Menu

Monthly Archive:: March 2012

థ్రీ (3)

కొలవెరి డి” పాటతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా, కమల్ హాసన్ కూతురు శృతి హాసన్, రజనీకాంత్ అల్లుడు ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించగా రజనీకాంత్ కూతురు ఐశ్వర్య మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న సినిమాగా కూడా గత కొన్నాళ్ళుగా అందరినోటా వినిపిస్తోన్న “3(థ్రీ)” సినిమా గత వారం విడుదలైంది. ’3’ సినిమా పేరుకు తగ్గట్టుగానే రామ్ (ధనుష్) మరియు జనని (శృతి హాసన్) అనే యువజంట జీవితంలో మూడు దశల్లో జరిగిన వివిధ అంశాల కలబోతే

వై దిస్ గోల “వెర్రి” థ్రీ?

గత కొంతకాలంగా వేలంవెర్రిలా పాకిన కొలవెరి పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. అలాంటి పాటను రూపకల్పన చేసినవాళ్ళు తీసిన సినిమా అంటే అంచనాలు వుండటం సహజం. అందునా ఈ మధ్యకాలంలో వైవిధ్యానికి మారుపేరుగా నిలిచిన తమిళ పరిశ్రమ చిత్రం కావడంతో ఆ అంచనాలు మరో నాలుగింతలయ్యాయి. అయితే నిన్న విడుదలైన “3” చిత్రం ఆ అంచనాలను అందుకోలేక చతికిలపడింది. గత కొంతకాలంగా తమిళ సినిమాని తెగపొగిడేసిన మా లాంటి వారి కళ్ళు తెరిపించేలా

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: Kung Fu Panda

సినిమాల ద్వారా చదువులు చెప్పచ్చని అనగానే అదేదో సీరియస్ సినిమాలతోనే సాధ్యం అని అనుకోకూడదు. సరదాగా సాగిపోయి, బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాల్లో సయితం ఎన్నో పాఠాలు వుంటాయి. ఎటొచ్చీ అవి తెలుసుకోడానికే కొంత ప్రయత్నం చెయ్యాలి. అలా సరదాగా సాగే పిల్లల సినిమా “కుంగ్ ఫూ పాండా” చిత్రంలో వున్న మేనేజ్మెంట్ పాఠాలను తెలుసుకునే ప్రయత్నమే ఈ వారం వ్యాసం. కుంగ్ ఫూ పాండా కథ చాలా మందికి తెలిసే వుంటుంది. Underdog తరహాలో సాగే

హంగర్ గేమ్స్

మీరు పుస్తకాల పురుగయితే ఈ పాటికి మీరు “హంగర్ గేమ్స్” గురించి వినే ఉంటారు. పిల్ల బచ్చాగాళ్ల కోసం రాసిన ట్వైలైట్ సీరీస్ తర్వాత అంత పెద్ద పాపులారిటీ పొందిన బుక్స్ గా ఈ హంగర్ గేమ్స్ సీరీస్ ని చెప్పుకోవచ్చు. ఈ పుస్తకాల ఆధారంగా రూపొందించిన “హంగర్ గేమ్స్” సినిమా చూడడానికి నిన్న సినీ మాక్స్ కి వెళితే అక్కడంతా ఈ పిల్ల బచ్చాగాళ్లే. అంతే కాదు, సినిమా అయిపోయాక విజిల్స్ వేసి చప్పట్లు కొట్టి

ఈ రోజుల్లో…

ఈ రోజుల్లో తెలుగు సినిమా చూడడమంటే పాపమయిపోయింది. డబ్బులిచ్చి మరీ తలనొప్పి తెచ్చుకోవడమంటే తెలుగు సినిమా చూడడమే! అయినప్పటికీ తెలుగు వాళ్లకి వినోదం కోసం సినిమా తప్ప మరో గతి లేకపోవడంతో సినిమాలు ఆడేస్తున్నాయి. ఒక మోస్తరుగా ఉంటే చాలు హిట్లు సూపర్ హిట్లూ అయిపోతున్నాయి కూడా. ఇలాంటి పరిస్థుతుల్లో ప్రేక్షకులు కూడా కాస్తా తెలివి మీరిపోయారని చెప్పాలి. తలనొప్పి ఎలాగూ తప్పదు, డబ్బులు ఎలాగూ వృధా అని పక్కాగా తెలిసిపోయినప్పుడు అదేదో పెద్ద (అంటే భారీ