చారిత్రాత్మకమైన చిత్రమనీ, మామూలు తెలుగు సినిమాలకన్నా ఈ చిత్రం భిన్నంగా ఉందని వెబ్‌సైట్లన్నీ మంచి రేటింగులిచ్చి తెగ పొగిడేశాయనీ, నవతరంగంలో కత్తి మహేష్‌కూడా మంచి కథ ఉన్న సినిమా అని కితాబు ఇచ్చాడనీ, పాటలు సాహిత్యంలోనూ, సంగీతంలోనూ విభిన్నంగా, బాగా ఉన్నాయనీ, నేను చాలా ఉత్సాహంగా ఈ సినిమా చూడడానికి వెళ్ళాను.
నచ్చిన విషయాలు:
చిత్రమంతా హీరో చుట్టూనే తిరగాలనే తెలుగుచిత్రప్రపంచంలో నాగార్జునవంటి స్టార్‌హీరో తాను చిత్రంలో సగంకూడా ఉండని చిత్రంలో నటించడమే కాకుండా, నిర్మించటం
ఒక చిన్నపిల్ల ముఖ్యపాత్రగా ఒక చిత్రాన్ని నిర్మించటం
ఒక ప్రాంతపు చరిత్ర ఆధారంగా, జన జీవితం నేపధ్యంగా తెలుగులో భారీ చిత్రాన్ని తీద్దామని ప్రయత్నించడం
ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ కొత్త కళాకారుల్ని తీసుకోవటం
మల్లమ్మగా యానీ అభినయం (చిత్రమంతా, ముఖ్యంగా అమ్మా, అవనీ పాటలో)
సంగీతపరంగా, సాహిత్య పరంగా బాగున్న పాటలు
నేపధ్యసంగీతం
ఫొటొగ్రఫీ, ఎడిటింగ్ వగైరా సాంకేతిక విభాగాలు
మేలుకోవే చిట్టితల్లి, వెయ్ వెయ్య్, గిజిగాడు తనగూడు…, మరికొన్ని పాటల చిత్రీకరణ
(ముఖ్యంగా వెయ్ వెయ్య్ పాట చిత్రీకరణ ఒళ్ళు గగుర్పొడిచి, చాలాకాలం గుర్తుండే సినిమాటిక్ మోమెంట్. హీరో తానుగా పోరాడకుండా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసే ఈ సన్నివేశం బాగా తీశారు)
నచ్చనివి
చాలా సన్నివేశాలలో కనిపించిన అతి – ముఖ్యంగా రాజన్న బ్రిటిష్ వారిని వ్యతిరేకించిన సన్నివేశం (సగటు భారీ తెలుగు చిత్రం పతాకసన్నివేశంలా ఉంది), రాజన్న ఆఖరు పోరాటం (ఒక్కణ్ణి కాదు, అస్లంఖాన్, వందమందిని పంపించు అన్నట్లుంది), మల్లమ్మ ఢిల్లీప్రయాణం, మల్లమ్మ ఢిల్లీలో పాటపాడే పతాక సన్నివేశం (ఈ సన్నివేశం ప్రారంభంలో హాలులో ప్రేక్షకులు తెగ నవ్వారు)
ఎన్నుకొన్న చారిత్రక నేపధ్యాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం
చాలా సన్నివేశాల మధ్య పొంతన లేకపోవడం
అక్కడక్కడా చేంతాడంత మాటలు, సాగతీతలు.
పాత్రల యాసకు సంబద్ధత లేకపోవటం
చెప్పొచ్చింది: ఉద్దేశమూ, ప్రయత్నమూ అభినందించదగ్గవి. తీసుకున్న చారిత్రక నేపధ్యానికి ఇంకొంత గౌరవమిచ్చి, స్క్రిప్టు, స్క్రీన్‌ప్లేల విషయంలో కొంత నియంత్రణ పాటిస్తే చాలా మంచి చిత్రమయ్యేది; ఇప్పుడు కొన్ని మంచి సన్నివేశాలు, మంచి పాటలు ఉన్న చిత్రం మాత్రమే.
- V. Chowdary Jampala
sivamani says:
movie naku baga nachindhi e lanti movie these guts nag ki mathrame vundhi
srinivas reddy.g. says:
the plot of rajanna is a direct lift from children’s movie ‘I AM KALAM’ AND RAJAMOULI@family just added mass masala and overdose.
V Chowdary Jampala says:
I have seen I am Kalam after seeing this comment. I do not see any similarity between the two films.
ఆ. సౌమ్య says:
ఇంచుమించు ఇలాగే మంచి-చెడులను కలిపి రాసిన నా అభిప్రాయాలు
http://vivaha-bhojanambu.blogspot.com/2011/12/blog-post.html
Anil says:
Logically, movie script is during the period of 1948. But when Nassar has given a Radio to Baby Annie, the songs come from Radio are from Maya Bazaar movie, which was released around 1958.
కొత్తపాళీ says:
జంపాలగారు, మీ బేరీజుతో ఏకీభవిస్తున్నా. కొన్ని మంచి దృశ్యాలు, మంచి పాటలు ఉన్న సినిమాగా మిగిలింది.
వేణూశ్రీకాంత్ says:
Perfect Review జంపాల గారు. చాలా కరెక్ట్ గా రాశారు.
Hari Narayana says:
జంపాల గారు
ఠెలుగు లొ చాలా అరుదుగా వచే ఇలాంటి సినిమాలను ప్రొత్సాహించండి. తప్పులు లేవు అని అనడం లెదు. వాటిని మాగ్నిపై చెయ్యవద్దు. ఆందరిని చూడమని ప్రొత్సాహించండి. మన తెలుగు సినిమా లొ ఇదొక ప్రయత్నం,