సంఘర్షణ-అభినంధించదగ్గ ప్రయత్నం

allari-naresh-sangharshana-movie-trailers

జీవితం రణరంగం అనుకుంటే బ్రతకడానికి ప్రతిరోజు పరిస్థితులతో సంఘర్షణ తప్పదు అనే సారాంశంతో తీయబడిన సినిమా “సంఘర్షణ”. ప్రయాణం అద్భుతంగా మొదలు పెట్టిన దర్శకుడు సముద్రఖని కి గమ్యం ఏమిటో తెలియక పోవడం తో రెండవ అర్థభాగం అయోమయంగానే ముగించాడు.కానీ సినిమా ముగిసేసరికి ప్రేక్షకులకు మనం కూడా మనషులమే,సాటి మనషులకు సాయపడటమే మానవత్వం అనే విషయం మళ్ళి గుర్తుకువస్తుంది,ఎన్ని రోజులు జ్ఞాపకం వుంచుకుంటారో మాత్రం తెలియదు.

కథలోకి వెళితే కుమార్ (శశి),నరేష్ అజ్ఞాత ప్రదేశం లో నుండి పారిపోయి వచ్చి హైదరాబాద్ లో స్నేహితుని రూం లో కాలం గడుపుతూ ఇరుగు పొరుగు వారికీ సహాయ పడుతూ వాళ్ళ ఇంటి ఓనర్ దృష్టిలో మంచివాళ్ళు అనిపించుకుంటారు . ఈ క్రమం లో తమ ఇంటి ముందు ఉంటున్న స్వాతి తో శశి,పెట్రోల్ బంకు లో పని చేస్తూ అక్కడ పని చేసే నివేద తో నరేష్ ప్రేమలో పడతారు.వీరిని వెతుకుంటూ వచ్చిన ఒక బ్యాచ్ నుండి త్రుటిలో తప్పించుకుంటారు. ఇంటి ఓనర్ ఎవరు మీరు అని బ్యాచ్ ని ప్రశ్నించడం తో మీ ఇంటిలో ఈన్నాళ్ళు వుంటున్నవారు పిచాసుపత్రి నుండి తప్పించుకొని వచ్చిన పిచ్చివారు అని చెప్పడం తో ప్రథమార్థం ముగుస్తుంది.

వారు నిజంగా పిచ్చివారా, ఎటువంటి పరిస్థితులతో పిచ్చాసుపత్రి కి రావలసి వచ్చింది , అక్కడి నుండి పారి పోయీ ఏమి సాదించారు అనేది ద్వితియార్థం లో చెప్పపడుతుంది. కథ పకడ్బందిగా ఉన్నప్పటికీ ద్వితియార్థం కథనం తేలి పోవడం తో కాస్త బోర్ కొడుతుంది.కానీ నరేష్ కోసం వెళ్ళిన వారు అతని నిడివి మాత్రం తక్కువైనప్పటికీ నరేష్ నటనను అభినందించకుండా ఉండలేరు.

ఫస్ట్ ఆఫ్ లో శశి చెప్పిన డైలాగ్స్ అందరిని ఆలోచించేలా చేస్తాయి. చిన్న చిన్న మానసిక సమస్యలు ఉన్నవారిని మనం పిచ్చివారిగా పరిగణిస్తూ సమాజం నుండి దూరం చేస్తున్నాం. అనే అంశాన్ని సూటిగా చెప్పడం లో మాత్రం దర్శకుడు సపలం అయ్యాడు.మానవత విలువలను పెంపోదించడం కోసం చేసిన ఈ ప్రయత్నం ను అభినంధించాలనుకుంటే మాత్రం సినిమా చూడవచ్చు.

–శ్రీనాథ్ బడినేని

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

1 Comment to “సంఘర్షణ-అభినంధించదగ్గ ప్రయత్నం”

  • ANNNA GAARU CINEMA CHAAALAA BAGUNDI,
    MUKYAMGAAAA DIRECTOR CHEPPALANUKUNNA CONCEPT(POINT) CHAAALAA CHAAALAA BAGUNDI,

    ACTORS BAAGA BHAAVODVGAVMTHO CHESHAAARU

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories