జానపద హీరో ‘రాజన్న’

Rajanna Movie Wallpapers

చాలా రోజుల తరువాత తెలుగులో ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మిగిల్చిన చిత్రం ‘రాజన్న’. ఒక కాల్పనిక జానపద హీరో కథని చారిత్రక నేపధ్యంలో సృష్టించి ఆ కాలపు చరిత్రతోపాటూ, స్థానిక సంస్కృతిని, నమ్మకాలను, జనపద ఒరవడులను అల్లుకుంటూ హృద్యమైన కథ చెప్పడం అభినందించదగ్గ ప్రయత్నం. ప్రధానకథ ఊరిమంచి కోసం ప్రధానమంత్రి నెహ్రూకి దొరసాని దౌర్జన్యాల్ని వివరించడానికి చిన్నారి మల్లమ్మ (బేబి ఆనీ) చేసే అద్వితీయ ప్రయాణానిదే అయినా, ఉపకథగా మల్లమ్మ తండ్రి రాజన్న(నాగార్జున) సాహసగాధ జోడించేసరికీ ఉపకథే అసలు కథగా తయారయ్యింది. ఈ స్క్రీన్ ప్లే తికమకని క్షమించగలిగితే ఈ సినిమాలో ప్రేమించడానికి చాలానే ఉన్నాయి. మంచి నటన, రక్తికట్టేసన్నివేశాలు, ఆహ్లాదంతోపాటూ ఉత్తేజపరిచే పాటలూ- సంగీతం వీటిల్లో కొన్ని. అప్పుడప్పుడూ చాంతాడంత డైలాగులూ, నిదానంగా సాగే దృశ్యాలు ఉన్నప్పటికీ సినిమా మొత్తం పూర్తయ్యాక “హమ్మయ్య ఎంతకాలానికి తెలుగులో గొప్ప సినిమా కాకపోయినా ఒక మంచి కథ ఉన్న సినిమా వచ్చింది” అనిపించక మానదు.

 

ఇప్పటికే తెలుగు సినిమా అనవసరపు వేగానికి, స్థానికతలేమికి, సామాజికసాంస్కృతిక దిగజారుడుతనానికి, అర్థంపర్థం లేని కథలకి, ఎందుకున్నారో తెలీని కామెడీ పాత్రలకి, పైటజారుడు హీరోయినిజానికి అలవాటుపడిన చాలా మంది తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా నచ్చకపోవడం అర్థంచేసుకోతగ్గ పరిణామం. కాబట్టి అలాంటి ప్రేక్షకుల సలహా మీరు వినేవాళ్లైతే ఈ సినిమాకు దయచేసి వెళ్ళకండి. సినిమా ఇచ్చే కిక్కులకు సీట్లమీద గెంతడానికి కాకుండా తెరను తేరిపారా చూస్తూ చారిత్రకజానపదలోకంలోకి ఒక ఎమోషనల్ జర్నీ చెయ్యాలనుకుంటే వెళ్ళండి.

 

నాగార్జున ఇలాంటి సినిమా నిర్మించి (తన పాత్ర నిడివిని పట్టించుకోకుండా) నటించడం అభినందించదగ్గ విషయం. దర్శకుడు కథకుడు విజయేంద్రప్రసాద్ ఈ చిత్రంతో విజయం సాధించాడనే చెప్పాలి. కాకపోతే తనయుడు రాజమౌళి కాంట్రిబ్యూషన్ తో తెరపై హింస మితిమీరిందేమో అనిపించకమానదు. ఏది ఏమైనా…రాజన్న నాకు నచ్చింది.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

K మహేశ్ కుమార్

రచయిత:

