Menu

Monthly Archive:: March 2012

విద్యా (బాగ్చీ) + విద్యా (బాలన్) = నేషనల్ అవార్డ్… అదీ “కహానీ”

గుప్పిట మూసి వుంచితే మిస్టరీ. అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం థ్రిల్లర్. కాని ఇలాంటి కథల్లో ఒక చిక్కు వుంది. గుప్పిట తెరవగానే అప్పటిదాకా థ్రిల్ కి గురైన ప్రేక్షకులే “ఓస్ ఇంతేనా” అంటూ పెదవి విరిచేస్తారు. లేదా పొరపాటున ఎక్కడైనా Loose Ends దొరికిపోతే “నాకర్థమై పోయిందోచ్” అంటూ అరిచేస్తారు. అలా దొరికీ దొరక్కుండా, విప్పీ విప్పకుండా అనుక్షణం Thrill Ride ఇవ్వగలిగిన సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన ఆణిముత్యం, ఆద్యంతం కట్టిపడేసే

కథే ప్రాణంగా ’కహాని’

ఒక సమకాలీన సమస్యను తీసుకొని, దాని పరిష్కారాన్ని యుగయుగాలుగా వేళ్ళూనుకుపోయిన ఒక విశ్వాసంలో నిలుపుతూనే, సార్వజనీనత కోల్పోకుండా ఒక కథ చెప్పటం కత్తి మీద సాములాంటిది. అవినీతి, ఉగ్రవాదం మొదలైన సమకాలీన సమస్యలతో వచ్చిన సినిమాలు ఉండనే ఉన్నాయి. వాటన్నింటిలో విభిన్నంగా నిలిచిపోయే సినిమా ఇవ్వాళ నేను చూశాననే నాకనిపిస్తుంది. ఆ సినిమా, బాలీవుడ్ తాజా విడుదల – ’కహాని’. ఇదో థ్రిల్లర్ సినిమా. మొదటి నుండి చివరి దాకా ఏం జరుగుతుందో సగటు ప్రేక్షకునికి తెలుస్తూనే

మేనేజ్మెంట్ పాఠాలు నేర్పే సినిమాలు

పాఠం ఎంత గొప్పగా వున్నా, చెప్పడం బాగలేకపోతే ఎలా విసుగనిపిస్తుందో అలాగే ఎంటర్టైన్మెంట్ లేని డాక్యుమెంటరీ కూడా చప్పగా వుంటుంది. ఈ విషయం ఎం.బీ.యే. లాంటి ప్రొఫెషనల్ పట్టా పుచ్చుకున్నవారికీ, తరచూ కార్పొరేట్ ట్రైనింగ్లలో కూర్చునేవారికి ప్రత్యక్షంగా అనుభవం అయ్యే వుంటుంది. అలా బోరు కొట్టే డాక్యుమెంటరీలతో కాకుండా సినిమాల ద్వారానే కార్పొరేట్ పాఠాలు ఎందుకు చెప్పకూడదు? ఒకవేళ అలా చెప్పాలనుకుంటే అలాంటి సినిమాలు వున్నాయా? అన్న ప్రశ్నలకు నేను వెతుక్కున్న సమాధానమే ఈ వ్యాసం.