Menu

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: 12 Angry Men

మేనేజ్మెంట్ పాఠాల చెప్పే సినిమాల గురించి ఎక్కడ ప్రస్తావించినా ఈ సినిమా పేరు వినపడకుండా వుండదు. ఎన్నో మేనేజ్మెంట్ ట్రైనింగ్లలో, వర్కషాప్ లలో, ఎంబీయే కాలీజీలలో ఈ సినిమాని ఒక కేస్ స్టడీగా ప్రదర్శించడం నాకు తెలుసు. ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగుతూనే, అంతర్లీనంగా Leadership పాఠాలు బొధించే ఈ సినిమాని సాధారణ ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా చూసేట్లు వుండటమే అందుకు కారణం అనుకుంటాను.

1957లో నిర్మాణమైన ఈ చిత్రం Reginald Rose రాసిన ఒక నాటకం ఆధారంగా రూపొందించబడింది. పన్నెండు మంది జ్యూరీ సభ్యులు ఒక Trail Roomలో ఒక కేసు గురించి చర్చించడమే మొత్తం సినిమా కథ. ఒక టీనేజ్ కుర్రవాడు అతని తండ్రిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అందుకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోయినా వారి మధ్య వాగ్వివాదం విన్నవారు, దూరం నుంచి పరిగెడుతున్న రైలు పెట్టల సందులలో నుంచి చూసిన వ్యక్తి మినహా సాక్షులు వుండరు. అతను హంతకుడే అని దాదాపు నిర్ధారణ అయిపోయిన సందర్భంలో ఈ పన్నెండు మంది జ్యూరి నిర్ణయాధికారం ఇస్తారు. ముద్దాయి హంతకుడని జ్యూరి నమ్మైతే అతనికి మరణశిక్ష తప్పదని మెలిక పెడతారు.

మంచి ఎండాకాలం ప్రభావానికి వేడెక్కిన గదిలో చర్చ మొదలౌతుంది. అంతా ఏకపక్షంగా వున్న కేసు విషయంలో చర్చించడానికి ఏమీ లేదనీ ముద్దాయి హంతకుడే అని పదకొండు మందు భావిస్తారు. అందరిలొ ఒక్కేఒక్కడు అందుకు వ్యతిరేకంగా ఒక వేళ ముద్దాయి నేరస్థుడు కాడేమో అన్న అనుమానాన్ని లేవనెత్తుతాడు. ఆ ఒక్క వ్యక్తి మిగిలిన పదకొండు మందిని ఎలా తనవైపుకి తిప్పుకున్నాడు అన్నది మిగతా కథ.

మేనేజ్మెంట్ పాఠాలు

కథ విన్న ఎవరికైన ఈ సినిమాలో Negotiation Skills, Persuasion వంటి విషయాలు నేర్చుకోవచ్చని అర్థమైపోతుంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నొ విశ్వవిద్యాలయాలలో ఈ సినిమాని Negotiation Skills నేర్పించడానికి వాడతారు. ఆ విషయాన్ని అలా పక్కన పెడితే ఈ సినిమాలో మరీ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది – LEADERSHIP (నాయకత్వ లక్షణాలు) గురించి.

Leading a diversity

పైన ప్రస్తావించిన జ్యూరీని గమనిస్తే ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. చివరిలో పలకరించుకునే ఇద్దర్ని మినహాయిస్తే సినిమా మొత్తం మీద వాళ్ళలో ఎవరికీ ఒకరికొకరికి తెలియదు. కనీసం సినిమా అంతా పేర్లు కూడా చెప్పరు. అందులో ఒక ఫోర్ మాన్, బ్యాంక్ క్లర్క్, స్టాక్ బ్రోకర్, బిజినెస్ మాన్, పెయింటర్, సేల్స్ మాన్, ఆర్కిటెక్ట్, గెరాజ్ ఓనర్ ఇలా ఒకదనితో ఒకటి సంబంధం లేని వృత్తివ్యాపారాలలొ వుంటారు. ఇలాంటి ఒక వైవిధ్యమైన groupకి నాయకత్వం వహించడం ఈ కథానాయకుడు సాధించే విజయం. సరిగ్గా ఇలాంటి సందర్భాలే మేనేజర్ల నిజ జీవితంలో కూడా ఎదురౌతుంటాయి. ఒకదానికొకటి ఏమాత్రం పొంతన లేనివాళ్ళు ఒక టీమ్ లో వుండి, వారి వారి దృక్కోణం (perspective) నుంచి మాట్లాడటం వల్ల టీమ్ బలహీనపడుతుంటుంది. ఇలాంటి సందర్భాలలోనే అందరినీ ఒక తాటి పైన నడిపించగల నాయకుడి అవసరం కనపడుతుంది.

Title no source of Leadership

ఇందులో నాయకత్వం నెరిపే కథానాయకుడు (జ్యూరర్ నెం. 8) ఏ పదవి అడ్డం పెట్టుకొని రాడు. ఆ జ్యూరీలో అతనికి స్థానం మిగతా అందరితో సమానమే తప్ప అతనేమో నియమించబడ్డ నాయకుడు కాదు. చర్చ ముందుకు సాగుతున్నప్పడు క్రమంగా అతను తన శక్తి సామర్థ్యాలతో నాయకుడి స్థానాన్ని ఆక్రమిస్తాడు. తాను నాయకుడు అయిన విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించడు. చాలా మంది మేనేజర్లలో Designation ఆధారంగా నాయకత్వం వస్తుందన్న అపోహ వుంటుంది. నాయకుడు కావాలంటే పదవులతో పనిలేదని నిరూపిస్తుంది ఈ సినిమా.

Unclear Information leads to decision making

ముద్దాయి నేరస్థుడు కాదేమో అన్న అనుమానం మీదే చర్చ మొత్తాన్ని నడుపుతాడు జ్యూరర్ నెం. 8. అందుబాటులో వున్న సాక్షాధారాలు చాలా పరిమితంగా వుంటాయి. ఇలాంటి సందర్భంలో ఒక నిర్ణయానికి రావటం అంత సులభంకాదు. ఒక వేళ అతను నేరస్థుడు కాకపోతే పర్యవసానం ఎంత ఘోరంగా వుంటుందో చెప్పడం ద్వారా (కథా) నాయకుడు మిగిలినవారి ఆలోచనలను రేకెత్తిస్తాడు. ఎన్నో బిజినెస్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇలాంటి సందర్భాలు ఎదురౌతాయి. ఒక్క తప్పు నిర్ణయం ఘోరమైన వైఫల్యాలకు దారి తీయవచ్చు. నిర్ణయం తీసుకోడానికి అవసరమైన సమాచారం పూర్తిగా వుండక పోవచ్చు. అలాంటి సందర్భంలోనే నాయకుడి అవసరం, ఆ నాయకుడు కేవలం ఘోర వైఫల్యాన్ని, పరిమితంగా వున్న సమాచారంలో వున్న లోతుపాతుల్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఇందులో బోధించబడింది.

Influencing others

ఈ విషయంలో ప్రత్యేకించి చెప్పేదేమీలేదు. సినిమా కథంతా ఒక్క వ్యక్తి పదకొండు మందిని ఎలా తన వైపుకి తిప్పుకున్నాడనేదే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మొదలు పెట్టినప్పుడు అందరూ వ్యతిరేకించిన విషయాన్ని ఒక్కొక్కరుగా ఒప్పుకోవడం మొదలు పెడతారు. ఆ వరస గమనిస్తే కథా నాయకుడు అందరికన్నా Loose Link ఎక్కడ వుందో గమనించి వాళ్ళని తనకు సమర్థించేలా చేసుకుంటాడు. క్రమ క్రమంగా Created & Managed Tension ప్రవేశపెట్టి అందరినీ తనవైపు తిప్పుకుంటాడు. ఒక నాయకుడికి వుండాల్సిన బలమైన లక్షణాల్లో ఇది ఒకటి.

Communication & Negotiation

ఇవి కూడా ప్రస్ఫుటంగా కనపడే పాఠాలు. Enquiry led dialogue, Effective listening, reasoning, humility, empathy వంటి లక్షణాలు Communication  & Negotiation లో ఎంత ముఖ్యమో ప్రత్యక్షంగా చూపుతుందీ చిత్రం.

చూస్తున్న కొద్దీ కొత్త కొత్త పాఠాలు నేర్పే ఈ సినిమా ప్రతి సంస్థలో, ప్రతి ఉద్యోగికీ ముఖ్యంగా ప్రతి మేనేజర్ కి చూపించాల్సిన సినిమా.

 

Cinema: 12 Angry Men

Cast: Henry Fonda, Lee. J. Cobb, E.G. Marshall etc.

Direction: Sidney Lumet

Production: Henry Fonda, Reginald Rose

Management Lessons: Communication & Negotiation Skills, Leadership, Decision Making

 

 

4 Comments
  1. Vennaravi March 13, 2012 /
  2. chandra sekhar b.s. March 26, 2012 /
  3. Rajesh December 17, 2013 /
  4. Vittal Chakravarthyr April 14, 2017 /