Menu

Monthly Archive:: January 2012

Agneepath – 2012

ఒక కుర్రాడు. పసిప్రాయంలోనే తీరని అన్యాయానికి గురవుతాడు. అయినవాళ్ళను పోగొట్టుకుంటాడు. అలా పోగొట్టుకోడానికి కారణభూతమైన ఒక వ్యక్తి ఉన్నాడని తెల్సుకుంటాడు. పగే ఊపిరిగా, ప్రతీకారమే జీవితాశయంగా పెరిగి పెద్దవాడవుతాడు. చెడుమార్గాలను అనుసరిస్తాడు. ఎవరన్నా ప్రశ్నిస్తే, “నేరం నాది కాదు. లోకానిది.” అంటాడు. వెతుక్కుంటూ వెళ్ళి తనకు అన్యాయం చేసిన వ్యక్తిని చీల్చిచెండాడుతాడు. ది ఎండ్. ఇదే కథాంశంతో వచ్చిన బాలీవుడ్ చిత్రాలకు కొదువ లేదనుకుంటాను. నాకున్న మిడిమిడి జ్ఞానంతోనే ఒక రెండు సినిమాల పేర్లు చటుక్కున గుర్తొస్తున్నాయి.

ఎడారి వర్షం: దోషం నాది కాదు, మూలానిది!

ఏం చెప్పదల్చుకున్నాడో రచయిత ముందే నిక్కచ్చిగా నిర్ణయించేసుకోవడం వల్ల పుట్టే అసంబద్ధమైన కథల కోవకి చెందినది దేవరకొండ బాల గంగాధర తిలక్‌ ‘ఊరిచివర ఇల్లు’. పరాయి జీవితమైనా దాన్నొక సహానుభవంగా కాకుండా స్వకపోల కల్పితంగా ‘సృజిస్తే’ కొన్ని అష్టావక్ర కథలు పుట్టుకొస్తాయి. తన ఆధునిక కవిత్వానికి ఆపాదించుకున్నట్లే, కథలకు కూడా ప్రబోధించే తత్త్వాన్ని ఎక్కించాలని ‘బాధ్యత’తో భావించినందువల్లనేనేమో తిలక్‌ కథలు చాలావరకూ పైకోవకి చెందుతాయి. ఇక ‘ఊరి చివర ఇల్లు’ విషయానికొస్తే, ఈ కథకి Third person

The Devil’s Eye (1960) – Ingmar Bergman

సైతాను ఆఫీసు గదిని, అందులో ఉన్న లైబ్రరీ ని చూసారా మీరెప్పుడైనా? సైతాను దూత ఒకటి – ఇద్దరు ప్రేమికుల మధ్య తగువులు పెట్టేసి, అక్కడే ఒక మూలన నిలబడి ముసిముసి నవ్వులు నవ్వడం చూసారా? ఇంతటి దుష్ట దూతనూ, “వైన్ బాటిల్ కప్ బోర్డులో ఉంది. కాస్త తీసిస్తావా?” అని అడిగి, అది లోపలి వంగగానే, తోసేసి, కప్బోర్డు మూసేసి తాళం పెట్టేసిన వాడిని? సైతాను “డబ్బూ పోయే శనీ పట్టే” అన్న చందాన దిగులుగా

Saturday Screenwriting Workshop

Ramanaidu Film School announces a perfect cure for the writer’s block – a specially designed Saturday Screenwriting Workshop.Every Saturday from the 11th of February2012. The Saturday Screenwriting Workshop, an initiative of the Ramanaidu Film School,Hyderabad brings professional screenwriting tools and techniques to young professionals interested in making a career in the media and entertainment industry.This

Sai Paranjape’s Saaz

“Human relationships are my forte.” అని ఉద్ఘాటించగల  ప్రతిభావంతురాలైన దర్శకురాలు, సినీ వినీలాకాశంలో నేపథ్యగాయనీమణులుగా తారాస్థాయిని చేరటానికి ఇద్దరి తోబుట్టువుల మధ్య జరిగిన అప్రకటిత స్పర్థను తెరపై ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంది? సాయి పరాన్‍జపే ’సాజ్’లా ఉంటుంది. సంగీతభరితమై మనసు లోతుల్ని చూపేదిగా  సాగుతుంది. కళాకారుల్లోని మానవీయ కోణాలకు అద్దం పడుతుంది. కళ మనిషిని ఎంత ఉన్నతస్థాయికి తీసుకెళ్ళినా, మనిషి మనిషిలా మిగలడానికి మరెన్నో కావాలని గుర్తుచేస్తుంది. కథ:సినిమా మొదలయ్యే సరికి బన్సి (షబానా ఆజ్మీ)