Menu

అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ సీక్రెట్ ‘ఏజంట్ వినోద్’

విచ్చినమైన రష్యానుంచీ ఒక సూట్ కేస్ న్యూక్లియర్ బాంబ్ ఓపన్ మార్కెట్ లోకి వచ్చింది. అంతర్జాతీయ టెర్రరిస్ట్ ముఠాలన్నిటికీ అది కావాలి. అది ఎవరి చేతిలో పడినా ఒక మహావిస్ఫోటనం తధ్యం. ఒక మహానగరంలో మంటలు రేగడం ఖాయం. కొన్ని లక్షలమంది ప్రజల ప్రాణాలు పోవడం ఖచ్చితం. ఈ ప్రమాదాన్ని ఆపాల్సిన బాధ్యత భారతీయ ‘రా’ ఏజంట్ వినోద్ ది. తొమ్మిది దేశాలు, ఎన్నో ప్రయాణాలు, మరెన్నో ప్రమాధాల నుంచీ తప్పించుకుని ఆ బాంబుని కనుక్కుని అది ఢిల్లీలో పేలేలోపు డిఫ్యూజ్ చెయ్యాలి. అది మిషన్. ఆ మిషన్ ఎలా చేశాడు అనేది సైఫ్ అలీఖాన్ “ఏజంట్ వినోద్” సినిమా.

ఇప్పటికే జేమ్స్ బాండ్ సినిమాలు, మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ చూసేసినవాళ్ళకు ఇదొక ఇండియన్ వర్షన్ తీసే ప్రయత్నంగా కనిపించినా, ఒక భారతీయ సీక్రెట్ ఏజెంట్ సినిమాగా ఇదొక ముఖ్యమైన ప్రయోగంగా గుర్తించక తప్పదు. ప్రొడక్షన్ వాల్యూపరంగా, యాక్షన్ సీస్వెన్సెస్ పరంగా అంతర్జాతీయ యాక్షన్ సినిమా స్థాయిలో ఈ చిత్రం ఉంటుంది. ద్వితీయార్థం వరకూ కొంత గజిబిజి పజిల్ లాగా సాగే ఈ సినిమాలో కొంత ఎమోషనల్ కనెక్ట్ తక్కువగా అనిపించినా, ద్వితీయార్థానికొచ్చే సరికీ అటు సైఫ్-కరీనాల మధ్య ఉండే ప్రేమ కథ, స్పై థ్రిల్లర్ అసలు కథా పాకానపడి ఆసక్తిని కలిగిస్తాయి.

నిస్సందేహంగా ఒకసారి చూడొచ్చు. చూడండి.

One Response
  1. వెంకట్ ఉప్పలూరి July 2, 2012 /