Menu

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: 12 O Clock High

మేనేజెంట్ పాఠాలు నేర్పించే సినిమాలలో గతవారం చర్చించిన 12 Angry Men  అత్యంత ప్రముఖమైనది అయితే, ఆ తరువాత చెప్పుకోదగ్గ చిత్రం 12 O Clock High. ఈ రెండు చిత్రాలు 12తో మొదలవటం కేవలం కాకతాళీయమే. పైగా రెండు చిత్రాలు Leadership కి సంబంధించినవి కావటం మరో విచిత్రం.

1949 లో నిర్మాణమైన ఈ War Cinema నాజీలకు వ్యతిరేకంగా అమెరికా వైమానికసేవ చేసిన యుద్ధం గురించి ప్రస్తావిస్తుంది. 918 Bomb Group అనే పేరుగల ఒక వైమానిక దళం తరచూ విఫలమౌతూ, “Hard Luck Group” అనే పేరుపడి వుంటుంది. ఆ దళానికి నాయకుడు కల్నల్ కీత్ డేవెన్ పోర్ట్ మొత్తం సభ్యులతో ఎంతో చనువుగా వుంటూ, వారి ఆదరాభిమానాన్ని పొంది వుంటాడు. అయినా టీమ్ విఫలమవడం వల్ల అధికారులు అతన్ని తొలగించి అతని స్థానంలో బిగెడీర్ జనరల ఫ్రాంక్ సావేజ్ ని నాయకుడిగా నియమిస్తారు. అలా అధికారంలోకి వచ్చిన సవేజ్ గతంలో నాయకుడిగా వున్న డేవెన్ పోర్ట్ విధానాలకు పూర్తి భిన్నమైన విధానలతో టీమ్ మొత్తాన్ని ఆశ్చర్యానికీ, కొన్ని సందర్భాలలో అసహనానికీ గురిచేస్తాడు. క్రమంగా “Hard Luck Group” అని పేరుపడ్డ ఆ టీమ్ ని విజేతలుగా చేయటమే సినిమా కథ.

ముందే చెప్పినట్లు ఈ సినిమాలో నాయకత్వ లక్షణాల గురించి నేర్చుకునేందుకు చాలా వుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటీకీ మిలటరీతో సహా అనేక చోట్ల Leadership Trainingకి వాడుతున్నారు. తొలి భాగంలొ డావెన్ పోర్ట్, తరువాత భాగంలో సావేజ్ అని ఇద్దరు నాయకులు, పరస్పర విరుద్ధమైన ఇద్దరి లక్షణాలు బేరుజు వేసే అవకాశం వల్ల బహుశా ఈ సినిమా అంతటి ప్రాచుర్యాన్ని పొందిందేమో. మేనేజ్మెంట్ చదివిన వారికి (HR లేదా Organisation Understanding)లో చదువుకున్న X మేనేజర్, Y మేనేజర్ గురించి గుర్తుండే వుంటుంది (Workforce motivation theory by Douglas McGregor). ఆ సిద్ధాతం ప్రకారం రెండు రకాల Motivations, ఆ Motivationsకి రెండు రకాల మేనేజర్లు వుంటారు. ఒకరు ఉద్యోగలపై అపనమ్మకంతో, బెదిరిస్తూ, వారిపైన నిఘా వేస్తూ, ప్రతి తప్పుకీ ఒకరిని బాధ్యులని చేస్తూ, వారిని దండిస్తూ వుంటాడు. మరో రకం మేనేజర్ ఉద్యోగులతో చనువుగా వుంటూ, వారి ఇబ్బందులను కష్టాలను అర్థం చేసుకుంటూ, వాటిని తప్పిస్తూ వారి అభిమానాన్ని సంపాదించి తద్వారా ఫలితాలను రాబడ్తాడు. ఇందులో ఏది సరైనది, ఏది కాదు అని చర్చించడం కన్నా ఏది ఏ సందర్భానికి సరిపోయేదో తెలుసుకోని ఆ విధానాన్ని అవలంబించడం ఉత్తమం. ఈ సినిమాలో కనిపించే ఇద్దరు నాయకులు ఈ రెండు విధానాలకు ప్రతీకలుగా నిలుస్తారు. డావెన్ పోర్ట్ Y Type Manager అయితే సావేజ్ X Type Managerగా కనిపిస్తాడు.

ప్రత్యేకించి సావేజ్ ప్రదర్శించే నాయకత్వ లక్షణాలు విలక్షణమైనవిగా కనిపిస్తాయి. 12 Angry Menలో కనిపించే నాయకుడికి భిన్నంగా ఇక్కడ అతనికి పదవి ద్వారా అధికారం లభిస్తుంది. ఆ అధికారాన్ని ఉపయోగించి, అప్పటి వరకూ స్తబ్దుగా పడివున్న టీమ్ లో అలజడి/వ్యతిరేకత సృష్టించడం ద్వారా Charismatic Leaderగా ఎదిగే విధానం ఆసక్తికరంగా సాగుతుంది. అతను ప్రదర్శించే నాయకత్వ లక్షణాల గురించి టూకీగా –

First Strike on Culture

నాయకుడిగా తొలి అడుగులోనే అప్పటివరకు వున్న Culture ని మార్చే ప్రయత్నం చేస్తాడు సావేజ్. అతను అధికారిగా నియమించబడిన యూనిట్ లోకి అడుగుపెట్టగానే సెక్యూరిటీ అతని వివరాలు అడగకపోవటం, యూనిఫార్మ్ విషయంలో శ్రద్ధ లేకపోవటం, Discipline లేకపోవటం వంటి అంశాలను మొదటి టార్గెట్ గా చేసుకుంటాడు. Culture ని మార్చడం ద్వారా మార్పు మొదలవబొతోందని స్పష్టంగా చెప్తాడు.

Creating Tension & Conflict

మొదటిసారి టీమ్ తో మీటింగ్ నిర్వహించినప్పుడు సావేజ్ స్పష్టంగా తన అసంతృప్తిని తెలియజేస్తాడు. తాను చెయ్యబోతున్న మార్పులను తెలియజేస్తూ, అందుకు సిద్ధంగా లేని వాళ్ళని టీమ్ నుంచి వైదొలగమని చెప్తాడు. అతని కింద పనిచేస్తున్న వుద్యోగులతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ –“Do or Die” అనే సందేశాన్ని ఇస్తాడు. ఇలాంటి Tension మొదట్లో అలజడిని, వ్యతిరేకతని సృష్టించినా తరువాత అదే అతని విజయానికి కారణం అవుతుంది.

Charismatic Leadership

ఇందులో నాయకుడు ప్రదర్శించే Charisma మనం అర్థం చేసుకునే Charisma కి భిన్నంగా వుంటుంది (Unconventional and Radica). అందరూ వ్యతిరేకించే లక్షణాలను ప్రదర్శించినా అదే అతని Charisma గా మార్చుకుంటాడు. టీమ్ లో అందరూ అతని గురించే మాట్లాడుకునేలా చేసి తద్వారా Popularity సంపాదిస్తాడు.

Identifying Change Leaders

తను తీసుకురావాలనుకుంటున్న మార్పులను ముందుకు తీసుకెళ్ళే నాయకులను తనకింద తయారుచేసుకోవడం ఎంత ముఖ్యమో సావేజ్ కి తెలిసినట్లే అనిపిస్తుంది. అందుకే నయానో, భయానో కొంతమంది ఉపనాయకులను తయారు చేసుకుంటాడు. Potential వుండీ వేరే పనిలో మిగిలిపోయిన వారిని  వారికి సరిపోయే పదవులోకి మార్చడం ద్వారా తాను కోరుకున్న Change Leaders ని తయారు చేస్తాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు వున్నా ముఖ్యంగా మనం గమనించాల్సింది సావేజ్ ప్రదర్శించే Unconventional, Radical, Charismatic leadership. అయితే ఇలాంటి నాయకుడు ప్రతి సందర్భాలలో విజయం సాధిస్తాడని చెప్పడానికి లేదు. కొన్ని అనువైన (Appropriate) పరిస్థితులలో మాత్రమే ఇలాంటి నాయకత్వం ద్వారా విజయం సాధించవచ్చని గమనించాలి. అంతే కాదు ఇలాంటి లక్షణాలను ప్రదర్శించడం ఎంత Stressతో కూడుకున్న పనో చివర్లో Stress వల్ల కుప్పకూలిపోయే సేవేజ్ ని చూసి అర్థం చేసుకోవచ్చు.

Cinema: 12 O Clock High

Cast: Gregory Peck, Hugh Marlowe, Garry Merrill

Direction: Henry King

Production: Darryl F. Zanuk

Management Lessons: Charismatic Leadership, X Manager – Y Manager, Change Management

5 Comments
  1. SHAFI March 18, 2012 /
    • prasad March 19, 2012 /
    • venkat March 29, 2012 /
  2. Indian Minerva March 22, 2012 /
  3. kishore raja anumula June 8, 2012 /