Menu

ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా

1222_poster_rashomon.jpgఈ నెల నవతరంగంలో జాపనీస్ దర్శకుడు అకిరా కురొసావా మీద ఫోకస్ శీర్షికనా ప్రత్యేక వ్యాసాలు ప్రచురిస్తున్న సంగతి పాఠకులకు తెలిసిన విషయమే. ఇదే సమయంలో అంతర్జాల పత్రిక ఈ మాటలో అకిరా కురొసావా చిత్రాల్లో అత్యంతా ప్రఖ్యాతి గాంచిన ’రషోమన్ ’ సినిమా గురించి వ్యాసం వెలువడింది.

ఈ సినిమా సారాంశం ఎంత శక్తి వంతమైనదంటే మనస్తత్వ శాస్త్రంలో ఈ సినిమా పేరుతో ఒక నిర్వచనం కూడా ఉంది. ఒకే సంఘటనకి సాక్షులైన వారి కథనాల్లో, వారి వారి దృక్పథాన్ని బట్టి పరస్పర విరుద్ధత జనిస్తుంది. కానీ, ప్రతీ కథనంలోనూ ఎంతో కొంత నిజం ఉంటుంది. ఇలా ఒకే సంఘటన పరస్పర విరుద్ధమైన రూపాల్లో, ప్రతీ కథనమూ కొంత సాపేక్షిక సత్యాన్ని వ్యక్తం చేయటాన్ని “రషోమాన్ ఎఫెక్టు” అని వ్యాఖ్యానిస్తారు. ఒకే సంఘటనకి సంబంధించి పలువురు వ్యక్తులు భిన్న దృక్పథాలు కలిగి ఉండడాన్ని మానసిక, న్యాయశాస్త్ర సంబంధ విషయాలలోనూ పరిగణనలోకి తీసుకుంటారు. రషోమాన్‌లో నాటకీయత (మెలోడ్రామా) ఉందంటారు కొందరు విమర్శకులు. ఈ సినిమాలో ఉన్నది నిజంగా అత్యున్నత స్థాయి ఆర్టు, డ్రామా. ఈ సినిమా ‘అబద్ధాన్ని, నిజాన్ని అనుమానం లేకుండా ఎలా అర్ధం చేసుకోవాలి?’ అని ప్రేక్షకుల్ని ఆలోచింప చేస్తుంది.

విష్ణుభొట్ల లక్ష్మన్న వ్రాసిన ఈ విశ్లేషణాత్మకమైన వ్యాసం అకిరా కురొసావా అభిమానులందరూ తప్పక చదవాల్సిన వ్యాసం. ఈ వ్యాసం పూర్తిగా ఇక్కడ చదవండి.

2 Comments
  1. Lakshmanna Vishnubhotla March 16, 2008 / Reply
  2. విష్ణుభొట్ల లక్ష్మన్న March 22, 2008 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *