో షూట్ చేసిన తెలుగు సినిమా ‘KSD అప్పలరాజు’.

 

Gautam Patnaik దర్శకత్వంలో వచ్చిన ‘కెరటం(తెలుగు)’ సినిమాలో రెండు పాటలు గోవా (out door) లో చిత్రించారు. ఈ రెండు పాటలకు lights ఉపయోగించలేదు. లైట్స్ కి బదులుగా వెంట తెచ్చుకున్న reflecters, thermocolని వాడారు. కొన్ని షాట్స్ కోసం 4×2 అడుగుల కొలతలో రెండు పెద్ద mirrorsని frame కట్టించి ఉపయోగించారు. ఇక్కడ లైట్స్ వాడక పోవడంతో వాటిని shift చేసే light mens, generator మరియు vehicle ఖర్చులు తగ్గాయి. songs మరియు monitor ని play చెయ్యడానికని ఒక portable generator ని అక్కడే అద్దెకు తీసుకున్నారు. lights లేకుండా షూటింగ్ అంటే కొంతమంది సినిమాటోగ్రాఫర్స్ కి నచ్చకపోవచ్చు, కాని ఇది వాస్తవం.

 

సినిమాని డిజిటల్ కెమేరాతో షూట్ చేసి QUBE, UFO రూపంలో డిజిటల్ థియేటర్లలో విడుదల చేస్తున్నారు ఇప్పటి నిర్మాతలు. సినిమాలు ‘reel సినిమా’, ‘Digital సినిమా’ అని రెండు రకాలుగా విడుదల అవుతాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు చాలా థియేటర్స్ లో డిజిటల్ projections ఉన్నాయి. ఈ థియేటర్లని ‘డిజిటల్ థియేటర్స్’ అంటారు. వీటి సంఖ్య పెరుగుతోంది కూడా. QUBE, UFO డిజిటల్ సినిమాలు ఈ డిజిటల్ థియేటర్స్ లోనే విడుదల అవుతాయి. QUBE డిజిటల్ సినిమాని ఒక compact disc రూపంలోనూ, UFO డిజిటల్ సినిమాని satellite ద్వారానూ ఈ డిజిటల్ థియేటర్లలో play చేస్తారు. ‘Reel సినిమా’ గా కంటే ‘Digital సినిమా (QUBE, UFO)’ గా విడుదల చేసి చిన్న బడ్జెట్ నిర్మాతలు లాభపడుతున్నారు. (ఉదా: LBW సినిమాని red one కెమెరాతో షూట్ చేసి డిజిటల్ సినిమా (QUBE, UFO) గా విడుదల చేసారు.)

 

చిన్న బడ్జెట్ సినిమాల విజయానికి ఆ సినిమాలని విడుదల చేసే టైం కూడా ముఖ్యమే. ఎక్కువ సినిమాలు విడుదలైనప్పుడు లేదా స్టార్స్ నటించిన పెద్ద బడ్జెట్ సినిమాలు విడుదలైనప్పుడు చిన్న బడ్జెట్ సినిమా విడుదలైతే థియేటర్లు దొరక్క ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

 

సినిమా నిర్మాత box office ద్వారానే కాకుండా satellite rights, VCD/DVD rightsల రూపంలోను పెట్టిన డబ్బుని తిరిగి పొందుతున్నాడు. ఇప్పుడు TV చానల్స్ ఎక్కువైపోయాయి. మనుగడ కోసం, TRP ratings కోసం వాటి మధ్య పోటీ పెరిగింది. 24 గంటలూ వినోదాన్ని అందించేందుకు సిధమయ్యాయి. సినిమాలు మరియు రకరకాల సినిమా కార్యక్రమాల ద్వారా వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో TV చానల్స్ వారు, సినిమా తీసిన నిర్మాత దగ్గరికి వెళ్లి ఆ సినిమాను వాళ్ళ చానల్స్ లో టెలికాస్ట్ చెయ్యడానికి, ఆ నిర్మాతకి కొంత డబ్బు ఇచ్చి rights తీసుకుంటారు. దీనినే satellite rights అంటారు. చిన్న బడ్జెట్ సినిమాలు కేవలం satellite rights ద్వారానే పెట్టిన పెట్టుబడిలో సగానికిసగం (కొన్ని సార్లు సగంకంటే ఎక్కువ) తిరిగి పొండుతున్నాయంటే అతిశయోక్తి లేదు. కొన్ని సార్లు సినిమా షూటింగ్ కాకుండానే satellite rights ఇచ్చేస్తున్నారు. కాకపొతే సినిమా పూర్తయ్యాక ఇవ్వడం మంచిది.

ఈ విధంగా ప్రతి అంశంలోనూ వాస్తవాలు విశ్లేషించుకుని, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే చిన్న బడ్జెట్ సినిమాని విజయవంతం చేసుకోవచ్చు. ఒక నిర్మాత సరైన దర్శకుడిని ఎంచుకోవడంతో ఈ విజయం మొదలవుతుంది.

 

— కృష్ణ కిరణ్ గౌర (Krishna Kiran Gowra).

 

12 Comments
 1. aripirala March 20, 2012 /
  • Sripal March 23, 2012 /
 2. ramesh kolluri March 20, 2012 /
 3. Krishna Kiran Gowra March 22, 2012 /
 4. Ashok March 23, 2012 /
 5. ramesh kolluri March 23, 2012 /
 6. ramnv March 29, 2012 /
 7. praveen April 2, 2012 /
 8. durga August 23, 2012 /
 9. a crazymaruth August 14, 2013 /
 10. hari venkat January 13, 2017 /