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లి. పెరిగింది కుప్పం, పీలేరు మరియు వాయల్పాడు గ్రామాలలో. ఆరోతరగతి నుండీ 'నవోదయ విద్యలయం' లో చదివా. ఈ సెంట్రల్ స్కూల్ పుణ్యమా అని హర్యాణా లోని హిస్సార్ జిల్లాలో రెండు సంవత్సరాలూ, అనంతపురం జిల్లా లేపాక్షి లొ రెండు సంవత్సరాలూ విద్యగడించి, స్కూలు (12th class) ముగిసే సరికీ కాస్త బయటి ప్రపంచంతోపాటూ హిందీ భాష కూడా వంటబట్టింది. ఇక నా జివితంలో సినిమాలంటారా! తమిళ నాడు బార్డరు మా పక్కనే కాబట్టి చిన్నప్పుడే తెలుగు సినిమాలతో పాటూ వాటినీ సాధించాం. అప్పట్లో మనం చూడని సినిమా లెదని నా నమ్మకం. "ఆ సినిమా బాగాలేదు" అని ఎవరైనా అంటే "ఎందుకు బాగాలేదో చూద్దాం" అని వెళ్ళే రకంగా మనకు ప్రసిద్ధి. ఇలా సినిమాలపై దండయాత్ర సాగిస్తుండగానే, కాలేజి చదువులకని మైసూర్ 'రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్' లో చేరటమూ, ఆటోమేటిక్ గా అక్కడి Film Club లో చేరడమూ 1994 లో జరిగిపోయాయి. అప్పటికే తెలుగు,తమిళ సినిమాకు దాస్యం చేస్తున్న మన బుర్రకు అక్కడే భారతీయ, ప్రపంచ సినిమాలు పరిచయమై, దాస్యాన్నితోలగించి కొంత మంచి సినిమా జ్ఞానాన్ని ప్రసాదించాయి. ఇలా సంపాదించిన సినిమా జ్ఞానంతో "ఇక సినిమాలు తియ్యడమే జీవిత లక్ష్యమ్" అనుకుని FTII కలలుకనగా, ఏదో సమస్య వలన ఆ సంవత్సరం అక్కడ "0 year" అయ్యి కూర్చ్ఘుంది. ఏమైతేనేం అని హైదరాబాద్ సెంటల్ యూనివర్సిటీ లో 'MA Communication' 2000 సంవత్సరంలో ముగించి కనీసం "డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్" అనిపించేసాం. ఆతరువాత టివీ చానళ్లలో, సిరియల్స్ లో కొంత 'ప్రయత్నం' చేసినా నిరాశ తప్ప నా ఆశను సాధింఛే మార్గం దొరకక, ఆర్ధికంగా కూడా గిట్టుబాటుకాక `Social/Development Communication Consultant' గా అవతారమెత్తి ఇప్పటిదా బ్రతుకుదెరువు కానిస్తూ, సినిమా కళాపోషణ చేస్తూ కలలు కంటున్నాను. అదేదో కృష్ణవంశి సినిమాలో సంగీత అన్నట్టు మనమూ "ఒక్క ఛాన్సిస్తే" అంటూ నవతరంగంలో చేరి "ఆ చాన్స్ మనమే కల్పింఛుకుందాం" అనే స్థితికి చేరి ఎదురుచూస్తున్నాం.

10 Comments to “జానపద హీరో ‘రాజన్న’”

  • abbaa mahesh kumar garu NAKU NACHINDI ani ennalaku nnarandii love u r review
    cinema lo ???? vaddu chepadaniki me ledu ,

    mahesh garu me shortfilm epudu release chestunaru sir

  • >> “ఇప్పటికే తెలుగు సినిమా అనవసరపు వేగానికి, స్థానికతలేమికి, సామాజికసాంస్కృతిక దిగజారుడుతనానికి, అర్థంపర్థం లేని కథలకి, ఎందుకున్నారో తెలీని కామెడీ పాత్రలకి, పైటజారుడు హీరోయినిజానికి అలవాటుపడిన చాలా మంది తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా నచ్చకపోవడం అర్థంచేసుకోతగ్గ పరిణామం. కాబట్టి అలాంటి ప్రేక్షకుల సలహా మీరు వినేవాళ్లైతే ఈ సినిమాకు దయచేసి వెళ్ళకండి. సినిమా ఇచ్చే కిక్కులకు సీట్లమీద గెంతడానికి కాకుండా తెరను తేరిపారా చూస్తూ చారిత్రకజానపదలోకంలోకి ఒక ఎమోషనల్ జర్నీ చెయ్యాలనుకుంటే వెళ్ళండి”

    సినిమా మీకు నచ్చింది అనటం వరకూ బాగానే ఉంది. మిగిలినవాళ్లు ఎవరి మాట విని వెళ్లాలో, ఎవరి మాట విని వెళ్లకూడదో కూడా మీరే నిర్ణయించటమే బాగాలేదు. మీరు తప్ప మిగిలిన ప్రేక్షకులంతా దద్దమ్మలూ, చవటలూ అని మీ నమ్మకమా?

  • dear abrakadabra eeraga deesaruu superb

  • ika tammareddy bharadwaja laanti vaallu noru musumuntaaremo!

  • సానుకూలంగానో ప్రతీపంగానో సలహా ఇవ్వడానికీ, సిఫారసు చేయడానికే కదా సమీక్షలున్నది. ఆ హక్కు రచయితకి లేదనడం భావ్యం కాదు. ఇది ఏ తరహా సినిమాయో అభివర్ణించడంలో అదొక స్టైల్. మహేష్ గారితో ఏకీభవిస్తున్నాను.

  • రీరికార్డింగ్ తో సినిమా స్థాయిని ఎలా పెంచవచ్చో రాజన్న చూస్తే తెలుస్తుంది..అవకాశం దొరికినప్పుడల్లా కీరవాణి గారు అద్భుతమైన బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు..comercial సూత్రాలకి దూరంగా వున్న కథకి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా మీద వున్న ప్రేమని నాగార్జున గారు చాటుకున్నారు..

  • One thing that stands out like a sore thumb in this film is Keravani’s music. The orchestration is shockingly sub-standard in songs and BGM. What went wrong? If Keeravani is not getting good quality musicians in Hyderabad, he should probably consider recording in Chennai, or atleast get some one who knows how to get better output with Synth. Two thumbs down!

  • రాజన్న సినిమా నాకూ నచ్చింది.
    నా అభిప్రాయం ఇక్కడ.
    http://vivaha-bhojanambu.blogspot.com/2011/12/blog-post.html

  • నాకు సినిమా చాలా బాగ నచ్హింది. చాల రోజుల తర్వాత Theatre కి వెల్లి చూసిన సినిమా.

  • Sorry.. I did not like this movie. Not one bit of it. Even tough it started well it very soon degenerated into one of those “formula’ quickies that our Telugu field is famous for.
    They could have kept the story simple by concentrating on the journey of that little girl from her village to Delhi. That journey itself could have been the metaphor for the Telangana struggle of that times. Instead the movie goes off on a tangent and brings in Nagarjuna into it as a very loud and unconvincing Rajanna and also having a long prologue before the little girl actually starts her journey.
    Rajanna in the background as an unseen mentor, as a myth and role model would have been a powerful symbol instead of the loud portrayal by Nagarjuna.

    Bad production values, overacting, stereotypical portrayals of characters and garbled screenplay make this eminently unwatchable. This looks more like an attempt by Nagarjuna(and Akkineni family) to please the Telangana activists and escape their ire. If so, I hope it served it’s purpose.

    Another sad thing is, I thought I finally found an authentic voice for cinema critique in Navatarangam.com which provided a unbiased and very well analyzed reviews of cinema where all aspects of a movie are reviewed and discussed in an honest way, but this review is making me rethink that. I am sorry for being a little too direct with my comments and if I have hurt anyones feelings here.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories