Menu

Monthly Archive:: December 2011

చష్మ్-ఎ-బద్దూర్’ – ఒక ఈలపాట లాంటి సినిమా

గడపదాటుతూనే చూపుడు వేలుకి తొడిగిన కీచెయిన్‍ను గిరగిరా తిప్పుతూ, ఈల అందుకొని,  తెరచిన గేటును అశ్రద్ధగా వదిలేసి, బైక్ ఎక్కి కూర్చొని, నుదుటిపై పడుతున్న జుట్టు అలక్ష్యంగా వెనక్కి తోస్తూ, విలాసంగా బైక్ స్టార్ట్ చేసి, దాని దడ్-దడ్-దడ్ శబ్ధంలో కూడా ఈలను ఆపకుండా దూసుకుపోతూ, దారిన ఎవరన్నా అమ్మాయి కనిపించగానే కాస్త నిదానించి, జుట్టును సవరించుకొని, ఒకసారి ముఖారవిందాన్ని బైక్ అద్దంలో చూసుకొని, నవ్వుకొని, అదే నవ్వును అమ్మాయికేసి చూస్తూ కొనసాగించి, బైక్ మీదే ఏదో

మనిషి లోతుల్ని చూపే ’స్పర్ష్’

గత మూడు రోజుల్లో సాయి పరాన్‍జపేతీసిన మూడు విభిన్న చిత్రాలు చూడ్డం తటస్థపడింది. వాటిలో, ఆవిడకు జాతీయ ఉత్తమ చిత్రం అవార్డునే కాక ఎనలేని గుర్తింపునీ సంపాదించి పెట్టిన సినిమా, ’స్పర్ష్’ ఒకటి. నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ తారాగణం అని నేను ప్రకటించగానే మా అమ్మ “అయితే, కొంచెం ఓపికతో చూడాల్సిన సినిమా అయ్యుంటుంది.” అని అనేసారు. వికిలో చిత్ర వివరాలు చూస్తే కొంచెం భారీ సబ్జెక్ట్ ఉన్న సినిమా అని వెంటనే అర్థమయిపోయింది. ఆ

The Dirty Picture – When Silk is not Silk.

A few weeks ago, I was watching Merchant–Ivory’s early film, Bombay Talkies, starring Sashi Kapoor and Jennifer Kendall. One of the bonus features on the DVD was a documentary, “The Queen of Nautch Girls”, directed and narrated by Anthony Komer, a 30 minute feature on Helen, the original item dance queen. This thoroughly enjoyable, nostalgia

Benegal’s Bhumika

రంగస్థలంపైనో, సినిమా తెరపైనో రంగులు పూసుకొని ఆడి, పాడి, నవ్వి, ఏడ్చి చిత్రవిచిత్ర పాత్రలకు ప్రాణం పోసే కళాకారుల జీవితాలను తరచి చూస్తే ఆ రంగుల వెనుకున్న వివర్ణ జీవితాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. జీవితం పట్ల కొన్ని మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతాయి. అలా ఒక నటి జీవితంలోని విభిన్న కోణాలను అత్యంత హృద్యంగా తెరకెక్కించారు, ’భూమిక-ది రోల్’ అనే సినిమాలో శ్యామ్ బెనిగల్. చిత్ర కథ: దేవదాసి వర్గానికి చెందిన ఒక గాయని మనవరాలు ఉష (స్మితా పాటిల్).

Eternal Sunshine of Spotless Mind

బయట హోరున వాన పడుతుంటే, లోపలెక్కడో, ఆదమరుపుగా కళ్ళు మూసుకొని ఆ చప్పుడు వింటున్నట్టు, కిటికి దగ్గర నించొని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానను రెప్పార్పకుండా చూస్తున్నట్టు, చూరు కింద నిలబడి వాన చినుకులతో ఆడకున్నట్టు, గొడుగేసుకొని సగం తడుస్తూ, సగం తడవకుండా నడుస్తున్నట్టు, రేన్ కోర్ట్ వేసుకొని వానలో తడుస్తూనే వడివడిగా నడుస్తున్నట్టు, తడవడం ఇష్టం లేక ఏ మూల ఇంత నీడ (షేడ్) దొరికినా దూరిపోయి, అకాల వానను తిట్టుకున్నట్టు, తప్పించుకునే వీల్లేక వానలో