Menu

Monthly Archive:: December 2011

The Fall (2006)

దాదాపుగా ప్రతి జీవితంలోనూ వచ్చే మలుపు ఇది. ఆ మలుపు వద్ద, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ మిగల్లేదనిపిస్తుంది. ముందుకు చూడబోతే ఏమీ కనిపించదు, గాఢాంధకారం తప్పించి. అక్కడే ఆగిపోదామంటే ముళ్ళపై నుంచున్నట్టు ఉంటుంది. ఉండలేక, వెళ్ళలేక, నిలువలేక ఉన్న ఆ పరిస్థితుల్లో గుక్కెడు విషం ఇచ్చినవారు కూడా దేవతాసమానులైపోతారు. కానీ చిత్రంగా, అలా విషమిచ్చి చేతులు దులిపేసుకోక, ఒక చిన్న దివిటి వెలగించి మనకేదో కొత్త వెలుగు చూపించేవారు తయారవుతారు. మనం చూడకూడదని కళ్ళు మూసుకున్నా,

ఎవర్ గ్రీన్ హీరోకి అశ్రునివాళి

ఎనభై ఎనిమిది ఏళ్ల వయసులోనూ చలనచిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించి అందులో ప్రధాన పాత్రలు పోషిస్తూ ఎవర్ గ్రీన్ హీరో గా పేరు పొందిన దేవానంద్ ఇవాళ లండన్ లోని ఒక ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా మరణించారు. 1946 లో తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన దేవానంద్ దాదాపు 66 ఏళ్ల పాటు నిర్మాత గా , దర్శకుడిగా, నటుడిగా తన జీవితాన్ని సినిమాకే అంకితం చేశారు. తన కొన ఊపిరి ఉన్నంత వరకూ ఆయన

ఆత్మ ఉన్నకథ ‘మయక్కమ్ ఎన్న’

హాబీఫోటోగ్రఫర్ గా ఉంటూ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా ఒక గమ్యం వైపు ఎదగాలనుకునే ‘కార్తీక్ స్వామినాథన్’ అనే ఒక సాధారణ యువకుడి గతుకులప్రయాణం “మయక్కమ్ ఎన్న” సినిమా పేరే తెలుగులో చెప్పాలంటే ‘ఎందుకీ మత్తు?’. తన సామర్థ్యం తనకే తెలీని మత్తో, కేర్ లెస్ నెస్ మత్తో, సామాజికచట్రలో ఇమిడి ఎగదాలంటే ఏంచెయ్యాలో తెలీని మత్తో, స్నేహాల మత్తో, అర్థంకాని ప్రేమానుబంధాలమత్తొ, తాగుడుమత్తో…చివరికి విజయం మత్తో… మొత్తానికి జీవితం మత్తోగానీ అన్నిటినీ కలగలిపిన ఒక జీరోటూ

సంఘర్షణ-అభినంధించదగ్గ ప్రయత్నం

జీవితం రణరంగం అనుకుంటే బ్రతకడానికి ప్రతిరోజు పరిస్థితులతో సంఘర్షణ తప్పదు అనే సారాంశంతో తీయబడిన సినిమా “సంఘర్షణ”. ప్రయాణం అద్భుతంగా మొదలు పెట్టిన దర్శకుడు సముద్రఖని కి గమ్యం ఏమిటో తెలియక పోవడం తో రెండవ అర్థభాగం అయోమయంగానే ముగించాడు.కానీ సినిమా ముగిసేసరికి ప్రేక్షకులకు మనం కూడా మనషులమే,సాటి మనషులకు సాయపడటమే మానవత్వం అనే విషయం మళ్ళి గుర్తుకువస్తుంది,ఎన్ని రోజులు జ్ఞాపకం వుంచుకుంటారో మాత్రం తెలియదు. కథలోకి వెళితే కుమార్ (శశి),నరేష్ అజ్ఞాత ప్రదేశం లో నుండి